For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీ క్రిష్ణుడికి దేవకి, యశోదతో పాటు ఎంతమంది తల్లులు ఉన్నారో తెలుసా...!

|

మహాభారతం గురించి తెలిసిన వారు.. శ్రీ మహా విష్ణువు ఎనిమిదో అవతారంగా వచ్చిన శ్రీక్రిష్ణునికి దేవకి అసలైన తల్లిగా భావిస్తారు. శ్రావణ మాసంలోని క్రిష్ణ పక్షం అష్టమి తిథిన రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించిన శ్రీక్రిష్ణుడికి దేవకి, యశోద ఇద్దరు తల్లులు ఉన్నారని భావిస్తుంటారు.

మన సినిమాలు, సీరియళ్లలోనూ వీరిద్దరినే ఎక్కువగా చూపిస్తుంటారు. దీంతో అందరూ ఆ వేణు మాధవుడికి ఇద్దరు తల్లులు అనుకుంటారు. అయితే వీరిద్దరితో పాటు శ్రీకిష్ణుడికి మరికొందరు తల్లులుగా ఉండేవారట.

వీరితో పాటు మరికొందరు మాతలకు ఆ నీలి మేఘ శ్యాముడు అవకాశం కల్పించాడట. ఇంతకీ ఈ కన్నయ్య భూమిపై ఉన్నంత వరకు ఎంతమంది తల్లులకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు..

ఆ మాధవునికి అమ్మ అయ్యే అదృష్టం ఎవరెవరికి దక్కింది.. దేవకి, యశోదలతో పాటు ఇంకా ఎవరెవరు ఆ వేణు మాధవుడికి తల్లి అయ్యే అవకాశాన్ని పొందారనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చెరసాలలో..

చెరసాలలో..

పురాణాల ప్రకారం, శ్రీ మహా విష్ణువు ఎనిమిదో అవతారంగా వచ్చిన శ్రీక్రిష్ణుడు వసుదేవుడు, దేవకిలకు చెరసాలలో జన్మిస్తాడు. కాబట్టి ఆ కన్నయ్యకు జన్మనిచ్చిన తల్లి దేవకి. తన సోదరుడైన కంసుడు మధురలోని ఓ చెరసాలలో వారిని బంధించిన సమయంలో.. తనకు పుట్టిన బిడ్డలను.. పుట్టినట్టే చంపుతూ ఉంటాడు. అయితే శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షం అష్టమి తిథిన అదే చెరసాలలో క్రిష్ణుడికి జన్మనిచ్చింది దేవకి. ఈ కారణంగానే శ్రీక్రిష్ణుడిని దేవకి నందనుడు, వాసుదేవుడు అని పిలుస్తూ ఉంటారు.

యశోద..

యశోద..

ఆ నీలి మేఘ శ్యాముడిని తాను జన్మనివ్వకపోయినా.. యశోద ఆ కన్నయ్యను కంటికి రెప్పలా చూసుకుంది. యశోద-నందుడి వద్ద శ్రీక్రిష్ణుడు గోకులంలో పెరిగి పెద్దయ్యాడు. మట్టి తింటున్నాడని కన్నయ్య మీద అరుసుకున్నందుకు.. ఆమెకు తన నోటిలో నుండి సకల కోటి ప్రపంచాన్ని చూపించి ఆశ్చరపరిచాడు. భాగవతం ప్రకారం, యశోదకు కలిగిన ఈ అదృష్టం, ముక్తి సాక్షాత్తు ఆ బ్రహ్మ, ఈశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు. చిన్నప్పుడే చిన్నిక్రిష్ణుని అల్లరిని అదుపు చేస్తూనే.. ఎంతో ప్రేమగా చూసుకున్న యశోద మాధవుని జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది.

మూడో తల్లిగా..

మూడో తల్లిగా..

మరో కథనం మేరకు.. దేవకి కంటే ముందే వసుదేవుడు రోహిణి వివాహం చేసుకుని ఉంటాడు. బలరాముడు, సుభద్ర, ఏకాంగ దేవి వీరి సంతానంగా ఉంటారు. రోహిణి తన కుమార్తే, కుమారుడితో కలిసి యశోద దగ్గర నివసిస్తారు. చిన్ని క్రిష్ణుని ముత్తాత మారిషుడు. ఆయన సవతి తల్లి అయిన రోహిణి నాగ జాతికి చెందిన వారని చెబుతారు. అంతేకాదు.. హస్తినపురానికి రాజైన శాంతనవుడు, సోదరుడు బాహిలిక కుమార్తె అని కూడా చెబుతుంటారు.

నాలుగో తల్లిగా..

నాలుగో తల్లిగా..

వేణు మాధవుడు సందీపని ముని భార్య అయిన సుముఖి దేవికి కూడా తల్లి పాత్ర ఇచ్చేశాడు. శ్రీక్రిష్ణుడు, బలరాముడు, సుదాముడు.. సందీపని మహర్షి దగ్గర శిక్షణ పొందారు. ఈ సందర్భంలోనే సుముఖి దేవి క్రిష్ణుడిని తన పుత్రుడిగా ఉండేలా గురు దక్షిణ అడుగుతుంది. ఎందుకంటే శంఖాసురుడు ఆమె ఆధీనంలో ఉంటారు. కన్నయ్య తనను అతడి చెర నుండి విడిపించిన కారణంగా పుత్ర సమానుడిగా చూసింది. అనంతరం గురుమాత క్రిష్ణుడిని ఆశీర్వదించి.. ఈ తల్లి నీకు ఎల్లప్పుడూ దూరమవ్వదని చెప్పేసింది. మరోవైపు క్రిష్ణుడు బతికినంత కాలం ఆయన తల్లి అయిన దేవకి కూడా జీవించే ఉంది.

ఐదో తల్లిగా..

ఐదో తల్లిగా..

భాగవతం ప్రకారం.. చిన్నిక్రిష్ణుడిని గోకులంలోనే హతమార్చుకునేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు. పాలు తాగే వయసులో ఉన్న మాధవుడి వద్దకు పూతన వస్తుంది. తన రొమ్ముల్లో కాలకూట విషాన్ని నింపుకుని శ్రీక్రిష్ణుడిని చంపాలని చూస్తుంది. అయితే పసివాడి రూపంలో ఉన్న వేణుమాధవుడు ఆ విషయాన్ని ముందే గ్రహించి.. తన పాలతో పాటు రొమ్ముల ద్వారా రక్తాన్ని పీల్చి తనను హతమారుస్తాడు. తను చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించిన సమయంలో.. తన శరీర గంధపు చెక్కల నుండి ఓ సువాసన వస్తుంది. ఈ సంఘటన గురించి భాగవతంలో పూర్తి వివరాలు ఉన్నాయి. దీని తర్వాత ఆ శ్రీక్రిష్ణుడు పూతనకు కూడా తల్లి హోదా ఇచ్చేశాడు.

English summary

Who is Lord Krishna's real mother?

Here we are talking about the who is lord krishna's real mother. Read on
Story first published: Friday, March 26, 2021, 16:27 [IST]