Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ధన త్రయోదశి నాడు బంగారం కొనాలా? వెండి కొనాలా?.. ఏది కొంటే మంచిదో తెలుసా?
ఈ ఏడాది ఈనెల 29వ తేదీన ధన త్రయోదశి వస్తుంది. ఈ ధనత్రయోదశని భారత దేశంలోని మహిళలంతా ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఈ పండగ నాడు వారికి ఎంతో ఇష్టమైన వెండి, బంగారం వంటి ఆభరణాలు కొంటూ ఉంటారు. అయితే కొంతమంది ఈ ధన త్రయోదశ నాడు బంగారం కొనాలా వెండి కొనాలా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే ఈరోజు ఈ స్టోరీలో ఏ ఆభరణం కొంటె మంచిదో వివరాయించాము, ఓసారి చూద్దాం రండి.
బంగారం కొంటే..
బంగారం అనేది చాలా ఖరీదైన లోహం. దీనిని సంపాదనకు, హుందాతనాన్ని, సమాజంలో గుర్తింపు కోసం వినియోగిస్తూ ఉంటారు. మన దేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత, విలువ ఉంటుంది. బంగారం ఉంటే ఆ మనిషి ఎంతో డబ్బున్న వ్యక్తి అని చెప్పుకుంటూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యత ఉంటుంది ఈ బంగారానికి.

అందుకే ఈ ధన త్రయోదశి నాడు బంగారం కొంటే ఆ ధన్వంతరి మాత ఇంట్లోకి ధన ధాన్యాలు ప్రసాదిస్తుందని పేర్కొంటూ ఉంటారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు, సమాజంలో గుర్తింపు లభించే విధంగా దీవెనలు ఇస్తుందని, అలాంటి అదృష్టం మనకు కలుగుతుందని భావిస్తుంటారు. అందుకే ధన త్రయోదశి నాడు బంగారం కొంటె డబ్బుకు లోటు ఉండదని భావిస్తూ చాలా మంది బంగారం కొంటూ ఉంటారు.
అలాగే.. ఈ బంగారాన్ని ఆభరణాలు, నాణేంలు, రూపంలో మార్చి భద్రపరుచుకుంటూ ఉంటారు. దీనిని ద్రవరూపంలోనూ మార్చుకొని వినియోగించుకోవచ్చు. కొన్ని ప్రతీకూల పరిస్థితిలోనూ, ఆర్ధిక మాంద్యం ఏర్పడిన సమయంలోనూ ఈ బంగారం ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్ధిక మాంద్యం వచ్చినప్పుడు డబ్బు విలువ తగ్గొచ్చు కానీ, బంగారం విలువ మాత్రం తగ్గే అవకాశం ఉండదు. అందుకే ధన త్రయోదశి నాడు ఈ బంగారం కొంటె దేవతల అనుగ్రహంతో పాటు, భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
వెండి కొంటే..
వెండి కూడా ఒక విలువైన ఆభరణమే. కాకపోతే ఈ వెండికి బంగారంతో పోలిస్తే చాలా తక్కువ విలువ ఉంటుంది. బంగారం కొనేందుకు శ్రమ పడేంతగా ఈ వెండిని కొనడానికి శ్రమ పడాల్సిన అవసరం లేదు. వెండి పెద్ద పెద్ద విగ్రహాలను చేసుకునేందుకు వాడుతుంటారు. కళ్ళకు పట్టీలు, మెట్టెలు, బ్రేస్‌లెట్‌లు, చైన్‌లు, ఉంగరాలు చేసుకునేందుకు వినియోగిస్తూ ఉంటారు.
బంగారం కంటే ఈ ఆభరణానికి విలువ తక్కువగానే ఉన్నప్పటికీ ఈ ధన త్రయోదశి నాడు ఈ ఆభరణాన్ని కొన్నా కూడా దేవతల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఎప్పటికీ పాడవని వస్తువు కాబట్టి, దీనిని కొనడం వల్ల జీవితంలో సమస్యలన్నీ తొలిగిపోయి అవి మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాయట. అలాగే జీవితం సవ్యంగా కొనసాగుతుందని పేర్కొంటున్నారు.
ఈ రెండిటిలో ఏది కొంటే మంచిది..
ఈ ధనత్రయోదశి రోజు బంగారం, వెండి.. ఈ రెండు ఆభరణాలలో ఏది కొన్నా మంచి ఫలితాలు పొందొచ్చని పండిత నిపుణులు చెబుతున్నారు. వారి వారి స్థోమతకు తగ్గట్టుగా ఈ ఆభరణాన్ని ఎంచుకోవాలని, ఏది ఎంచుకున్న ఆ ధన్వంతరి మాత అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు. రెండిటి ధరల్లో తేడాలు ఉన్నప్పటికీ ప్రయోజనం మాత్రం సమానంగానే ఉంటుందని తెలుపుతున్నారు. అయితే బంగారం కొనడం వల్ల భవిష్యత్తులో కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందని చెబుతున్నారు. మీ స్థోమతను బట్టి ఈ ధనత్రయోదశి నాడు బంగారం లేదా వెండిని కొనుక్కోండి.



Click it and Unblock the Notifications