Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Bonalu in Telangana: బోనాల పండుగ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయం మీకు తెలుసా!
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ నేల పులకించిపోతుంది. ప్రతీ గల్లీ ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. డప్పుల దరువులు, రంగం (భవిష్యవాణి) చెప్పడం, శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగాలతో ఊరూవాడా జాతరను తలపిస్తుంది. ముఖ్యంగా భాగ్యనగరంలో ఈ పండుగ సంబరం అంబరాన్నంటుతుంది. బోనాలు కేవలం ఒక పండుగ కాదు, తెలంగాణ ఆత్మగౌరవ పతాక. ప్రజల విశ్వాసానికి, సంప్రదాయానికి జీవనాడి. ఈ ఏడాది జూన్ 29న మొదలైన బోనాలు జులై 20,2025 వరకు కొనసాగుతాయి.
అమ్మవారికి ఆషాఢంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారు
అమ్మవారికి ఆషాఢంలోనే బోనాలు సమర్పించడం వెనుక ఓ అందమైన నమ్మకం, బలమైన కారణం ఉన్నాయి. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఎంత ప్రేమగా, గారాబంగా చూసుకుంటామో అదే విధంగా జగజ్జనని అయిన అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచులా భావించి, భక్తిశ్రద్ధలతో బోనం వండి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆమెలోని రౌద్ర రూపాన్ని శాంతింపజేసి, కరుణను పొందేందుకే ఈ వేడుక.

బోనం తయారీ - ఒక పవిత్ర కార్యం
బోనం అంటే భోజనం. ఇది అమ్మవారికి ప్రేమతో సమర్పించే నైవేద్యం. మహిళలు ఎంతో శుచిగా, కొత్త మట్టి కుండలో పాలు, బెల్లంతో వండిన అన్నాన్ని సిద్ధం చేస్తారు. ఆ కుండకు పసుపు, కుంకుమలతో అలంకరించి వేపాకు కొమ్మలు చుట్టి పైన దీపారాధన చేస్తారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ బోనాన్ని తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరుతారు. బోనం ఎత్తుకున్న మహిళను సాక్షాత్తూ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఆమెలోని రౌద్రాన్ని శాంతింపజేయడానికే భక్తులు ఆమె పాదాలపై నీళ్లు చల్లుతూ స్వాగతం పలుకుతారు.
భక్తి వెనుక దాగిన విజ్ఞానం
బోనాల పండుగ వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు ఓ గొప్ప సైంటిఫిక్ రీజన్ కూడా దాగి ఉంది. పూర్వం వర్షాకాలంలో వైద్య సదుపాయాలు లేని రోజుల్లో కలరా, మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలి గ్రామాలు నాశనమయ్యేవి. ఈ మహమ్మారుల నుంచి తమను కాపాడమని గ్రామదేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మలను వేడుకునేవారు. ఈ ఆరాధనలో ఉపయోగించే పసుపు, వేపాకులు శక్తివంతమైన యాంటీసెప్టిక్‌లు, యాంటీ వైరల్ గుణాలు కలిగినవి. పసుపు నీళ్లు చల్లడం, వేపాకు తోరణాలు కట్టడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టేవారు. దుష్ట శక్తులను పారద్రోలడానికి చేసే బలి కూడా ఇందులో భాగమే. అందుకే బోనాల పండుగ కేవలం ఒక వేడుక కాదు. అది తెలంగాణ ప్రజల జీవన విధానం, వారి సంస్కృతికి దర్పణం. పంటలు బాగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రకృతిని దైవంగా కొలిచే గొప్ప సంప్రదాయానికి ఇది ప్రతీక. ఈ బోనాల జాతర తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిలువెత్తు నిదర్శనం.



Click it and Unblock the Notifications