For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతీయులు శుభకార్యాలకు పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారెందుకు?

By Super
|

మన దేశంలో పువ్వులకు ఒక భక్తిరస విలువ ఉన్నది. మనము దేవతలకు వారిపట్ల ఉన్న భక్తికి గుర్తుగా పువ్వులను అందిస్తాము మరియు ఏ దేవతకు తగ్గట్లుగా ఆ పువ్వులతో పూజిస్తాము. వివిధ దేవతలు మరియు దేవతల ప్రార్థనలకు, వారివారి విశిష్టతను బట్టి పువ్వులను అర్పిస్తాము.

సాధారణంగా భారతదేశంలో బంతి, మందార మరియు తామర వంటి పువ్వులను వివిధ దేవతల ఆరాధనకు ఉపయోగిస్తారు. పువ్వులు సానుకూల ఆలోచనా కంపనాలు అందిస్తాయని ఒక నమ్మకం మరియు వాటి ప్రకాశవంతమైన రంగులు మరియు సువాసనలు మన మీద దీవెనలు కురిపించే దేవతలను ఆకర్షిస్తాయని నమ్మకం.

ఒక హిందూ మతం కూడా వివాహంలో వధువు మరియు వరుడు దండలు మార్చుకునే ఆచారం ఉన్నది. ఎందుకు భారతీయులు పవిత్రమైన సందర్భాలలో పువ్వులను ఉపయోగిస్తారు అన్నది కనుక్కుందాం?

ఎందుకు ఇండియన్స్ పవిత్రమైన సందర్భాలలో పువ్వులు ఉపయోగిస్తారు?

మ్యారిగోల్డ్(బంతి పువ్వులు)

మ్యారిగోల్డ్(బంతి పువ్వులు)

మ్యారిగోల్డ్ ఒక అసహ్యకరమైన వాసన కలిగి ఉంటుంది, కనుక కీటకాలు మరియు తెగుళ్ళను దూరంగా ఉంచుతుంది. కాబట్టి ఈ పువ్వులు మరియు దండలు హిందూమత దేవతలకు అర్పిస్తారు మరియు తోరణాల రూపంలో గృహాలను అలంకరించేందుకు ఉపయోగిస్తారు.

మందార:

మందార:

అందమైన ఎరుపు పుష్పం వినాయకుడికి మరియు దేవత కాళిమాతకు అర్పిస్తారు మరియు దీనివలన కొన్ని ఔషధ ఉపయోగాలున్నాయి. మందార మీ జీవితంలో సౌభాగ్యం తీసుకుని వొస్తుంది మరియు మీ శత్రువులను నాశనం చేస్తుంది.

గులాబీలు:

గులాబీలు:

గులాబి రేకులను కొత్తగా వివాహం అయిన వారి మంచం మీద చల్లుతూ ఉంటారు, ఎందుకంటే ఇవి సహజ కామోద్దీపన కలిగిస్తాయి. గులాబీలు ఉధృతిని మరియు ఒత్తిడి మరియు అలసటను తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయని పరిశోధనలు నిరూపించాయి. గులాబీలు ఒక వ్యక్తిని మానసికంగా ఎక్కువ ప్రశాంతంగా ఉంచుతాయని కూడా ఋజువు అయ్యింది.

లోటస్:

లోటస్:

విష్ణు, బ్రహ్మ, దేవత లక్ష్మీ, సరస్వతి వంటి అనేక హిందూ మతం దేవతలకు ఈ జల పుష్పం సమర్పించబడుతున్నది. ఇది స్వచ్ఛతకు మరియు పవిత్రతకు ఒక చిహ్నంగా ఉన్నది. ఈ పువ్వుల యొక్క ముడుచుకోని రేకులు ఆత్మ యొక్క విస్తరణను సూచిస్తాయి. బుద్ధిజంలో,దీనిని సృష్టి యొక్క చిహ్నం ప్రైమార్డియల్ స్వచ్ఛతగా చెపుతారు.

జాస్మిన్:

జాస్మిన్:

పండువాసన గల ఈ పువ్వును కూడా సాధారణంగా భారతదేశంలో దేవతలను పూజించటానికి ఉపయోగిస్తారు మరియు అనేక మంది మహిళలు వారి జుట్టు పరిమళంతో గుబాళించాలని తలలో అలంకరించుకుంటారు. ఈ ఇంపైన సువాసన మీ నరాలను ప్రశాంతపరుస్తాయి మరియు మీరు ప్రశాంతంగా ఉండటంలో సహాయపడతాయి. ఈ పుష్పాన్ని పరిమళద్రవ్యములు చేయడంలో ఉపయోగిస్తారు.

English summary

Why do Indians use flowers on auspicious occasions?

In our country flowers have a devotional value. We offer flowers to the deities as a mark of devotion and as per what those deities stand to represent.
Desktop Bottom Promotion