Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
ఏలినాటి శని అంటే ఏమిటి...?దేవుళ్ళను సైతం వదలని శనేశ్వరుడు..!
శని గ్రహము విశ్వమును చుట్టి వచ్చుటకు ముప్పై సంవత్సరములు పడుతుంది . శని గ్రహము తనకక్ష్యలో పరి భ్రమణము చేస్తూన్నప్పుడు ఒక్కొక్క రాశిలో రెండున్నరసంవత్సరముల చొప్పున పన్నెండు రాశులలో ౩౦ సంవత్సరములు పడుతుంది .
ఇలా సంచరిస్తున్నప్పుడు ౩౦ సంవత్సరములలో ఏడున్నర సంవత్సరములు ప్రతి మానవుని భాధిస్తాడు . ఎవరికైనా జన్మ రాశితో పాటు , జన్మరాశికి ఇరువైపులా ఉన్న రాశులలో శని సంచరించు కాలమును ఏలిన నాటి శని అంటారు .
ఈ ఏల్నాటి శనిదోషం ఏడున్నర సంవత్సరములు ఉంటుంది. ఈ శనిదోషం చంద్రాత్తు ఏర్పడుతుంది. మనఃకారకుడైన చంద్రుడి మీద శని సంచారం వల్ల శనిదోషం ఏర్పడగలదు. చంద్రుడికి వ్యయస్థానము నందు అనగా రాశికి వ్యయ స్థానము నందు సంచరించడం.

1. వ్యయ స్థాన సంచారం వల్ల ఊహించని ఖర్చులు అధికమవ్వడం, అశాంతి, సుఖం లేకపోవడం, ఆందోళన వంటివి ఉండగలవు.
2. జన్మము మీద లేక రాశి మీద శని సంచారం వల్ల ఆరోగ్యములో అధికమైన సమస్యలు తలెత్తడం, పరస్పర అవగాహనాలోపం, మనిషి క్షీణించడం, చికాకులు వంటివి ఉండగలవు.
3. ధన, కుటుంబ, వాక్ స్థానము నందు శని సంచారం వల్ల విరోధులు పెరగటం, అపజయం, తొందరపడి సంభాషించడం, ఆర్థిక ఒడిదుడుకులు, వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో పనిభారం పెరగడం, పెద్దలకు వీడ్కోలు పలకడం వంటివి ఉండగలవు.

అర్ధాష్టమ శనిదోషం: అర్ధష్టమ శనిదోషం అనగా రాశి నుంచి 4వ స్థానము నందు శని సంచారం జరగడం. ఈ శని సంచారం వల్ల ప్రమాదాలు జరుగడం, విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపం, పెద్దల గురించి ఆందోళన, ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు వంటివి ఉండగలవు.
అష్టమ శనిదోషం: అష్టమ శనిదోషం అనగా రాశి నుంచి 8వ స్థానము నందు శని సంచారాన్ని అష్టమ శనిదోషం అంటారు. ఈ అష్టమ శనదోషం వల్ల ఆయుఃప్రమాణం తగ్గడం, ఆరోగ్యములో చికాకులు అధికమవ్వడం, ఆందోళనలు వంటివి ఉండగలవు.

ఈ శని దోషం ప్రభావం చేత దేవతలు సైతం ఇబ్బందులకు నోనయ్యారు.
1. హిరణ్యకశిపుడు మహా బలశాలి. శ్రీమన్నారాయణుడు కూడా హిరణ్యకశిపుడి బారిన పడినవాడే. అంత బలీయమైన ఈ రాక్షసుడు శనిదోషం వల్ల బలవత్తరమైన మరణం పొందాడు.
2. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా 14 సంవత్సరములు శనిదోషం వల్ల అరణ్యవాసం చేశాడు. వానరులతో స్నేహం చేయడం, వారి సాయం పొందడం, ఈ దోష నివారణానంతరం రావణాశురునిపై జయం పొందాడు.
3. నలమహారాజు శనిదోషం వల్ల రూపం మారిపోయి ఏడున్నర సంవత్సరములు వంటవానిగా జీవితం సాగించాడు.

4. ద్వాపర యుగంలో పాండవులు ఈ శనిదోషం వల్ల 14 సంవత్సరములు అజ్ఞాతవాసం చేసి అడవుల వెంట తిరిగి నానా ఇబ్బందులు పడ్డారు.
5. ఈశ్వరుడు కూడా శనిదోషం వల్ల చెట్టు తొఱ్ఱలో దాక్కున్నాడు.
వీరి అందరి అనుభవాలను గ్రహించి మనం శని దోషాలకు శాంతి చేసి శనిని పూజించి ఆరాధించినట్లయితే సర్వదా శుభం కలుగుతుంది. శని సూర్యభగవానుడి కుమారుడు. యముడికి అన్నగారు అవుతారు. వర్తమానం ఈ శని ఉత్తర వాయవ్య భాగంలో సంచరించడం వల్ల ఆ వైపు తిరిగి శనిని పూజించి ఆరాధించినట్లయితే దోషాలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications