Latest Updates
-
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి
న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కు అరుంధతి నక్షత్రం చూపించడం వెనుకున్న సైంటిఫ్ రీజన్ ఏంటి?
హిందూ వివాహ వేడుకలలో అరుంధతీ నక్షత్రం, వసిష్ట నక్షత్రాలకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు... వివాహమైన వెంటనే నూతన వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించే ఆచారం ప్రాచీన కాలం నుంచి వస్తోంది. ఒకవేళ వివాహ సమయం రాత్రి గానీ ... తెల్లవారు జామున గాని కాకపోయినప్పటికీ ఆచారం ప్రకారం అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూనే వుంటారు.
ప్రతి విహహానంతరం, ప్రతి ఒక్క జంటకు ఈ నక్షత్రాలను తప్పనిసరిగా చూపిస్తారు. దీనికి సాంస్క్రుతిక పరమార్థం దాగి ఉన్నది. అంతే కాదు కొంత సైన్సన్ పరంగా కూడా దీన్ని చూస్తే అరుంధతి నక్షత్రాన్ని ఆధారంగా చేసుకునే మనం ధ్రువ నక్షత్రాన్ని (polestar) గుర్తిస్తాము. దీన్నే ఇంగ్లీష్ లో polestar అంటారు. ఎందుకంటే దీన్ని ఆధారంగా చేసుకునే మనం దిక్కులను కనిపెట్టవచ్చు. మనం భౌగోలికంగా ఎక్కడ ఉన్నా సరే...ఈ ూేనాతొలి ఎప్పుడూ ఉత్త దిశనే సూచిస్తుంది.
మన మిలిటరీలో దీని ప్రముఖ్యత ఎంతో ఉంది,. ఇక పోతే పెళ్ళిలో ఈ నక్షత్రం వరుడికి కానీ వధువుుకు కానీ చూపించేది ఎందుకంటే దిక్కులు తెలుసుకుని గుర్గులు పెట్టుకుని మనం ఎక్కడున్నామో.. తెలిపే ప్రయత్నం ఇందులో ఉంది. ఒక వేళ ఆయానక్షత్రాలు ఎవరికైనా కనపడలేదనుకోండి. వారికి ద్రుష్టిలోపమున్నదనే విషయం బయటకు వచ్చేది. ఇంత వైజ్ఝానికి విషయాలున్నాయి. ఈ సాంప్రదాయంలో అరుంధతి దేవి జన్మ వ్రుత్తాంతము ...వసిష్ట అరుంధతిల వివాహం...మరియు వారు నక్షత్రాలుగా ఎలా మారారు అనే వృత్తాంతము తెలుసుకోవాలని ఉంటే ఈ క్రింది స్లైడ్ చూడండి..

పెళ్లైన వెంటనే అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు??
కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్థి మండలంలో వున్న వశిష్టుని తారకకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. నూతన దంపతులకు ఈ అరుందతీ నక్షత్రాన్ని చూపించడం వెనుకున్న ఓ ప్రదాన ఉద్దేశ్యం ఉంది అదేంటంటే... వశిష్ట, అరుంధతీ వీరిద్దరూ పురాణాలలోని ఆదర్శ దంపతులు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వారిలాగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు కొత్త జంటను ఆ నక్షత్రాల జంట వైప చూడమని అంటారు. ఇది ఒక సాంప్రదాయమైంది.

అసలెవరీ అరుంధతి?:
బ్రహ్మ దేవుడు సృష్టికార్యంలో తనకు సహాయంగా ఉండడం కోసం ఓ అందమైన కన్యను, అంతకు మించిన అందమైన వ్యక్తిని సృష్టిస్తాడు. ఆ కన్యపేరే సంధ్య…ఆమే తర్వాత అరుంధతిగా మారింది. ఆ అందమైన వ్యక్తే మన్మధుడు.

అసలెవరీ అరుంధతి?:
బ్రహ్మ మన్మధుడిని సృష్టించి ఓ 5 సమ్మోహన బాణాలనిచ్చాడు. వాటిని పరీక్షించాలని తలచి మన్మథుడు బ్రహ్మలోకంలోని వారిపైనే వాటిని ప్రయోగించాడు..దీంతో బ్రహ్మతో సహా అందరూ సంద్య పట్ల మోహానికి గురైయ్యారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతి ఈశ్వరుడిని ప్రార్థించగా ఈశ్వరుడు అక్కడకి ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. దీనంతటికీ కారణం మన్మథుడని తలచి బ్రహ్మ మన్మథున్ని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు.

అసలెవరీ అరుంధతి?:
తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో సంధ్యా ఆత్మహత్య చేసుకోడానికి సిద్దమవుతున్న సమయంలో వశిష్ట మహాముని శివుడిని వేడుకోమని సంధ్యకు హితోపదేశం చేస్తాడు. తన తపస్సు తో శివుడిని ప్రత్యక్షం చేసుకున్న సంద్య శివుడి చేత రెండు వరాలు పొందుతుంది.

అసలెవరీ అరుంధతి?:
నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టిలో చూచినట్లయితే, వారు నపుంసకులుగా మారాలి,
అంతేకాదు నేను పుట్టగానే అనేకమందికి మోహాన్ని కల్గించాను. కాబట్టి ఈ దేహం నశించిపోవాలి అని కోరింది.

అసలెవరీ అరుంధతి?:
శివుడు ‘తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి ఓ యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో నీ శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో నువ్వు ఎవరినైతే భర్తగా తలుస్తావో! అతడే నీ భర్త అవుతాడని చెప్పి మాయమవుతాడు శివుడు.

అసలెవరీ అరుంధతి?:
సంస్కృత భాషలో "అరుం= అగ్ని", "ధతీ= ధరించినది" ,అంటే అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె ‘అరుంధతీ అయ్యింది. ఆమె తాను మరణిస్తూ వశిస్ఠుడిని భర్తగా తలచింది. ఈ దంపతులకు పుట్టినవాడే ‘శక్తీ. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు.

సైన్స్ కు దారి చూపుతున్న అరుంధతీ నక్షత్రం.!
అరుందతీ నక్షత్రాన్ని బేస్ గా చేసుకునే మనం ధృవ నక్షత్రాన్ని(Polestar) గుర్తిస్తాం.

సైన్స్ కు దారి చూపుతున్న అరుంధతీ నక్షత్రం.!
ఈ ధృవ నక్షత్రం ఎప్పుడూ ఉత్తర దిక్కునే సూచిస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనం దిశలను గుర్తిస్తున్నాం.

సైన్స్ కు దారి చూపుతున్న అరుంధతీ నక్షత్రం.!
దీని ఆధారంగానే గతంలో నావికులు సముద్రయానం చేసేవారు.
Image Courtesy



Click it and Unblock the Notifications