Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
సాధువు, బుషి, యోగి, సన్యాసి..వీరి మధ్య తేడాలు ఏంటీ?
హిందూమతంలో జ్ణానోదయం కల్పించే, ధర్మం వైపు నడిపించే అనేక ఆథ్యాత్మిక పాత్రలు ఉన్నాయి. యోగి, సన్యాసి, బుషి, సాధువు, సత్పురుషుడు లేదా సెయింట్, ముని వీళ్లందరి పేర్లు తరచుగా వింటుంటాం. వీరు తమ ప్రత్యేక లక్షణాలతో ప్రసిద్ది.. జ్ణానోదయం, అంగర్గత శాంతిని పొందడానికి వివిధ మార్గాలను చూపుతారు. అయితే అసలు బుషి అంటే ఎవరు, సెయింట్ అంటే ఎవరు, సాధువు అంటే ఎవరు, సన్యాసి అంటే ఎవరు..వీళ్ల మధ్య ఉన్న తేడాలు ఏంటీ..వారి ప్రత్యేకలు,లైఫ్ స్టైయిల్ ఎలా ఉంటది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సన్యాసి అంటే ఎవరు
తరచుగా మనం సన్యాసి అనే పదాన్ని వింటుంటాం. సన్యాసి అంటే..అన్ని ప్రాపంచిక బంధాలు విడిచిపెట్టిన వ్యక్తి అని అర్థం. సన్యాసి..దేవుడిని లేదా ఆధ్యాత్మిక విముక్తిని పొందాలనే ఏకైక లక్ష్యంతో అన్ని భౌతిక కోరికలు, ఆస్తులు, సంబంధాలను వదలుకుంటారు. వైరాగ్యంతో నిరాడంబరంగా జీవిస్తారు. సన్యాసి పదం సంస్కృతంలోని సం(పూర్తిగా), న్యాసి(విడిచిపెట్టినవాడు)అనే పదాల కలయికతో ఏర్పడింది. కొందరు సన్యాసులు తమ జీవితాన్ని భోధించడానికి లేదా ఇతరులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేయడానికి అంకితం చేస్తారు. సన్యాస జీవితం చాలా కఠినంగా ఉంటుంది అందరికీ ఇది సాధ్యం కాదు..కానీ ఆధ్యత్మికంగా ఎదగాలని తీవ్రంగా కోరుకునేటోళ్లకి ఇదొక ముఖ్య మార్గం. ఆది శంకరాచార్యులు, స్వామి వివేకానంద వంటి ప్రఖ్యాత సన్యాసులు హిందూ ధర్మంలో గొప్ప ప్రభావాన్ని చూపారు.

సాధువు అంటే ఎవరు
సాధువు అంటే భౌతిక ప్రపంచం నుంచి వైదొలిగి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపే వ్యక్తి. సాధువు అనే పదం సాధు అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. దీనర్థం సరైన, మంంచి లేదా పుణ్యమైన. సాధువు ధర్మబద్దమైన ప్రవర్తన, వినయపూర్వక వ్యక్తిత్వంతో, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారు. వీరు సాధారణంగా అడవిలో, ఆశ్రమంలో లేదా గుడిలో ఉంట భక్తి,క్రమశిక్షణలో కూడిన ఆచరణలు చేస్తుంటారు. కొందరు సాధువులు అయితే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి తిరుగుతూ ఉంటారు. ఇతరులకు సాయం చేస్తారు. సాధువులు తరచుగా కాషాయ వస్త్రాలు ధరిస్తారు..ఇది వారి వైరాగ్యానికి చిహ్నంగా కనబడుతుంది.
బుషి అంటే ఎవరు
ఋషి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి దానిని ఇతరులతో పంచుకుంటూ ధ్యానం, వేదాధ్యయనంలో నిమగ్నమయ్యే ఒక గౌరవనీయమైన వ్యక్తి. వీరు సమాజానికి వెలుగునిచ్చే మార్గదర్శకులుగా పరిగణించబడతారు. అంతరదృష్టితో లోతైన జ్ణానం కలిగి ఉండి తమ జ్ణానాన్ని సమాజంతో పంచుకోడానికి తీమ జీవితాలను అంకితం చేస్తారు. కొందరు బుషులను ప్రాచీన శాస్త్రవేత్తలుగా భావిస్తారు..వారు కుండలినీ యోగా వంటి శాస్త్రాలను అభివృద్ధి చేశారు. అయితే బుషులలో వివిధ రకాలు ఉన్నారు. మహర్షి, రాజర్షి, దేవర్షి, బ్రహర్షి ఇలా రకాలు ఉంటారు. దేవర్షి అంటే..దేవతలలో కూడా బుషిత్వం కలిగినవ్యక్తి అని అర్థం..నారదుడిని దేవర్షిగా చెబుతారు. రాజర్షి అంటే రాజుగా ఉంటూనే బుషి వంటి ఆధ్యాత్మిక గుణాలు కలిగిన వ్యక్తి. మహర్షి అంటే వశిష్ఠుడిలా గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిన వ్యక్తి.
సత్పురుషుడు లేదా సెయింట్
సత్పురుషుడు అంటే మంచి గుణాలు, దైవభక్తి, ప్రేమ మరియు జ్ఞానం కలిగిన ఒక పవిత్ర వ్యక్తి. సత్పురుషుడు లేదా సెయింట్ ప్రేమ, జ్ణానాన్ని వ్యాప్తి చేయడానికి అంకితమైన వ్యక్తి. వీరు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి చిహ్నంగా ఉంటూ వీరు ప్రజలను దేవుడి పట్ల భక్తి, నైతిక జీవితం వైపు నడిపిస్తారు. వీరు అందరిపట్ల ప్రేమను కలిగి ఉంటారు. స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేస్తుంటారు.
ముని
ముని అంటే మౌనంగా ఉంటూ లోతైన ఆలోచన మరియు ధ్యానంలో నిమగ్నమయ్యే వ్యక్తి. వీరు తమ మనస్సు, మాటలను నియంత్రించడం ద్వారా సత్యాన్ని అన్వేషిస్తారు, అంతర్గత సాక్షాత్కారంపై దృష్టి పెట్టడానికి అనవసరమైన మాటలను నివారిస్తారు. ముని అనే పదం సంస్కృతంలోని మనన్ నుండి వచ్చింది.. దీని అర్థం ఆలోచించడం. కాబట్టి ముని అంటే ఆలోచనాపరులుగా, ఆత్మపరిశీలనలో నిమగ్నమయ్యే వ్యక్తి. చాలామంది మనులు తమ ఆధ్యాత్మిక సాధనలె భాగంగా మౌనాన్ని పాటిస్తారు. ఇది వారి మనస్సును బాహ్య ప్రపంచం నుంచి మరల్చి అంతర్గత ఆలోచలనపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది.
భక్తి యోగి
భక్తి యోగి అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే వ్యక్తి. వీరు తమ ప్రతి కర్మను, ఆలోచనను, భావోద్వేగాన్ని దైవానికి అంకితం చేస్తారు. తమను తాము పూర్తిగా దేవుడికి అంకితం చేసుకుంటారు. వీరి హృదయం దేవుడి పట్ల గాఢమైన ప్రేమతో నిండి ఉంటుంది. ఈ ప్రేమ వీరి జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. చాలామంది భక్తి యోగులు ఒక ఆధ్యాత్మిక గురువుని కలిగి ఉంటారు..వారి మార్గదర్శకత్వాన్ని పాటిస్తారు. భక్తి యోగం చాలా ఈజీ, శక్తివంతమైన ఆధ్యాత్మిక మార్గంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతి ఒక్కరే తమ హృదయపూర్వకమైన ప్రేమ ద్వారా దేవుడిని చేరుకోడాని సహాయపడుతుంది. దేవుడి సృష్టిలో భాగమైన ప్రతి జీవిని ప్రేమిస్తారు.



Click it and Unblock the Notifications











