For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంట లక్ష్మీదేవి గృహప్రవేశం చేయాలంటే కంపల్సరీ దీపాలు వెలిగించాలి..!!

‘‘దీపంపరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు. అటువంటి సంధ్యా దీపమా నీకు నమస్కారము''

|

హిందు పండగలన్నింటిలోకి, ఘనంగా సెలబ్రేట్ చేసుకునే అతి పెద్ద పండుగ దీపావళి, అన్ని పండుగలకి తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకోవడం, బందుమిత్రులతో సరదాగా సమయాన్ని గడపటం ఉంటుంది. కానీ, ఈ పండుగకి వీటన్నింటితో పాటు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదే ''దీపాలు వెలిగించడం, టపాకాయలు కాల్చడం ' దీనికి సంబంధించిన విష్ణు పురాణంలో ఒక కథ కనబడుతుంది. దీపావళి నాడు మహాలక్ష్మీ విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయడానికి బయలు దేరిన లక్ష్మీ దేవి ఏ ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట మరి, ఇంకెం??

Why Do Hindus Light Lamps During Diwali?

లక్ష్మీ అనుగ్రహం కోరుకునే వారు అప్పటి నుంచీ దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించడం ప్రారంభించారు. లక్ష్మీ దేవి తనవాహనమైన గుడ్ల గూబ ఎక్కి, సూర్యాస్తమయ సమయం, అనగా సాయం సద్య లేక ప్రదోష వేళ నుండి అర్ధరాత్రి వరకూ సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణపురాణంలో ఉంది.

Why Do Hindus Light Lamps During Diwali?

''దీపంపరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు. అటువంటి సంధ్యా దీపమా నీకు నమస్కారము''

Why Do Hindus Light Lamps During Diwali?

''సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళి రాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు అజ్జానము, పాపము, శోకము, మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే ప్రగతి నిరోధకమైన అంశాలు. వాటన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్జ్వలనంతోనే. మాములు చీకట్లే కాదు, అజ్జానం, దు:ఖం, శోకం, అలసత, రోగం, మాంద్యము, మ్రుత్యువు మొదలైనవన్నింటిని పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది సంధ్యాదీపం.

Why Do Hindus Light Lamps During Diwali?

పగలు భగవంతుడిచ్చిన 'వెలుగు' సూర్యుడు తన సహస్రకకరాలతో అందరికీ వెలుగును పంచుతాడు. కానీ ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయమెట్లా అందుకోసం దయామయుడైన కర్మాసాక్షి తన తేజమును అగ్నియందుంచాడట. 'దీపాంతే నిహితం తేజస్సని త్రాణహుశన:''ఆ అగ్ని దేవుని మన ఇంట్లోని దీపమందు ఆవాహన చేసినట్లయితే ముల్లోకముల యందలి చీకట్లను పారదోలవచ్చట! ఎంతటి ఆశ! ఎంతటి హృద్యమైన భావన!! ఎంతటి మహోన్నత ఆశయం..!

Why Do Hindus Light Lamps During Diwali?

"సాజ్యం, త్రివర్తి సంయుక్తం, వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం, త్రైలోక్యతిమిరాపహామ్ '' ఇంతటి మహాదాశయంతో, సద్భావనతో , సదుద్ధేశంతో, వెలిగించే దీపం లక్ష్మీకి ప్రతి రూపం అవటం, దానిని చూసి లక్ష్మీ దేవి అనుగ్రహించటం సమంజసమే.

Why Do Hindus Light Lamps During Diwali?

దీపాలని చూసి లక్ష్మీ అనుగ్రహించటానికి కారణం మరొకటి కూడా, చాతుర్యాస్మ దీక్ష పాటించే నాల్గునెలలు శ్రీ మహావిష్ణువు నిదురించే సమయంగా చెబుతారు. చతుర్మాస్యం పూర్తి అయిన శ్రీమహావిష్ణువు నిద్రమేల్కొనే రోజుగా దీపావళిని చెబుతారు. ఆయన నిద్రలేవగానే కన్నులకు వెలుగు కనిపించాలి కనుక దీపాలు వెలిగించాలట.

Why Do Hindus Light Lamps During Diwali?

దీసావళి మేల్కొనటానికి ముందు సమయం. దానికి ప్రతీకగా తెల్లవారు జామునే లేచి తులసి కోట దగ్గర దీపం పెట్టటం అనే సంప్రదాయం ఏర్పడింది. దీనికి ఒక పద్దతుంది. తులసి పూజ అయినాక, కృత్తిక నక్షత్ర దర్శనం చేయాలంటారు. ఈ నెల అంతా కృత్తికల పేరు గలది కదా! తులసి పూజ కార్తీక దామోదరునికి చేస్తారు. అంటే కార్తీక మాసధిపతి అయిన విష్ణుమూర్తికి అన్నమాట. తెల్లవారు జామున దామోదరుని, పగలు, శివుణ్ణి, సాయంత్రం లక్ష్మీని ఆరాధించాలి.

English summary

Why Do Hindus Light Lamps During Diwali?

Diwali is a very popular Hindu festival. It is one of the most important Indian festivals which is either celebrated in the month of October or November. Diwali literally means 'row of lamps'. So, it is understandable that lamps play the most important role in this festival.
Desktop Bottom Promotion