Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హిందు సాంప్రదాయంలో కాకికి అన్నం పెట్టడం వెనుకున్న పరమార్థం ఏంటి?
కాకి శనైశ్చురుని వాహనం. మనము భోజనం చేసే ముందు అన్నము దేవునికి నివేదనం చేసి కాకికి పెట్టమని మన పెద్దలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. గరుడ పురాణంలో మన పితరులు కాకి రూపంలో భూలోకమంది సంచారం చేస్తూ మనము సమర్పించే అన్నం తింటూ మనలను ఆశీర్వదిస్తారు.
కాకిక శనైశ్చరుని వాహనం మరియు మన పితరులు కూడా కాకి స్వరూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాకి యమలోక ద్వారమందు ఉంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ ఉంటుంది. కాకికి అన్న పెట్డడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు త్రుప్తి చెంది మనకు ఆశీర్వదిస్తారుని శాస్త్రాలు చెబుతున్నాయి.
కాకి అపర కార్యాలమయందు మరియు శ్రాద్ద దినములందు అన్నము ముట్టకపోతే మన పితరులకు మనపై ఆగ్రహం లేక కోపం ఉన్నదని పెద్దల విశ్వాసం. అందువల్లే కాకి అన్నం ముట్టే వరకు తాపత్రయపడి ముట్టిన తర్వాత భోజనం చేస్తారు.

'గయ'లో మన పిండములు వేసి శిలకు పేరు 'కాకశిల' అని పేరు ఆ శిలపై పిండములు ఉంచి మన పితరులను ప్రార్థిస్తే కాకి తానొక్కటే భుజించకుండా కావుకావు మని కేకలు వేసి తన వారినందరినీ చేర్చుకుని అన్నం తింటుంది. అంత గొప్ప వివేకము గల ప్రాణి కాకి...
కాకి అరిస్తే మంచిది.. తాకితే అశుభం.. ఎందుకు ?
కాకి ఎవ్వరికీ హాని చేయని ప్రాణి మన చుట్టూ వుండే అశుద్దములను తొలగించటంలో మనకు సహాయ పడుతుంది కాబట్టి కాకికి అన్నం పెట్టడం అనే ఆచారం కూడా మన పెద్దలు ఏర్పాటు చేసివుంటారు.
కాకికి అన్నము పెట్టడం వల్ల కుటుంబమున అన్యోన్యత సఖ్యత కలిగి ఉంటారు. శని దేవత వాహనం కాకి అందువల్ల మనకు శని అనుగ్రహం కూడా కలుగుతుంది.
శనివారం నాడు కాకికి బెల్లం ముద్దతో కలిపిన ఆహారం పెట్టడం వల్ల మనకు ఉన్న ఏలినాటి శని దోషం తొలగిపోయి, శని మహర్ధశ మరియు శని భుక్తి కలుగుతుందని వారికి మంచి జరుగుతుందని జ్మోతిష్య శాస్త్రం చెబుతున్నది.



Click it and Unblock the Notifications