For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నదమ్ములైన వాలి, సుగ్రీవుల మధ్య వైరం ఎందుకు వచ్చింది? శ్రీరాముడు వాలిని ఎందుకు చంపాడు?

వాలీసుగ్రీవులిద్దరూ ఒకే రూపంలో ఉంటారు. అయితే సుగ్రీవుడి మెడలో దండ ఉంటుంది. రాముడు చెట్టు చాటును ఉండి వాలిపైకి బాణం విసురుతాడు. తర్వాత కొన ఊపిరితో ఉన్న వాలి రాముడన్ని నిందిస్తాడు.

|

వాలి సుగ్రీవులిద్దరూ మంచి పరాక్రమం కలిగిన వారు. ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మొదట్లో ఇద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం. కానీ తర్వాత ఇద్దిరికీ వైరం పెరిగింది. ఒకర్ని ఒకరు చంపుకునేదాకా వెళ్లారు. కిష్కింధ రాజ్యానికి వాలి రాజు. అతని తమ్ముడు సుగ్రీవుడు అన్న చెప్పిన మాటను శిరసాపాటించేవాడు.

మాయావిని చంపి బయటకు వస్తా

మాయావిని చంపి బయటకు వస్తా

అయితే ఒక సారి మాయావి అనే అతను వాలితో యుద్ధానికి దిగుతాడు. తర్వాత పారిపోయి ఒక గుహలోకి పారిపోతాడు. అయితే వాలి అతన్ని వదలకుండా గుహలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతాడు. సుగ్రీవుడు అన్న వెంటనే పరుగుపెట్టాడు. తమ్ముడు నువ్వు గుహ బయటనే ఉండు, నేను ఆ మాయావిని చంపి బయటకు వస్తాను అని లోపలికి వెళ్తాడు.

పెద్ద బండ అడ్డంగా వేస్తాడు

పెద్ద బండ అడ్డంగా వేస్తాడు

అయితే ఇక్కడే ఒక సంఘటన జరిగింది. వాలి గుహలోకి వెళ్లినప్పుడు సుగ్రీవుడు వాలి బయటకు రాకుండా గుహకు పెద్ద బండ అడ్డంగా వేస్తాడు. తర్వాత సుగ్రీవుడు రాజుగా పట్టాభిషేకం చేయించుకుంటాడు. తర్వాత వాలి గుహలో నుంచి బయటకు వస్తాడు. తనను సుగ్రీవుడు మోసం చేశాడని అతన్ని చంపాలనుకుంటాడు.

ఏడాది వరకు గుహ బయట ఉండి

ఏడాది వరకు గుహ బయట ఉండి

కానీ సుగ్రీవుడు మాత్రం తన అన్నను మోసం చేయాలని ఏనాడు అనుకోలేదు. ఏడాది వరకు గుహ బయట ఉండి ఎదురుచూశానని అయితే గుహలో నుంచి రక్తం రావడం, మీ అరుపులు వినేపడే సరికి ఆ రాక్షసుడు మా అన్ననే చంపాడే.. అతను బయటకు వస్తే రాజ్యాన్నికి ప్రమాదం ఉంటుందని అలా చేశానని సుగ్రీవుడు వాలికి వివరణ ఇస్తాడు.

తారను సుగ్రీవుడు చేసుకుంటాడు

తారను సుగ్రీవుడు చేసుకుంటాడు

అయితే వాస్తవానికి మాయావినే వాలి చంపేస్తాడు. తర్వాత గుహకు అడ్డంగా ఉన్న బండరాయిని పగులగొట్టి వస్తాడు. ఇక సుగ్రీవుడు అన్నా.. నాది తప్పే.. మళ్లీ నువ్వే రాజుగా సింహాసనాన్ని అధిష్టించు అంటాడు. కానీ వాలి వినడు. అయితే వాలికి ఇంకో విషయం బాగా కోపం తెప్పించింది.

వానరజాతుల్లో అన్నదమ్ముల్లో ఎవరైనా చనిపోతే వాళ్ల భార్యను మరొకరు పెళ్లి చేసుకోవడం ఆనవాయితీ. వాలి చనిపోయాడని వాలి భార్య తారను సుగ్రీవుడు చేసుకుంటాడు. దీంతో వాలికి కోపం వచ్చి సుగ్రీవుడు భార్య అయిన రుమను తన సొంతం చేసుకోవాలనుకుంటాడు.

సుగ్రీవుడి భార్యను బలవంతంగా..

సుగ్రీవుడి భార్యను బలవంతంగా..

దీంతో సుగ్రీవుణ్ని అంతమొందించాలనకుంటాడు వాలి. దీంతో సుగ్రీవుడు పారిపోతాడు. అయితే వాలి అస్సలు అడుగుపెట్టలేనటు వంటి ఋష్య మూక పర్వతానికి వెళ్తాడు సుగ్రీవుడు. అయితే వాలి మాత్రం సుగ్రీవుడి భార్యను బలవంతంగా తనదాన్ని చేసుకుంటాడు. సుగ్రీవుడి భార్య అంటే వాలికి మొదటి నుంచి మోజు అందుకే సుగ్రీవున్ని చంపాలని ఎప్పటి నుంచో అనుకునేవాడు. ఇక కారణం దొరకడంతో అతన్ని వదిలిపెట్టకూడదనుకున్నాడు.

యుద్ధానికి పిలుచు.. నేను చూసుకుంటా

యుద్ధానికి పిలుచు.. నేను చూసుకుంటా

అలా పారిపోయిన సుగ్రీవుడికి రాముడు ఎదురవుతాడు. రాముడికి సుగ్రీవుడు అంతా చెబుతాడు. తన అన్నను చంపి తనను, తన భార్యను రక్షించమి ప్రాథేయపడతాడు. మీ అన్నను యుద్ధానికి పిలుచు.. నేను చూసుకుంటా అంటాడు. దీంతో వాలిని సుగ్రీవుడు యుద్దానికి పిలుస్తాడు. వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. చివరకు సుగ్రీవుడు నిస్సాహాయుడిగా మారుతాడు. శ్రీరాముడి కోసం అటూ ఇటూ చూస్తాడు.

అధర్మం పాటించడం వల్లే

అధర్మం పాటించడం వల్లే

వాలీసుగ్రీవులిద్దరూ ఒకే రూపంలో ఉంటారు. అయితే సుగ్రీవుడి మెడలో దండ ఉంటుంది. రాముడు చెట్టు చాటును ఉండి వాలిపైకి బాణం విసురుతాడు. తర్వాత కొన ఊపిరితో ఉన్న వాలి రాముడన్ని నిందిస్తాడు. నీకు ఇది తగునా అని ప్రశ్నిస్తాడు. నువ్వు అంత యోధుడివై ఉండి ఎందుకిలా నన్ను దొంగదెబ్బ తీశావని అడుగుతాడు వాలి. కానీ రాముడు వాలి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాడు. నువ్వు అధర్మం పాటించడం వల్లే నిన్ను ఇలా చంపాల్సి వచ్చిందని చెబుతాడు శ్రీరాముడు. నువ్వు నిజాయితీగా ఉంటే నేను నిజాయితీగానే యుద్ధం చేసేవాణ్ని అని చెబుతాడు శ్రీరాముడు.

Image Credit (all pics)

English summary

why did vali fight with sugriva

why did vali fight with sugriva
Desktop Bottom Promotion