For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ugadi 2023:ఉగాది వేళ ఈ పనులు చేస్తే శుభ ఫలితాలొస్తాయట...!

ఉగాది పండుగ సందర్భంగా మనం ఏ దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలొస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

2023 సంత్సరంలో తెలుగు వారి తొలి పండుగ వసంతం మార్చి 22వ తేదీన బుధవారం నాడు ప్రారంభం కానుంది.

Which Hindu God Is to Be Worshipped on Ugadi in Telugu

తెలుగు ప్రజలందరూ ఉగాది రోజు నుంచే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినట్టు భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కోయిల కుహుకుహూలు.. సరికొత్తగా చేసే పనులు.. ప్రతి ఇంటా అందమైన సొగసులు.. ప్రతి గుమ్మంలోనూ మామిడి తోరణాలతో అలంకరణలు.. ఇలా యుగయుగాల ఉగాది.. తరతరాల వారధిగా నిలుస్తోంది.

Which Hindu God Is to Be Worshipped on Ugadi in Telugu

ఈరోజునే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తమ రాశి చక్రాల జాతకలు, గ్రహాల స్థితిని అంచనా వేస్తారు. తమ జాతకంలో ఏవైనా దోషాలుంటే వాటి శాంతి కోసం కొన్ని పరిహారాలు పాటించడం, నివారణలు పాటించడం వంటివి చేస్తారు.

Which Hindu God Is to Be Worshipped on Ugadi in Telugu

మరికొన్ని రోజుల్లో మనం 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న సందర్భంగా ఉగాది పండుగ రోజున ఏ దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలొస్తాయి.. మీ వ్యక్తిగత జీవితంలో.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ugadi 2022:ఉగాది రోజున ఈ ఆచారాలను ఎందుకు పాటించాలంటే?Ugadi 2022:ఉగాది రోజున ఈ ఆచారాలను ఎందుకు పాటించాలంటే?

తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో..

ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఉగాది పచ్చడిని కచ్చితంగా రుచి చూస్తారు. పచ్చడిలో షడ్రుచులు ఎంతో రుచికరంగా ఉంటాయి. కర్నాటకలోనూ యుగాది పేరిట ఈ పండుగను జరుపుకుంటారు. తమిళనాడులో ‘పుత్తాండు' అని, మలయాళంలో విషు అని, సిక్కులు వైశాఖీ అని, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్, మహారాష్ట్రలో గుడిపడ్వా అనే పేర్లతో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో, కర్నాటకలో ఈ పవిత్రమైన రోజున కచ్చితంగా పంచాంగ శ్రవణం జరుపుతారు.

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం..

హిందూ పురాణాల ప్రకారం, ఛైత్ర మాసంలో శక్ల పక్షం పాడ్యమి రోజున ఈ అనంతమైన లోకాన్ని బ్రహ్మ దేవుడు సృష్టించాడని.. ఆ రోజు నుండే ఈ లోకం ప్రారంభమయ్యిందని పండితులు చెబుతారు. అలాగే వేదాలను హరించిన సోమకుని వధించేందుకు విష్ణువు మత్స్యవతారంలో వచ్చిన రోజునే ఉగాది పండుగగా జరుపుకుంటారని చెబుతుంటారు. అందుకే ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును విధిగా ఆరాధించాలని పండితులు చెబుతారు. అలాగే ఉగాది పండుగ రోజున మీ ఇష్టదేవతలకు ఉదయాన్నే ఏడు నుండి 10 గంటల మధ్యలోపు ఎప్పుడైనా పూజలు చేయొచ్చని పండితులు చెబుతున్నారు.

సాయంకాలం వేళలో..

సాయంకాలం వేళలో..

ఉగాది పండుగ రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకుని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అందమైన పువ్వులతో అలంకరించి, చక్కనైన ముగ్గులు వేయాలి. ఆ తర్వాత ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. సాయంకాలం వేళలో కచ్చితంగా ఏదైనా ఆలయానికి వెళ్లి పంచాంగ శ్రవణం తప్పకుండా వినాలని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఇంతవరకూ మీరు వెళ్లని ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటే, మంచి ఫలితాలొస్తాయట. ఇదిలా ఉండగా.. హిందూ సంప్రదాయంలో మన పండుగలు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక భావంతో జరుపుకోవడం మన ఆచారం. అయితే ఉగాది రోజున ప్రత్యేకంగా ఏ దైవాన్నీ ఆరాధించరని మరో కథనం ద్వారా తెలుస్తోంది. ఇది కేవలం కాలాన్ని ఆరాధించే పండుగ మాత్రమే.

April Horoscope 2022: ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి కష్టాలు.. తస్మాత్ జాగ్రత్త..!April Horoscope 2022: ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి కష్టాలు.. తస్మాత్ జాగ్రత్త..!

ఛైత్ర నవరాత్రులు..

ఛైత్ర నవరాత్రులు..

ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటు ఛైత్ర నవమి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ తొమ్మిది రోజుల పాటు అనేక దేవాలయాల్లో వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల, మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయని పండితులు అంటున్నారు.

నైవేద్యంలో..

నైవేద్యంలో..

ఉగాది రోజున పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చస్తారు. ఈ షడ్రుచులు మన జీవితంలోని అనేక విషయాలను సూచిస్తుంది. అయితే ఉగాది పండుగ రోజున మీరు పూజించే దేవుళ్లకు సమర్పించే నైవేద్యంలో పానకం, వడపప్పు, తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఉగాది నుండి వేసవికాలం ప్రారంభమవుతుంది. అందుకే భానుడి భగభగలను తట్టుకోవడానికి పానకం లాంటి ద్రవ పదార్థాలు బాగా ఉపయోగపడతాయి.

ఉగాది నుండి..

ఉగాది నుండి..

ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు కొందరు శ్రీరాముడిని, సీతాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నవమి రోజుల్లో అంటే తొమ్మిది రోజుల పాటు ఇళ్లను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటారు. అలాగే తమను తాము శుభ్రంగా ఉంచుకుని.. దేవుడికి నైవేద్యంగా సమర్పించే మంచి పోషకాహారమే తింటుంటారు. దీంతో ఆరోగ్యానికి ఎన్నో మంచి ప్రయోజనాలు దక్కుతాయని చాలా మంది నమ్ముతారు. ఇక ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల బాడీలోని టాక్సిన్లు, క్రిములు నశిస్తాయి.

FAQ's
  • ఉగాది పండుగ రోజున ఏ దేవుడిని ఆరాధిస్తారు?

    ఉగాది పండుగ రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున సాయంకాలం వేళలో కచ్చితంగా ఏదైనా ఆలయానికి వెళ్లి పంచాంగ శ్రవణం తప్పకుండా వినాలని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఇంతవరకూ మీరు వెళ్లని ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటే, మంచి ఫలితాలొస్తాయట. ఇదిలా ఉండగా.. హిందూ సంప్రదాయంలో మన పండుగలు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక భావంతో జరుపుకోవడం మన ఆచారం. అయితే ఉగాది రోజున ప్రత్యేకంగా ఏ దైవాన్నీ ఆరాధించరని మరో కథనం ద్వారా తెలుస్తోంది. ఇది కేవలం కాలాన్ని ఆరాధించే పండుగ మాత్రమే.

English summary

Ugadi 2023: Which Hindu God Is to Be Worshipped on Ugadi in Telugu

Here we are talking about the which hindu god is to be worshipped on ugadi in Telugu. Have a look
Desktop Bottom Promotion