For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

When is Ramadan 2022:ఈ ఏడాది రంజాన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా...

2022లో రంజాన్ ఎప్పుడొచ్చింది? భారతంలో ఎప్పుడు ప్రారంభమవుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రపంచంలోని ముస్లింలందరికీ రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో 30 రోజుల పాటు చాలా మంది ముస్లింలు ఉపవాసం ఉంటారు.

When is Ramadan 2022 : Ramadan 2022 Start Date, When Will Islamic Holy Month Begin In India

అనంతరం ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ సంబురాలను జరుపుకుంటారు. చందమామ కనిపించడంతోనే ఈ పండుగ ప్రారంభమవుతుంది.. ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రంజాన్ మాసంలో మరణించిన వారు నేరుగా స్వర్గానికి పోతారని చాలా మంది ముస్లింలు నమ్ముతారు.

When is Ramadan 2022 : Ramadan 2022 Start Date, When Will Islamic Holy Month Begin In India

ఎందుకంటే ఈ కాలంలో నరకం తలుపులు మూసి ఉంటాయని వారి నమ్మకం. ఈ పవిత్రమైన మాసంలో రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయడంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు. అలాగే మసీదుల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమకు కష్టాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ మాసం దానధర్మాలకు కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో రంజాన్ పండుగ ఎప్పుడొచ్చింది? ఏరోజు నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రంజాన్ ఎప్పుడంటే..

రంజాన్ ఎప్పుడంటే..

ముస్లింలు రంజాన్ పండుగను నెల రోజుల పాటు జరుపుకుంటారు. ఈద్-ఉల్-ఫితర్ పండుతో ఇది ముగుస్తుంది. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీన ఆదివారం ఈ పండుగ ప్రారంభమవుతుంది. మే రెండో తేదీన ముగుస్తుంది. అనంతరం రంజాన్ పండుగను ఈద్ పేరిట మే మూడో తేదీన జరుపుకుంటారు. అయితే చంద్రుడి దర్శనం తర్వాతే వారి పండుగ తేదీని నిర్ణయిస్తారు.

రంజాన్ ప్రాముఖ్యత..

రంజాన్ ప్రాముఖ్యత..

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, రంజాన్ మాసం తొమ్మిదో నెల. దీనిని షబ్-ఎ-ఖద్ర్ అని అంటారు. ఈద్-ఉల్-ఫితుర్ పదో నెల మొదటి రోజున జరుపుకుంటారు. ఈ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండే సమయంలో కేవలం నీళ్లు తప్ప, ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. చాలా నిగ్రహంగా ఉంటారు. అలాగే శాంతంగా ఉంటారు. పేద వారికి ఈ కాలంలో దానం చేస్తారు. ఉపవాసం విడిచి పెట్టేది కేవలం సాయంకాలం తర్వాతే. రంజాన్ మాసంలో ప్రతి రోజూ ఉపవాసం తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. దీన్నే సహరీ అని అంటారు. సూర్యస్తమయం తర్వాత వారి ఉపవాసం ముగుస్తుంది. దీన్ని ఇఫ్తార్ అంటారు.

ఉపవాసం ఎందుకు?

ఉపవాసం ఎందుకు?

ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెలలో ముస్లింలు కచ్చితంగా ఉపవాసం ఉంటారు. పవిత్ర ఇస్లామిక్ గ్రంథం యొక్క మొదటి పద్యం ఖురాన్, ప్రవక్త మహమ్మద్ ను ఆవిష్కరించబడింది. దీని తర్వాత ఈ మాసాన్ని పవిత్రంగా భావించి ఉపవాసం ఉండే సంప్రదాయం ప్రారంభమైందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇస్లాం యొక్క ప్రాథమిక సూత్రాలలో ఐదో సూత్రాల్లో ఇవి ముఖ్యమైనవి. ప్రార్థన, దానం చేయడం, విశ్వాసం మరియు హజ్ తో పాటు ఉపవాసం. అయితే పిల్లలు, గర్భిణులు, ఏదైనా రోగంతో ఇబ్బంది పడేవారు, వయసు పైబడిన వారికి ఉపవాసం నుండి మినహాయింపు ఉంది.

రంజాన్ సంప్రదాయాలు..

రంజాన్ సంప్రదాయాలు..

ఈ మాసంలో మసీదులలో మత బోధకుల నుండి ఇంటి దగ్గర పెద్ద వారి మంచి జీవితాన్ని ఎలా గడపాలో మరియు ధర్మాన్ని అనుసరించడం గురించి బోధనలు వింటారు. ఇందులో భాగంగానే.. సొంత అవసరాలను తగ్గించడం ద్వారా ఇతరుల అవసరాలను తీర్చాలి.

ఇఫ్తార్ సమయంలో పేదలకు ఆహారం అందించడం వల్ల పాపాల విముక్తి లభిస్తుంది.

ఈ పవిత్రమాసంలో అన్ని రకాల చెడు ఆలోచనలకు దూరంగా ఉంటారు. అల్లాహ్ పై విశ్వాసం మరియు స్వచ్ఛమైన మనసుతో మాత్రమే ఉపవాసం ఉండాలి.

ఈద్ రంజాన్ పండుగను చివరి రోజున ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తమ తోటి వారికి ధన్యవాదాలు తెలుపుతారు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కొత్త బట్టలను ధరిస్తారు. చిన్నారులకు బహుమతులు, మిఠాయిలను ఇస్తారు.

గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్లో నుండి సేకరించి.. మాకు ఉన్న పరిజ్ణానంతో జోడించి ప్రచురించినది. ఈ సమాచారానికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులోని సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు లేదా పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

FAQ's
  • 2022లో రంజాన్ పండుగ ఎప్పుడొచ్చింది?

    ముస్లింలు రంజాన్ పండుగను నెల రోజుల పాటు జరుపుకుంటారు. ఈద్-ఉల్-ఫితర్ పండుతో ఇది ముగుస్తుంది. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీన ఆదివారం ఈ పండుగ ప్రారంభమవుతుంది. మే రెండో తేదీన ముగుస్తుంది. అనంతరం రంజాన్ పండుగను ఈద్ పేరిట మే మూడో తేదీన జరుపుకుంటారు. అయితే చంద్రుడి దర్శనం తర్వాతే వారి పండుగ తేదీని నిర్ణయిస్తారు.

  • రంజాన్ మాసం ప్రాముఖ్యత ఏంటి?

    ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, రంజాన్ మాసం తొమ్మిదో నెల. దీనిని షబ్-ఎ-ఖద్ర్ అని అంటారు. ఈద్-ఉల్-ఫితుర్ పదో నెల మొదటి రోజున జరుపుకుంటారు. ఈ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండే సమయంలో కేవలం నీళ్లు తప్ప, ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. చాలా నిగ్రహంగా ఉంటారు. అలాగే శాంతంగా ఉంటారు. పేద వారికి ఈ కాలంలో దానం చేస్తారు. ఉపవాసం విడిచి పెట్టేది కేవలం సాయంకాలం తర్వాతే. రంజాన్ మాసంలో ప్రతి రోజూ ఉపవాసం తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. దీన్నే సహరీ అని అంటారు. సూర్యస్తమయం తర్వాత వారి ఉపవాసం ముగుస్తుంది. దీన్ని ఇఫ్తార్ అంటారు.

English summary

When is Ramadan 2022 : Ramadan 2022 Start Date, When Will Islamic Holy Month Begin In India

Here we are talking about the when is ramadan 2022: Ramadan 2022 start date, when will islamic holy month begin in India. Read on
Story first published:Monday, March 28, 2022, 16:20 [IST]
Desktop Bottom Promotion