For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కో ఉగాదికి ఒక్కో పేరు ఎందుకు వచ్చింది ? వాటి ఆంతర్యం ఏంటి ?

By Swathi
|

హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈ రోజుని ఉగాదిగా భావిస్తారు. కొత్త జీవితం ప్రారంభించడమనే అర్థం ఇందులో మిలితమై ఉంది. అలాగే ఉగాది అంటే కొత్త తెలుగు సంవత్సరం ( క్యాలెండర్ ) ప్రారంభమవుతుందని సూచిస్తుంది. అందుకే ఉగాది రోజు దేవాలయాల్లో పంచాగ శ్రవణం చదివి వినిపిస్తారు. ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో జరుపుకుంటారు. ఉగాది అనేది యుగ, ఆది అనే పదాల నుంచి వచ్చింది. అంటే.. కొత్త శకం ప్రారంభమని అర్థం వస్తుంది. అందుకే ఈ పండుగను ఉగాది అని పిలుస్తారు.

కొత్త సంవత్సరానికి గుర్తుగా.. మొదటి కాపుకి వచ్చిన వాటితో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేప పూత, మిరియాలు, ఉప్పు కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి పధార్థానికి ఒక విశిష్ఠత ఉంది. బెల్లం సంతోషానికీ, వేప దు:ఖానికి ప్రతీకలు. జీవితంలో సుఖాలనూ, దు:ఖాలనూ, సమభావంతో చూడాలన్నదే ఇందులోని అంతరార్థం. వేపపువ్వు దేహదారుఢ్యాన్ని కలిగించి సర్వారిష్టాలను తొలగించి పూర్ణాయుష్షును ప్రసాదిస్తుంది. కాబట్టి ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి.

అయితే ఉగాదిని ప్రతి ఏడాది జరుపుకుంటాం. ఒక్కో సంవత్సరం, ఒక్కో పేరుతో ఉగాదిని పిలుస్తారు. ఇలా ఉగాదికే ఎందుకు ఈ ప్రత్యేకత ? ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చింది ? అంటే.. పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే.. ఈ తెలుగు సంవత్సరాలట. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో.. ప్రతి ఉగాదికి అవే పేర్లుగా మారిపోయాయి. ఈ ఏడాది వస్తున్న ఉగాది పేరు దుర్ముఖి నామ సంవత్సరం. ఇప్పుడు ఆయా ఉగాది సంవత్సరాలు, వాటి అర్థాలు.. ఆ పేర్ల వెనక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలనుందా ? అయితే వెంటనే ఈ స్లైడ్స్ క్లిక్ చేయండి మరి..

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ప్రభవ. ఈ పేరుకి అర్థం ఎక్కువగా యజ్ఞయాగాలు అని అర్థం. విభవ నామ సంవత్సరం అంటే.. ప్రజలకు సుఖసంతోషాలు అని అర్థం వస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

శుక్ల నామ సంవత్సరం అంటే.. సమృద్ధిగా పంటలు పండాలని సంకేతం. అలాగే ప్రమోద్యూత నామానికి అందరికీ ఆనందం అని అర్థం వస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ప్రజోత్పత్తి నామ సంవత్సరం అంటే.. అన్నింటా అభివృద్ధి చెందాలని సూచిస్తుంది. ఆ తర్వాత వచ్చే అంగీరస నామ సంవత్సరానికి భోగభాగ్యాల సిద్ధి అని అర్థం ఉంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

శ్రీముఖ నామ సంవత్సరం అంటే వనరులు సమృద్ధిగా అందాలని చెబుతుంది. ఆ తర్వాత వచ్చే భావ నామ సంవత్సరానికి సద్భావనలు, ఉన్నత భావనలు కలిగి ఉండాలని అర్థం.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

యువ నామ సంవత్సరం అంటే.. సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలతో ప్రజలు సుఖంగా ఉండాలని తెలుపుతుంది. ధాత నామ సంవత్సరం అనారోగ్యబాధలు తగ్గుతాయని ఆశీర్వదిస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈశ్వర నామ సంవత్సరం అంటే.. క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బాహుధాన్య నామ సంవత్సరం దేశమంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని చెబుతుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ప్రమాది నామ సంవత్సరం అంటే.. వర్షాలు మధ్యస్థంగా ఉంటాయని తెలుపుతుంది. విక్రమ నామ సంవత్సరానికి సమృద్ధిగా పంటలు, విజయాలు సాధిస్తారనే అర్థం ఉంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

వృష నామ సంవత్సరానికి సమృద్ధిగా వర్షాలు పడతాయని అర్థం ఉంది. ఆ తర్వాత వచ్చే చిత్రభాను నామం సంవత్సరం అంటే.. అంచనాలకు అందని ఫలితాలు పొందుతారని అర్థం.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

స్వభాను నామ సంవత్సరం అంటే.. ప్రజలకు క్షేమం, ఆనందం, ఆరోగ్యం అందుతాయని అర్థం. తారణ నామ సంవత్సరం అంటే.. సరైన సమయంలో సకాల వర్షాలు కురుస్తాయని అర్థం.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

పార్థివ నామ సంవత్సరం అంటే.. ఐశ్వర్యం, సంపదలు ఎక్కువగా ఉంటాయని అర్థం. ఆ తర్వాత వచ్చే వ్యయ నామ సంవత్సరానికి అతివృష్టి, అధికఖర్చు అని అర్థం వస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

సర్వజిత్ నామ సంవత్సరం అంటే.. సంతోకరంగా వర్షాలు వస్తాయని అర్థం. సర్వధారి సంవత్సరం అంటే.. దేశం సుభిక్షంగా ఉండాలనే అర్థం వస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

విరోధి నామ సంవత్సరం అంటే.. వర్షాలు తగ్గుముఖం పడతాయని అర్థం. అలాగే వికృత నామ సంవత్సరం అంటే.. అశుభ ఫలితాలని అర్థం ఉంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఖర నామ సంవత్సరం అంటే.. సామాన్య పరిస్థితులు అని అర్థం. ఆ తర్వత వచ్చే నందన నామ సంవత్సరానికి ప్రజలకు ఆనందం కలుగుతుందనే అర్థం వస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

విజయ నామ సంవత్సరానికి శత్రుజయమని అర్థం. అలాగే జయ నామ సంవత్సరానికి కార్యసిద్ధి, ప్రజలకు లాభం కలుగుతుందని సూచిస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఇక మన్మధనామ సంవత్సరానికి భోగభాగ్యాలు, ఆరోగ్యం అనే అర్థం ఉంది. ఇక ఈ ఏడాది వస్తున్న దుర్ముఖి నామ సంవత్సరానికి ఇబ్బందులు ఉన్నా క్షేమకర ఫలితాలు పొందుతారని సూచిస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

హేవళంబి నామ సంవత్సరానికి ప్రజలకు ఆనందం, విళంబి నామ సంవత్సరానికి సుభిక్షంగా ఉంటారనే అర్థం వస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

వికారి నామ సంవత్సరం అంటే.. శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని సూచిస్తుంది. శార్వరి నామ సంవత్సరం అంటే.. సామాన్యంగా పంటల దిగుబడి ఉంటుందని సూచిస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ప్లవ నామ సంవత్సరం అంటే.. సమృద్ధిగా నీటి వనరులు అందుతాయని తెలుపుతుంది. శుభక్రుతు నామ సంవత్సరం అంటే.. ప్రజలకు ఆనందం అని సూచిస్తుంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఆ తర్వాత వచ్చే శోభక్రుతు నామ సంవత్సరానికి ప్రజలకు సుఖ సంతోషాలు అందుతాయని సూచిస్తుంది. క్రోధి నామ సంవత్సరానికి కోపస్వభావంతో సామాన్యఫలాలు పొందుతారని అర్థం ఉంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

విశ్వావసు నామ సంవత్సరం అంటే.. సమృద్ధిగా ధనయోగం, పరాభవ నామ సంవత్సరం అంటే.. ప్రజలకు అపజయాలు అని అర్థం.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ప్లవంగ నామ సంవత్సరం అంటే.. నీటి వనరులు అధికం, కీలక నామ సంవత్సరం అంటే.. పంటలు బాగా పండుతాయని అర్థం.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

సౌమ్య నామ సంవత్సరం అంటే.. శుభఫలితాలు అధికమని, సాధారణ నామ సంవత్సరం అంటే సామాన్య ఫలితాలని అర్థం.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

విరోధికృత్ నామ సంవత్సరానికి ప్రజల్లో విరోధభావాలు, పరీభావి సంవత్సరానికి ప్రజల్లో భయాలు అనే అర్థం ఉంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ప్రమాదీచ నామ సంవత్సరానికి ప్రమాదాలు అధికం, ఆనంద నామ సంవత్సరానికి ప్రజలకు ఆనందం అని అర్థం.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

రాక్షస నామ సంవత్సరం అంటే దుస్సంఘటనలు ఎక్కువగా ఉంటాయని తెలుపుతుంది. ఆ తర్వాత వచ్చే నల నామ సంవత్సరానికి పంటలు బాగా పండుతాయనే అర్థం ఉంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

పింగళ నామ సంవత్సరానికి సామాన్య ఫలితాలు, కాళయుక్తి నామ సంవత్సరానికి కాలానికి అనుగుణమైన ఫలితాలు అనే అర్థం ఉంది.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

సిద్ధార్థి నామ సంవత్సరం అంటే అన్నింటా కార్యసిద్ధి, రౌద్రి నామ సంవత్సరం అంటే ప్రజలకు చిన్నపాటి బాధలు అని అర్థం.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

దుర్మతి నామ సంవత్సరానికి వర్షాలు సామాన్యం, దుందుభి నామ సంవత్సరానికి క్షేమం, ధాన్య సమృద్ధి అని అర్థం.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

రుధిరోద్గారి నామ సంవత్సరానికి ప్రమాదాలు ఎక్కువ అనే అర్థం ఉంది. రక్తాక్షి నామ సంవత్సరం అంటే.. సామాన్య ఫలితాలు, అశుభాలకు సంకేతం.

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

ఈ ఏడాది వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ?

క్రోధన నామ సంవత్సరానికి విజయాలు సిద్ధిస్తాయని అని అర్థం. చివరి సంవత్సరమైన అక్షయ నామ సంవత్సరానికి సంపదలు అధికమని సూచిస్తాయి.

English summary

What is the meaning Ugadi Meaning and Significance of 60 Years

Desktop Bottom Promotion