Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
శ్రీ కృష్ణుడు వెన్న ముద్దలు దొంగిలించడంలో దాగున్న దేవ రహస్యం..!
బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్జానికి సంకేతంగా చెపుతుంటారు మన పెద్ద
నందన నామ సంవత్సర దక్షిణాయాన వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. అలా జన్మించిన ఆ బాలుడు తన లీలావినోదాదులచే చిరు ప్రాయం నుంచే అడుగడుగునా భక్తులను జ్ఝానోపదేశం చేస్తూ , అపార ప్రజ్ఝాపాఠవాలు కలిగిన దైవాంస సంభూతులుగా ఎదుగుతూ వచ్చాడు.
శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు యొక్క పది అవతారాలలో ఎనిమిదవ అవతారము.

హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాధలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సాంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాదిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.
మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.

ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్జానికి సంకేతంగా చెపుతుంటారు మన పెద్దలు. శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు.వున్న ముద్దలు ఎక్కువ తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం.

వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. మృణ్మయ రూపమైన మనుష్యశరీరమే మృత్తికా రూపమైన వెన్నకుండ,మన మనస్సే కుండ లోని వెన్న ఆజ్ఞానికి సంకేతం నల్లని కుండ మనస్సే వెలుగుకు,విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తోలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.

యదా యదా హి ధర్మస్య జ్జానిర్భవతి భారత..!
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం..!
శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోరులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిధి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం, శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు, చంద్రాయుక్తమై ఉంటుంది.



Click it and Unblock the Notifications