For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్జునుడు శివుడిపైకే విల్లు ఎక్కు పెడతాడు, శివుణ్నే చంపేయాలనుకుంటాడు, ఎందుకంటే..

ఒక్క బాణం కూడా కిరాతకుడికి తగలేదు. అస్సలు అతనికి దరికే వెళ్లదు. కానీ కిరాతకుడి ఒక్క బాణం వేయగానే అర్జునుడు కింద పడిపోతాడు. విలు విద్యలో నా అంతటోడే లేడు అనుకుంటే ఇతను ఎవరూ నన్నే కిందపడేశాడని బాధపడతాడు.

|

ఇంద్రుడి దగ్గర ఎంతో మహిమ గల అస్త్రాలు తీసుకునేందుకు అర్జునుడు ఇంద్రలోకం వెళ్తాడు. ధర్మరాజు చెప్పిన మాట ప్రకారం అర్జునుడు అక్కడికి వెళ్తాడు. అయితే ఇంద్రుడు అక్కడికి వెళ్లాక అర్జునుడికి ఒక షరతు విధిస్తాడు. అర్జునా నువ్వు పరమశివుడిని ప్రసన్నం చేసుకోగలిగితేనే నీకు ఆ అస్త్రాలు లభిస్తాయంటాడు. తర్వాత అర్జునుడు ఇంద్రకీలా పర్వతంపై పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు. కానీ ఆ బోలాశంకరుడు అస్సలు ప్రత్యక్షం అవ్వడు. అర్జునుడిని చాలా పరీక్షిస్తాడు. తర్వాత శివుడే స్వయంగా అర్జునుణ్ని పరీక్షించేందుకు బయల్దేరుతాడు.

మూకాసురుడు అడవి పందిగా మారిపోతాడు

మూకాసురుడు అడవి పందిగా మారిపోతాడు

పరమేశ్వరుడు అర్జునుడు తపస్సు చేసే ప్రాంతానికి మూకాసురున్ని పంపుతాడు. మూకాసురుడు ఒక అడవి పంది రూపంలోకి మారిపోతాడు. ఇక తర్వాత పరమేశ్వరుడు కిరాతకుడిగా మారిపోతాడు. శివుడి చేతిలోని త్రిశూలం విల్లుగా మారుతుంది. శివుడి తలపై ఉండే నెలవంక కిరాతకుడి తలపై నెమలిఈక మాదిరిగా మారిపోతుంది. ఇక శివుడి మెడలోని రుద్రాక్షలన్నీ కిరాతకుడికి పూసల దండగా మారుతాయి. పరమేశ్వరుడి సతీమణి పార్వతీ మాత కిరాతకుడి భార్యగా మారిపోతుంది.

ఏందయ్యా నీ గొడవ అంటూ వాదనకు దిగుతాడు

ఏందయ్యా నీ గొడవ అంటూ వాదనకు దిగుతాడు

మూకాసురుడు పంది రూపంలో అర్జునుడి తపస్సును భంగం కలిగించడానికి శత విధాలా ప్రయత్నం చేస్తాడు. అర్జునుడికి విసుగు వస్తుంది. తర్వాత పందిపై బాణాలు వదులుతాడు అర్జునుడు. అలాగే కిరాతకుడి రూపంలో ఉన్న శివుడు కూడా బాణాలు వేస్తాడు. ఆ బాణాలు పందికి తగిలి చనిపోతుంది. పందిని తానే చంపానని కిరాతకుడు అంటాడు. లేదు నేను చంపాను అని అర్జునుడు అంటాడు. ఏందయ్యా నీ గొడవ... అంటూ అర్జునుడిపై కిరాతకుడు వాదనకు దిగుతాడు. నాలాగా విలువిద్యలో ఆరితేరిన వారు ఎవరూ ఉండరు. కచ్చితంగా ఆ పంది నా బాణానికే చనిపోయిందని అంటాడు అర్జునుడు.

రోజూ జంతువులను వేటాడుతూ ఉంటాం

రోజూ జంతువులను వేటాడుతూ ఉంటాం

అయితే కిరాతకుడు అర్జునుడి మాటలు అస్సలు లెక్కచేయడు. ఏందయ్యా నువ్వు భలే మాట్లాడుతున్నావ్.. మేము రోజూ జంతువులను వేటాడుతూ ఉంటాం. మా వృత్తే అది అని అంటాడు. దీంతో అర్జునుడికి కోపం వస్తుంది. తర్వాత కిరాతకుడు అర్జునుడి పైకి బాణం వదులుతాడు. అలా ఆ గొడవ ఇద్దరి మధ్య యుద్దానికి దారి తీస్తుంది. అర్జునుడు కిరాతకుడిపైకి బాణాల వర్షం కురిపిస్తాడు.

అర్జునుడు కింద పడిపోతాడు

అర్జునుడు కింద పడిపోతాడు

అయితే ఒక్క బాణం కూడా కిరాతకుడికి తగలేదు. అస్సలు అతనికి దరికే వెళ్లదు. కానీ కిరాతకుడి ఒక్క బాణం వేయగానే అర్జునుడు కింద పడిపోతాడు. విలు విద్యలో నా అంతటోడే లేడు అనుకుంటే ఇతను ఎవరూ నన్నే కిందపడేశాడని బాధపడతాడు. బాణం దెబ్బకు విలవిలలాడుతూ వెంటనే మల్లయుద్ధానికి పాల్పడుతాడు అర్జునుడు. శివుడితో శక్తి మేరకు పోరాడుతాడు.

ముల్లోకాలు మొత్తం దద్దరిల్లిపోతాయి

ముల్లోకాలు మొత్తం దద్దరిల్లిపోతాయి

తర్వాత చివరకు విల్లు సంధిస్తాడు. కానీ ముల్లోకాలు మొత్తం దద్దరిల్లిపోతాయి. అప్పడు అర్జునుడికి అర్థం అవుతుంది. కిరాతకుడి రూపంలో ఉన్నది సాక్షాత్తు ఆ పరమశివుడేనని. ఆయన పక్కన నిల్చున్నది పార్వతీదేవిఅని. వెంటనే తన తప్పును తెలుసుకుని పరమేశ్వరుడి కాళ్లపై పడుతాడు. శివుడు చిన్నగా నవ్వుతూ అర్జునుణ్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. అలాగే దిక్పాలకుల ద్వారా అస్త్రాలు పొందుతాడు.

Image Credit (all images)

English summary

whats the story behind arjuna and shiva fight

whats the story behind arjuna and shiva fight
Desktop Bottom Promotion