For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నదిలో, కొలనులో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా...

|

మనం నిత్యం ఏదో ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే మనం చేసే జర్నీలో మనకు అప్పుడప్పుడు నదులు, కాలువలు కనబడుతూ ఉంటాయి. అందులో కొన్ని ఉపనదులు కూడా ఉంటాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే గోదావరి, క్రిష్ణా ప్రధాన నదులుగా ఉన్నాయి. ఇక ఉపనదులు చాలానే ఉన్నాయి.

గోదారమ్మను దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో కావేరి, తుంగభద్ర, పెన్నా, పంపా నదితో పాటు ఇంకా ఎన్నో నదులున్నాయి. ఇక ఉత్తరభారతంలో అయితే ప్రపంచంలోనే పెద్ద నదుల్లో ఒకటైన గంగా నది అనేక రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది.

ఈ నదులపై ఆధారపడి మనం జీవిస్తున్నాం. అంతేకాదు ఈ నదుల నుండి లభించే నీటి వల్లే వ్యవసాయం, పరిశ్రమ ఉత్పత్తులు మనకు అందుతున్నాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మనలో చాలా మంది నదుల మధ్య ప్రయాణించేటప్పుడు నదిలోకి నాణేలు వేస్తూ ఉంటారు. అంతేకాదు నదులను ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

ఈ సందర్భంగా నదుల్లో లేదా సరస్సులలో నాణేలను ఎందుకు వేస్తారు.. నదులను ఎందుకు పూజిస్తారు? ఇలా నదుల్లో నాణేలు వేయడానికి గల కారణాలేంటి? దేవుని దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి కచ్చితంగా వేయాలా అనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మంగళవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...!మంగళవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...!

భక్తిశ్రద్ధలతో..

భక్తిశ్రద్ధలతో..

మనలో చాలా మంది ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు అక్కడ స్నానం చేసేందుకు కోనేరు, నది, సరస్సుల్లోకి వెళ్తుంటారు. ఆ సమయంలో అందరూ భక్తి శ్రద్ధలతో నదిలో స్నానం చేసి దేవుని దర్శనానికి బయలుదేరుతారు. అదే సమయంలో నదిలో దీపాలను వదులుతారు. కొందరు కొబ్బరికాయలు, నాణేలను వేస్తుంటారు. ఇలాంటి సమయంలో చాలా మందికి దీనిపై ఒక డౌట్ వస్తుంది. అప్పుడు అక్కడున్న పెద్దలను అడిగితే.. ఎవ్వరూ సరిగ్గా సమాధానం చెప్పరు. పైగా ఇలాంటి ప్రశ్నలడిగితే ఇంకోసారి ఎదురుప్రశ్నలు వేయద్దంటూ కోప్పడతారు.

రాగి నాణేలున్నప్పుడు..

రాగి నాణేలున్నప్పుడు..

ఇప్పటిమాదిరిగా ఇనుప ముక్కలు, ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు అప్పట్లో ఉండేవి కాదు. అప్పట్లో అంతా రాగి నాణేలు ఉండేవి. వాటిని ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుందని చాలా మంది నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసే వారు. అప్పటి రాజ్యంలో ఉండే వారు ఆ విషయంపై అందరికీ అవగాహన కల్పించారు. ఎందుకంటే రాగి పాత్రలకు, రాగి నాణేలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది.

నది శుభ్రమవుతుందని..

నది శుభ్రమవుతుందని..

రాగి నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, దాని వల్ల మనం నీరు తాగేందుకు పనికొస్తుందని అప్పట్లో ఆ పనిని విధిగా చేసేవారు. ఎందుకంటే అప్పటి కాలంలో అందరూ నదిలో లభించే నీళ్లనే తాగేవారు. ఇప్పటిమాదిరిగా అప్పట్లో ఫిల్టర్లు లేవు. అందుకే రాగి నాణేలను నీటిలో వేసి నీటిని శుభ్రపరిచేవారు. పూర్వకాలం నుండే ఈ విధంగా నదిలో నాణేలు వేయడం ఒక ఆచారంగా ఉండేది.

శనివారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనొద్దు...!శనివారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనొద్దు...!

ఇప్పటి నాణేలు వేయొద్దు..

ఇప్పటి నాణేలు వేయొద్దు..

ప్రస్తుతం రాగి నాణేలన్నీ కనుమరుగు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్న నాణేలని నదిలో వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీటి వల్ల నీరు శుభ్రం కాదు. పైగా ఇప్పుడు వాడుతున్న నాణేలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది.

మరో ప్రమాదం..

మరో ప్రమాదం..

మీరు రైలులో, బస్సులో, ఇంకెక్కడి నుండైనా ప్రయాణించేటప్పుడు పై నుండి నదిలోకి నాణేలు వేయడం వల్ల కింద ఉండే చిన్నారులు, ఇతరులు ఆ నాణేల కోసం తమ ప్రాణాలను పణంగా నీళ్లలోకి దూకుతున్నారు. దీంతో వారికి ఏదైనా జరగరాని ప్రమాదం జరగొచ్చు. కాబట్టి ఇక నుండైనా నదిలో నాణేలు వేయకండి. ఒకవేళ రాగి నాణేలు దొరికితే నిరంభ్యంతరంగా వేయండి.

కొబ్బరికాయలు కూడా..

కొబ్బరికాయలు కూడా..

అలాగే కొందరు కొబ్బరికాయలు కొట్టి మరీ నదిలోకి విసిరేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల నది నీళ్లు పాడవుతాయి. ఇదే విషయాన్ని పర్యావేరణ వేత్తలు ఎన్నోసార్లు చెప్పారు. ప్రక్రుతి ప్రేమికులు ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నారు.

English summary

What is the reason behind Indians dropping coins in to holy rivers and praying?

Here we are talkin about the what is the reason behind Indians dropping coins in to holy rivers and praying?. Read on
Story first published: Monday, July 5, 2021, 17:48 [IST]