For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్దము..?

|

హిందూ దేవుళ్లలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలకు కూడా తమ పనులు నిర్వర్థించే ముందు వినాయకుడుని దర్శించుకుని, విజయాలను సాధించే వారు. అలాగే సామన్య ప్రజలు కూడా తమ రోజువారి పనులలో కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా వినాయకుడిని పూజించుకుంటారు. అంతే కాదు, దక్షిణాయనంలో జరుపుకునే హిందూ పండుగలలో మొదట వచ్చేది కూడా వినాయక చవితియే..!

 Why Avoid Tulasi Leaf In Ganesh Puja

అటువంటి వినాయకునికి ఆకులు, పండ్లు, పువ్వులతో కూడిన పత్రిఆహారాలను తినే ఏనుగు తల కలిగి ఉండటం వల్ల గణేశునికి పత్రి అంటే ఎంతో ఇష్టం. అందువల్లే పత్రితో గణేశున్ని ఆధ్యాత్మికంగా పూజిస్తే అనుగ్రహం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

 Why Avoid Tulasi Leaf In Ganesh Puja

అందుకే వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని 21 పత్రాలనూ, పూలను తీసుకువచ్చి, పూజించడం సాంప్రదాయం. వినాయకునికి చేసే ఈపూజకు ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వీటి అయితే ఆ ప్రతాలలో తులసీ దళానికి చోటు ఉండదు.

సర్వదేవతలకు పవిత్రమైన తులసి పత్రం వినాయకుడు ఇష్టపడక పోవడానికి కారణము. . .

 Why Avoid Tulasi Leaf In Ganesh Puja

ఓ సారి గంగా నది తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది.

దానికి వినాయకుడు కాదనండంతో ధర్మద్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘ కాలం బ్రహ్మ చారిగా ఉండమని శపించింది.

 Why Avoid Tulasi Leaf In Ganesh Puja

ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘ కాలం ఉండమని శపిస్తాడు. వినాయకుడి శాపానికి చింతించిన ధర్మద్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆ పై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు.

 Why Avoid Tulasi Leaf In Ganesh Puja

అందుకే వినాయకుడు తులసిని తన పూజ పత్రిలో ఇష్టపడడు...

English summary

Why Avoid Tulasi Leaf In Ganesh Puja

Why Avoid Tulasi Leaf In Ganesh Puja,When we perform Lord Vinayaka puja, we put many varieties of leaves and flowers. If you have noticed you don't find tulasi/ basil leave. Tulasi leave is considered most sacred leaves in Hindu religion.
Story first published: Tuesday, June 21, 2016, 15:49 [IST]
Desktop Bottom Promotion