Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తులసితో వివాహాన్ని వినాయకుడు ఎందుకు నిరాకరించాడు..?!
తులసితో వివాహాన్ని నిరాకరించిన వినాయకుడు కథ, వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్దం తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే
వినాయక చవితి రోజు అనేక పత్రాలను, పూలను తీసుకువచ్చి ఆ గణనాథున్ని పూజిస్తారు. కానీ ఆ పత్రాల్లో తులసి ఆకు ఉండదు. సర్వ దేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు యిష్టపడక పోవడానికి కారణం ఏమిటి అని మన మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న.. అయితే దీనికి సమాధానం కావాలంటే ఇది చదవండి..

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
పురాతన కాలం నుండి తులసి మొక్క గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే, ఒక సారి వినాయకుడు గంగానది ఒడ్డును కూర్చుని, తపస్సు చేస్తుంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి వినాయకున్ని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది.

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకోవడం వల్ల తపస్సుకు భంగం కలుగుతుందని అంటాడు.

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
అప్పుడు తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది. అతని వివాహం బలవంతంగా, అయిష్టంగా జరుగుతుందని తులసి శాపం పెడుతుంది.

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని, అతని వల్ల అన్నీ కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందని, వినాయకుడు తులసికి శాపం పెడతాడు.

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
కాగా వినాయకుడు శాప విమోచన చేయలేనని, కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని, ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జరగదని, అంతే కాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయని వివరించి, తులసికి వరం ఇస్తాడు.

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
తర్వాత తులసి, శంక చూద అనే రాక్షసున్ని వివాహం చేసుకుంటుంది. కొద్ది రోజు పాటు కష్టాలను అనుభవించి, ఆమె మరణిస్తుంది. మళ్లీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది.

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
అప్పటి నుండి తులసి మొక్క ఆకులను విష్ణు పూజకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూడా తులసి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాదని చెబుతారు.

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
అంతే కాదు, తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు. కాగా అంతటి పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో మాత్రం వాడరు.

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటనే అందుకు కారణమని పండితులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు. మహిళలు నిత్యం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతా మంచే జరగాలని కోరుకుంటారు.

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం పోసినా, తులసి ఆకులను ఉంచినా వారి ఆత్మ నేరుగా వైకుంఠానికే పోతుందట. దీనికి తోడు తులసి మొక్క వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

తులసి ప్రేమను నిరాకరించిన వినాయకుడు..!
తులసి ఆకులను పలు ఔషధాల తయారీలో వాడుతారు. అయితే మీకు తెలుసా..? తులిసి మొక్క హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మొక్కగా ఎందుకు మారిందో .? ఎందుకు ఆ మొక్కకు అన్ని ఔషధ గుణాలున్నాయో..? తెలుసుకోవాలంటే ఈ క్రింది లిక్స్ క్లిక్ చేయండి..



Click it and Unblock the Notifications