For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kansa Vadh 2021:కంసుడు ఎవరు? క్రిష్ణుడు తనను ఎందుకు సంహరించాడో తెలుసా...

|

హిందూ పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి దశావతారాలను ఎత్తిన సంగతి తెలిసిందే. అలా ఏడో అవతారంలో శ్రీ క్రిష్ణునిగా జన్మించిన సంగతి చాలా మందికి తెలిసిందే. అయితే పుట్టినప్పటి నుండే శ్రీక్రిష్ణుని లీలలు ప్రారంభించాడు.

పసితనంలో అల్లరి చిల్లరగా, యుక్త వయసులోప్రేమికునిగా, రాజ నీతిజ్ఞునిగా, సలహాదారుగా, యోధునిగా తన పాత్రలను అన్నింటినీ సంపూర్ణ స్థాయిలో పోషించాడు.

అయితే చిన్నతనంలోనే తన మేనమామ అయిన కంసుడిని సంహరిస్తాడు. అయితే క్రిష్ణుడు కంసుడిని ఎందుకని వధించాడు.. వీరిద్దరి మధ్య ఉన్న విరోధం ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Kansa Vadh 2021:కంసుడి సంహారం దేన్ని సూచిస్తుంది.. ఈ పండుగ ప్రత్యేకతలేంటో తెలసా...

కంసుడికి రాక్షస లక్షణాలు..

కంసుడికి రాక్షస లక్షణాలు..

పురాణాల ప్రకారం.. రాక్షసుడైన ద్రవిళుడు అనే రాక్షస రాజు వలస పుట్టిన కంసుడికి రాక్షస లక్షణాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కంసుడు పెరిగి పెద్దయ్యే సమయానికి తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో బంధించాడు. ఆ తర్వాత రాజుగా సింహాసనాన్ని అధిష్టించాడు. అనంతరం జరాసంధుని కూతుళ్లు ఆస్తి, ప్రాస్తి ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు.

చెల్లెల్లిని ప్రేమగా..

చెల్లెల్లిని ప్రేమగా..

రాక్షస లక్షణాలు ఉన్నప్పటికీ తన పిన తండ్రి కూతురు చెల్లి వరస అయిన దేవకిని చాలా ప్రేమగా చూసుకున్నాడు. అంతేకాదు వసుదేవునికిచ్చి పెళ్లి కూడా చేశారు. అయితే తనను అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి వచ్చి కంసుడి సంహారం తనకు పుట్టబోయే చేతిలో ఉందని చెప్పి హెచ్చరించింది.

చెరసాలలో బంధిస్తాడు..

చెరసాలలో బంధిస్తాడు..

ఈ విషయం తెలుసుకున్న కంసుడు తన మరణం గురించి భయపడి వసుదేవుడిని, దేవకిని చెరసాలలో బంధిస్తాడు. వారిద్దరికీ పుట్టిన బిడ్డలను పుట్టిన వెంటనే చంపేస్తుంటాడు. వసుదేవుడు, దేవకి ఎంత బతిమిలాడిన ఏ మాత్రం పట్టించుకోడు. అలా ఆరుగురి సంతానాన్ని పురిట్లోనే చంపేస్తాడు. ఆ తర్వాత శ్రీక్రిష్ణుడు జన్మిస్తాడు. అయితే తనను ఎలాగైనా రక్షించుకోవాలని భావిస్తాడు. దీంతో తనను యశోద ఇంటికి మార్చేస్తాడు. అయితే మరో పాపను చంపేందుకు కంసుడు కత్తిని పైకి ఎత్తాడు. పాపను గాల్లో ఎగువేయగా ‘‘నిన్ను చంపేవాడు భూమి మీద అప్పుడే పెరుగుతున్నాడు. త్వరలో వచ్చి నీ ప్రాణాలు తీస్తాడు'' అని చెప్పి మాయమవుతుంది. దీంతో కంసుడి మరింత ఆందోళన చెందుతాడు. దీంతో ఊరూరా తిరిగి అందరి ఇళ్లలో ఉండే పిల్లలను చంపేస్తుంటారు. అయితే బాలక్రిష్ణుడిని చంపడానికి వచ్చిన వారంతా క్రిష్ణుడి చేతిలో చనిపోతారు.

క్రిష్ణుడిని ఓడించేందుకు..

క్రిష్ణుడిని ఓడించేందుకు..

శ్రీ కృష్ణ భగవానుని సంహరించడానికి కంసుడు చేసిన ప్రతి ప్రయత్నం చివరకు విఫలమే అయ్యేది. క్రమంగా చాణూరుడు మరియు ముష్టికుడు అను మల్ల యోధులతో శ్రీకృష్ణుని సంహరించాలని పథకం పన్నాడు కంసుడు. క్రమంగా తన సలహాదారుడిని పిలిచి, చాణూరునితో మల్ల యుద్దానికి శ్రీ కృష్ణుని ఒప్పించేలా ఒక ప్రణాళిక తయారు చేయమని సూచించాడు. చాణూరుని బల పరాక్రమాలు తెలిసిన కంసుడు, శ్రీ కృష్ణుని ఓడించగలడని బలంగా విశ్వసించాడు. చాణూరుడు మరియు ముష్టికుడు ఇద్దరూ పేరొందిన మల్ల యోధులు. చాణూరుడు అధిక దేహదారుడ్యాన్ని కూడుకుని భీతి గోల్పే శరీరాన్ని కలిగి ఉన్నవాడు. తమ ప్రత్యర్ధులపై తమ బరువును పూర్తి స్థాయిలో ఉంచి, బాహు బంధాలలో బిగించి సంహరించగల యోధుడు. క్రమంగా మల్లయుద్ద వీరునిగా విజేతగా నిలిచాడు. ఇక ముష్టికుడు తన ముష్టి ఘాతాలతో ప్రత్యర్ధులను మట్టికరిపించేవాడు. క్రమంగా వీరిరువురూ మల్ల యుద్ద వీరులుగా రాజ్యంలో పేరు గడించారు

శ్రీ కృష్ణునికి చాణూరుని సవాలు :

శ్రీ కృష్ణునికి చాణూరుని సవాలు :

ఎట్టకేలకు శ్రీ కృష్ణుడు ఉన్న ప్రాంతంలో కుస్తీ పోటీలను ఏర్పాటు చేయగలిగారు. చాణూరుడు వరుసగా ప్రత్యర్ధులను ఓడిస్తూ, ప్రేక్షకులందరిలో తనతో పోటీపడగల ధైర్యం ఉన్న వారిని బరిలోకి రమ్మంటూ సవాలు విసరడం మొదలుపెట్టాడు. అంతలో శ్రీ కృష్ణ పరమాత్ముడు మరియు బల రాముడు అక్కడకు చేరుకొని గుంపు మధ్య నిల్చుని జరిగేది చూడసాగారు. అంతలోనే, చాణూరుడు శ్రీ కృష్ణుని చూపి కుస్తీకి రమ్మని సవాలు విసిరాడు. కానీ, శ్రీ కృష్ణుడు కేవలం 16 ఏళ్ల బాలుడుగా ఉన్న కారణాన ఆ ఆలోచనను అక్కడ ఉన్న అందరూ వ్యతిరేకించారు. దానికి తోడు చాణూరుడు దృఢమైన దేహ ధారుడ్యం కలవాడు. శ్రీ కృష్ణుని ప్రాణాలకే ముప్పు వాటిల్లగలదని భయపడ్డారు. కృష్ణుడిలో కోపాన్ని రెచ్చగొట్టేలా అనేక వ్యాఖ్యలు చేస్తూ, కుస్తీ బరిలోకి వచ్చేలా చేయడానికి నానా ప్రయత్నాలు చేశాడు చాణూరుడు. కానీ, ఆ ఆహ్వాన౦ ఉద్దేశం తెలిసిన శ్రీ కృష్ణుడు చాణూరుని మాటలకు నవ్వుకుంటూ ఉండసాగాడు. క్రమంగా బరిలోకి దిగని ఎడల, పురుషునివే కాదంటూ పెను సవాలు విసిరాడు చాణూరుడు. దీనికి కృష్ణుడు తన తండ్రి అనుమతి లేనిదే తాను బరిలోకి రాలేనని అన్నాడు. వెంటనే తండ్రి శ్రీ కృష్ణుని తెలివితేటల మీద ఉన్న నమ్మకంతో అనుమతిని ఇవ్వడంతో బరిలోకి అడుగు పెట్టాడు శ్రీకృష్ణుడు.

కృష్ణుని చేతుల్లో కంసుని సంహారం

కృష్ణుని చేతుల్లో కంసుని సంహారం

మరోవైపు శ్రీ కృష్ణుడు, చాణూరుని బలం అతని బరువులో ఉన్నదని గ్రహించి, చాణూరుని చేతికి చిక్కకుండా తప్పించుకోవడం ప్రారంభించాడు. క్రమంగా కొంత సమయం తీసుకున్నాడు. పూర్తిగా చాణూరుడు డస్సిపోయిన తర్వాత, అవకాశం చూసి తెలివిగా అతని మెడపై ఎక్కి మెడను విరిచేశాడు శ్రీ కృష్ణుడు.

ఈ సంగతి తెలిసుకున్న శ్రీకృష్ణుడు, పరిస్థితులకు స్వస్థి చెప్పాలని భావించాడు. మరోవైవు కంసుడు శ్రీ కృష్ణుడిని సంహరించేందుకు, వీలుగా తన చేతిలోకి కత్తిని తీసుకుని శ్రీ కృష్ణుని మీదకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. తెలివిగా వ్యవహరించిన శ్రీ కృష్ణుడు, వెంటనే కంసుని వెనక్కి దూకి, అతని జుట్టును పట్టుకొని, వెనుకకు లాగాడు. అలా కంసుని కత్తి కింద పడిపోయింది. వెంటనే ఖడ్గాన్ని తీసుకుని, ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా కంసుని తలని నరికివేశాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు. కంసుని సంహరించిన తర్వాత కంసుని మెడలో ఉన్న శంఖాన్ని తీసి, విజయానికి చిహ్నంగా విచ్చిన్నం చేశాడు.

కంసుడిని ఎవరు చంపారు?

హిందూ పురాణాల ప్రకారం, తనకు మేనమామ వరుస అయిన కంసుడిని శ్రీక్రిష్ణ పరమాత్ముడు మట్టుబెట్టాడు. భూమి మీద కంసుడి అన్యాయాలను, అక్రమాలను అడ్డుకునేందుకే విష్ణుమూర్తి క్రిష్ణుడి రూపంలో జన్మించి తన చిన్నతనంలోనే మామ అయిన కంసుడిని సంహరించాడు. దీంతో ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు.

కంసుడిని శ్రీక్రిష్ణుడు ఎప్పుడు వధించారు?

హిందూ పంచాంగం ప్రకారం, కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున కంసుడిని శ్రీక్రిష్ణుడు వధించాడు. ఆ తర్వాత ప్రజలంతా పండుగ జరుపుకుంటారు.

2021లో కంస వధను ఎప్పుడు జరుపుకోనున్నారు?

2021 సంవత్సరంలో నవంబర్ 13వ తేదీన అంటే శనివారం రోజున కంస వధ పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున రాధాక్రిష్ణులకు ప్రత్యేక పూజలు చేస్తారు.

కంసుడిని శ్రీక్రిష్ణుడు ఎందుకు చంపాడు?

పురాణాల ప్రకారం కంసుడు భూ లోకంలో రాక్షస సైన్యంతో కలిసి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. తన అక్రమాలకు, అన్యాయాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో తమను రక్షించాలని ప్రజలందరూ కలిసి విష్ణమూర్తిని కోరగా.. క్రిష్ణుని రూపంలో జన్మించి చిన్నతనంలోనే తన మేనమామ వరుస అయిన కంసుడి సంహారం చేశారు. ఆ తర్వాత ప్రజలందరూ సంబరాలు జరుపుకున్నారు.

English summary

Who was Kansa, and why did Krishna kill him

Here we are talking about the kansa vadha 2021 : who was Kansa, and why did Krishna kill him. Have a look
Story first published: Saturday, November 13, 2021, 10:35 [IST]