For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ నుండి ఉత్పన్నమయ్యే శక్తి ఎటువంటిదో మీకు తెలుసా ?

మీ నుండి ఉత్పన్నమయ్యే శక్తి ఎటువంటిదో మీకు తెలుసా ?

|

మనం కేవలం శరీరాన్ని కలిగి ఉండి, నడుస్తున్నామా? కేవలం ఆహారం, పానీయాలతో శక్తిని సముపార్జన చేసుకుంటున్నామా? కాదనే చెప్పాలి. మనకు తెలీని సూక్మ్నమైన శక్తిని కూడా మనం కలిగి ఉన్నాం.

ఇది కనిపించని శక్తిగా ఉంటుంది. మరియు ఆహారం , పానీయాల ద్వారా పొందలేని శక్తి. ఈ కనిపించని సూక్షమైన శక్తి పురాతన వేద గ్రంథాలలో “ప్రాణం” గా వర్ణించబడింది మరియు ఇది తూర్పు దేశాలలో 'చి' గా పిలువబడుతుంది. క్రైస్తవత్వంలో “పవిత్రాత్మ” అని పిలవబడుతుంది. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరుగా పిలవబడుతున్న శక్తి మాత్రం ఫలితాలను ఒకేలా ఇస్తుంది.

మన శక్తి గురించి మనం తెలుసుకోవలసినది ఎంతో ఉంది. మరింత అవగాహన కలిగి ఉండడం తద్వారా ఎన్నో సానుకూల ఫలితాలను కూడా పొందగలము. ఈ అవగాహన మానసిక సంతోషానికి దారులు తెరుస్తుంది మరియు అత్యుత్తమ ఫలితాలకు దారితీస్తుంది. ఈ అంతులేని అనంతమైన శక్తి ఎలా ఉంటుంది , మరియు ఇది ఎలా యోగా, ఆధ్యాత్మికత మరియు జ్యోతిష శాస్త్రంతో సంబంధం కలిగివుందో చూద్దాం.

What Kind Of Energy Do You Radiate

మనిషి జీవితంలో ఎదో ఒక సందర్భంలో నీరసించినట్లు కనిపిస్తాడు, దీనికి కారణం మానసిక సంతృప్తి లేకపోవడమే. దీనికి తెలీకుండా శరీరంలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న శక్తి ఎంతగానో ప్రభావితo చేస్తుంది. ఇలాంటి సందర్భాలలో కొన్నిటిని పాటించడం ద్వారా ఆ శక్తిని తిరిగి పొందే వీలు ఉంది. తద్వారా శరీరం అనంత శక్తితో కూడుకుని నూతనోత్సాహంతో అడుగులు వేస్తుంది.

మానవ శరీరంలో ఉన్న వెన్నుముకలో ఏడు అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు వెన్నెముక చివరిభాగo నుండి నాడీ కణజాలం ద్వారా మెదడు కణాలను కలుస్తుంది. ఈ గుర్తులను చక్రాలుగా పిలుస్తారు. వరుసగా, అవి క్రింది విధంగా ఉన్నాయి.

మొదటి చక్రాన్ని ములాధార చక్రo అని పిలుస్తారు మరియు ఇది వెన్నుపాము స్థావరం వద్ద ఉంటుంది. భద్రతాభావాలను కలుగజేసే ఈచక్రం స్థిరంగా ఉన్నవారికి జీవితం చక్కగా ఉంటుంది అని చెప్పబడినది. రెండవ చక్రo కటి ప్రాంతం వద్ద ఉంటుంది. దీనిని స్వాదిష్టాన చక్రం అని పిలుస్తారు. ఇది పంచేద్రియాల భావాలను, స్పర్శలను నిర్వహిస్తుంది మరియు భావోద్వేగాలకు చెందిన చక్రంగా దీనికి పేరు. మూడవది నాభి స్థానంలో ఉన్న ఉన్న మణిపుర చక్రo. ఈ మణిపుర చక్రంలో, మానసిక స్థితిగతులు మరియు, ఆత్మనిగ్రహం ఆధీనంలో ఉంటాయి.

అనాహత చక్రoగా పిలువబడే నాల్గవ చక్రo గుండె దగ్గర ఉంటుంది. ఇది ప్రేమ, ఆవేశం, భావోద్వేగాలకు కేంద్రమైన చక్రంగా ఉంటుంది. గొంతు వద్ద ఉన్న చక్రాన్ని విశుద్ద చక్రo అని అంటారు. సృజనాత్మకతకు, భావ వ్యక్తీకరణకు కేంద్రంగా ఉంటుంది. తదుపరి చక్రం కళ్ళ మధ్య ఉన్న ఆజ్ఞా చక్రo. దీనిని అంతర్భుద్ధి కేంద్రంగా మరియు త్రినేత్రంగా పిలుస్తారు. ఇది చక్కగా పని చేసేవారికి విషయాలపై అవగాహన మెండుగా ఉండి, అంచనాలు సరిగ్గా వేయగలిగేలా ఉంటారు. సహస్రార చక్రం తల పైన చివరిదిగా ఉంటుంది. అన్ని చక్రాలలోనూ అత్యంత ముఖ్యమైన చక్రంగా ఈ సహస్రార చక్రం ఉంటుంది. ప్రతి ఒక్క ఆలోచనకూ, నిర్ణయానికి, మానసిక సంతోషాలకు, భావోద్వేగాలకు ప్రతి ఒక్క అంశానికి ఈ చక్రమే ప్రధాన పాత్ర పోషిస్తుంది.


ఈ చక్రాలు శక్తి ప్రవాహాన్ని, శరీరంలో కనిపించని శక్తిని నియంత్రిస్తాయి. శక్తి ప్రవాహంలో ఏదైనా అడ్డంకి ఉన్న ఎడల, ఒక వ్యక్తి యొక్క మానసిక లేదా శారీరక ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. కాబట్టి, శరీరంలో అన్ని శక్తుల ప్రవాహాన్ని ఇవి నిర్వహిస్తాయి.


ఈ శక్తులు వివిధ పొరలలో నిర్వహించబడతాయి. ఈ పొరలను ఆరియ క్షేత్రం, ఎథెరిక్ శరీరం మరియు భావోద్వేగ శరీరం అని కూడా పిలుస్తారు. ఆరియ క్షేత్రం మనస్సు యొక్క స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇది ఎటువంటి పరిస్థితులలో అయినా నిర్ణయం తీసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ శక్తులు మన ఆలోచనలు మరియు మనస్థితిని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ మానసిక స్థితులు చేసే పనిని ప్రభావితం చేస్తాయి. ఆరియ క్షేత్రాన్ని మెరుగుపరచడానికి, జ్యోతిష్కులు కొన్ని రత్నాలను ధరించమని సూచిస్తారు. ఈ రత్నాలు జన్మ కుండలిని అనుసరించి సూచించడం జరుగుతుంది. అనగా జన్మ కుండలిలోని గ్రహ స్థితులను ఉద్దేశించి ఈ రత్నాలను సూచించడం జరుగుతుంది. తద్వారా మానసిక, ఆరోగ్య సమస్యలు తొలగి సానుకూల అంశాలతో జీవనం సంతోషంగా నడుపబడుతుంది.

మీరు సంతోషంగా మరియు ఆహ్లాదకరముగా ఎల్లప్పుడూ ఉండే వ్యక్తిని కలుసుకున్నప్పుడు మీరు కూడా అటువంటి లక్షణాలకు ప్రేరేపించబడడం గమనించారా ? అదే విధంగా ఒక విచారంగా ఉన్న వ్యక్తి ఇతరులను కూడా విచారపరచేలా చేయగలడు. ఈ విధంగా, అక్కడ ఉన్న శక్తితో మనము కట్టుబడి ఉంటాము అన్నది నిజం.


వ్యక్తిలోని ప్రవహించే శక్తి స్థాయిల వలన ఇది జరుగుతుంది. శక్తి ప్రభావితం ఎవరి వలన అయితే జరుగుతుందో, ఆ వ్యక్తి యొక్క శక్తి , అతని మానసిక బలం మరియు శక్తి యొక్క పౌనఃపున్యం ద్వారా నిర్ణయించబడుతుంది.


కొన్ని పద్దతులు, శక్తి యొక్క ప్రవాహంలో అడ్డంకిని తొలగించడానికి మాత్రమే కాకుండా, ఈ శక్తుల పౌనఃపున్యాన్ని పెంచడం మరియు వాటి ఆరోగ్యకరమైన ప్రవాహాన్ని నియంత్రించడం వంటివి కూడా చేస్తాయి.


ఇటువంటి పద్దతులలో యోగా పద్ధతులు మరియు ఆక్యుపంక్చర్ వైద్య మార్గాలు ముఖ్యమైన మార్గాలుగా ఉన్నవి. మరియు ఆధ్యాత్మికత, దాతృత్వం, మరియు ప్రార్ధన ఇటువంటి ఇతర చర్యలు మానసిక సంతృప్తిని మరియు శాంతిని తీసుకురావడంతో పాటు వ్యక్తి యొక్క అంతరాత్మని దగ్గరికి తీసుకురావడంతో పాటు ఈ శక్తి నాణ్యత మరియు పౌనఃపున్యాలు పెరుగుతున్నాయి.


తద్వారా మానసిక బలహీనతకు లోనైనప్పుడు, ఆత్మ స్థైర్యాన్ని కోల్పోతున్నాము అన్న భావనకు లోనైనప్పుడు, జ్యోతిష్య నిపుణులను సంప్రదించి వారి సూచనలను పాటించడం ద్వారా కానీ, యోగా మరియు ఆద్యాత్మిక ధోరణిని అలవరచుకోవడం ద్వారా కానీ, సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కానీ మానసిక సంతృప్తికి లోనవుతారు.

English summary

What Kind Of Energy Do You Radiate

Our physical body carries along with it a subtle energy, which is known as the Prana, the Holy Spirit or Chi. The flow and the quality of this energy is regulated by the seven points located in the spinal cord, which finally connect it to the brain. The quality and frequency of this energy can be increased through spiritual practices.
Story first published: Friday, May 4, 2018, 18:03 [IST]
Desktop Bottom Promotion