Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Kalki Avatar Birth Date : కల్కీ భగవానుడు జన్మించే గ్రామం ఎక్కడుందంటే..?
కల్కీ భగవానుడు ఎప్పుడు వస్తాడు. కలియుగానికి దేవుడు కల్కీ కాబట్టి ఎప్పుడు జన్మిస్తాడు? ఎక్కడ జన్మిస్తాడు ? అసలు ఉన్నాడా లేక ఇది పురాణాల్లో కేవలం కట్టుకథేనా అని చాలా మంది భావన. ఇప్పుడు కల్కీ పేరుతో ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్‌లో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం కూడా తెలిసిందే. కల్కీ నిజంగా విష్ణు అవతారమేనా, అన్ని అవతారాలు రూపం దాల్చుకున్నట్టే మరి కల్కీ రూపం ఎప్పుడు అవతరిస్తుందనే దానిపై మీకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నాం.
కల్కీకి అర్థం
సంస్కృతంలో కల్కీ అంటే పాపము, తప్పుకు సంబంధించినది. ఈ పాపాలను కడగడానికి కల్కీ అవతారాన్ని తీసుకొని వస్తాడంటారు. కల్కీ రూపురేఖలు, వస్త్రాధరణ ఎలా ఉంటుందనేది పురాణాల్లో ఇప్పటికే చెప్పారు. ఓ పెద్ద కత్తి తీసుకొని తెల్లగుర్రంపై కల్కీ భగవానుడు వస్తాడని చెప్పబడింది.

ఎప్పుడు వస్తాడు
కల్కీ ఎప్పుడు వస్తాడనేది పురాణాల్లో ఖచ్చితమైన తేదీని పేర్కొనలేదు. అయితే యుగాన్ని, కాలాన్ని పరిస్థితుల గురించి స్పష్టం చేశారు. కలియుగాంతంలో కల్కీ వస్తాడని అంటారు. కల్కీ వచ్చిన తరువాత ఇక సత్య యుగం ప్రారంభమౌతుందని పండితులు చెబుతున్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించిన పూర్తి సమాచారం కల్కీ పురాణంలో పేర్కొనబడింది. కల్కీ పుట్టుకకు కారణం కూడా అందులో చెప్పారు.
శంబలా ఊరు
శంభలా అనే ఊరిలో కల్కీ జన్మిస్తాడని పురాణాల్లో రాశారు. పుట్టక నుంచే కల్కీకి దైవశక్తులుంటాయ్. అవతార పరిపాలనను కొనసాగించడానికి సృష్టిని నడిపించడానికి మనుష్య రూపంలో విష్ణు దేవుడు వస్తున్నాడంటారు. ధర్మాన్ని నిలబెట్టడానికి క్కలీ అవతార రూపాన్ని తీసుకుంటాడంటారు.
సమాజం దాటుతున్న హద్దులు
ప్రస్తుత జీవన విధానంపై ధనవంతులకు కూడా విరక్తి కలిగి అన్నీ వదిలేసి అడవుల్లోకి వెళ్తారు. పిల్లలు కూడా హద్దులు దాటి పెద్దవాళ్లలా ప్రవర్తిస్తున్నారు. లోకంలో పాపాలు, చెడు, హింస, అరాచకం ఎక్కువైనప్పుడు మాత్రమే కల్కీ అవతారంలో మన మధ్యకు వస్తాడని పురాణాలు చబెతుున్నాయ్.
మరో లెక్క
కలియుగం 4,30,000 సంవత్సారల పాటు ఉంటుందంటున్నారు. కృష్ణుడు మరణించి ఇప్పటికి 5వేల సంవత్సరాలు పూర్తయ్యాయ్. ఆ లెక్కన ఇంకా 4,27000 ల సంవాత్సరాలు తరువాత కల్కీ అవతారం వస్తుంది.
యజ్ఞాలు ఉండవు, వివాహ వ్యవస్థా ఉండదు, గోమాంసం ఎక్కువగా తింటారు, తల్లిదండ్రులను, పురుషుల ఆయుర్ధాయం 18ఏళ్ల వరకే ఉంటుంది. స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ విరబోసుకొని ఉంటారు. పాపాలు విపరీతంగా పెరిగిపోతాయ్. ఇలాంటి పరిస్థితిలో శంభలా గ్రామంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణుడి కడుపులో కల్కీ పేరుతో జన్మిస్తాడు. కల్కీ పుట్టగానే పాపులకు ప్రాణసంకటం వస్తుంది, వారు అనారోగ్యం బారిన పడతారు. వారితోనే కల్కీ యుద్ధం చేస్తారు.
కలియుగాంతం సమయంలో కల్కీ భగవానుడు అవతారంగా వస్తాడు. కలియుగం చివర, కృత యుగం ప్రారంభంలో ఇది జరుగుతుందని వేదపండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications