Latest Updates
-
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక!
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఏమవుతుంది?
అక్షయ తృతీయ అనబడే వైశాఖ శుద్ద తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహా విష్ణువు పరశురామావతారాన్ని ధరించడాని పురాణ ప్రతీతి. ఈ రోజున రాహుకాలం, వర్జ్యంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభాకార్యాన్నైనా జరుపుకోవచ్చని పురోహితులు చెబుతరు. నరసింహ స్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది కూడా ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. బదరీనాథ్ లోని ఆలయాన్ని ఇవాల తెరచి ఉంచుతారు. ఇలా అన్ని రకాలుగా వైశిష్ట్యం ఉన్న రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ గురించి మరికొన్ని విషయాలు...

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది:
శ్రీ మహావిష్ణువు కు ప్రీతికరమైన ప్రతిదీ ఆయన ఇల్లాలైన మహా లక్ష్మికి కూడా ప్రీకరమే. శ్రీ మహా విష్ణువు పరశురాముని అవతారం దాల్చిన రోజు కాబట్టి ఈ రజున ఏమి చేసినా అది అక్షయంగా మిగిలిపోతుంది. అని పురాణాలు చెబుతున్నాయి. ఇవాళ చేసే పూజలు, పుణ్య కార్యాలు , ధార్మిక కార్యాలకు సంబంధించిన ఫలితం ఎన్ని జన్మలైనా అలాగే ఉంటుంది. అందుకే ఈ రోజున అందరూ తమ శక్తి మేరకు జప దానాలు చేయాలని శస్త్ర వచనం.

అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది:
పత్రం, ఫలం, తోయం అన్నట్టు ఆ దేవదేవుడికి అపారమైన భక్తితో అచంచలమైన విశ్వాసంతో ఒక్క నమస్కారం పెట్టుకున్నా చాలు. ఈ పుణ్య ఫలం జన్మ జన్మలకు తోడూ నిలుస్తుంది. క్షయం కానీ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చింది.

అక్షయ తృతీయ రోజున ఏమి చేయాలి
మామూలుగా అక్షయ తృతీయ అనగానే అందరికీ బంగారం గుర్తుకు వస్తుంది. ఇవాల చేసిన పని ఏదైనా శాశ్వతంగా ఉండిపోతుంది. అన్న మాటను బంగారం కొనడం, కొత్త ఆస్తులు కొనడంలా అర్ధం చేసుకునొ అవే పాటిస్తున్నారు ప్రజలు. దీనికి అసలైన అర్ధం అక్షయ తృతీయ రోజున ఎటువంటి పుణ్యకార్యం చేసినా ఆ ఫలితం శాశ్వతంగా ఉండిపోతుంది అని.

అక్షయ తృతీయ రోజున ఏమి చేయాలి
అక్షయ తృతీయరోజున ఉదయాన్నే లేచి, స్నానాదికారాలు ముగించుకుని, అక్షతలను శ్రీ మహా విష్ణువు పాదాలపై ఉంచి పూజ చేయాలి. తర్వాత ఆ బియ్యాన్ని జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి, మిగిలిన బియ్యాన్నీ దైవ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతం చేసిన తర్వాత వచ్చే 12మాసాలలో ప్రతి శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణువును అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలం లభిస్తుంది .

అక్షయ తృతీయనాడు బంగారం ఎందుకు కొంటారు
అక్షయ తృతీయనాడు ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్మకం. అక్షయ తృతీయ శ్రీ మహా విష్ణువుకు మరియు మహాలక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని, అంటే బంగారాన్ని కొంటారు. ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు.

అక్షయ తృతీయ నాడు చేయకూడని పనులు ఏంటి?
శ్రీ మహా విష్ణువుకు , శ్రీ మహాలక్ష్మికీ ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి, ఈ రోజున ఎటువంటి పాప కార్యములు గాని, చెడు ఆలోచనలు కానీ చేయకూడదు. ఈ రోజున చేసిన ఎటువంటి పని అయాన దాని ఫలితము అక్షయము కాబట్టి, పాపకార్యాలు చేస్తే ఆ ఫలితం కూడా జన్మ జన్మలకూ వెంటాడుతుందని చెబుతారు.

అక్షయ తృతీయ నాడు చేయకూడని పనులు ఏంటి?
శక్తి కొలదీ మాత్రమే దానం చేయాలి. ఇబ్బంది పడుతూ శక్తికి మించిన దానం చేయరాదు.

అక్షయ తృతీయ నాడు చేయకూడని పనులు ఏంటి?
అక్షయ తృతీయ నాడు ఏవైనా జీవితానికి పనికొచ్చే కొత్త విషయాలు నేర్చుకోవడం మానరాదు.

అక్షయ తృతీయ నాడు చేయకూడని పనులు ఏంటి?
ఎవరి మీద కోపం మరియు ద్వేషం చూపరాదు.



Click it and Unblock the Notifications