For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అసలు ఉగాది పండుగని ఎందుకు చేసుకుంటారో తెలుసా?

అసలు ఉగాది పండుగని ఎందుకు చేసుకుంటారు ?

|

దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన హిందూ పండుగలలో ఉగాది కూడా ఒక్కటి. ఈ ఉగాదితో ఈ రాష్ట్రాలలో నూతన సంవత్సరాది ప్రారంభమవుతుంది. మారుతున్న కాలాల ప్రకారం దైనందిక జీవితాల దగ్గరనుండి జీవితాల దాకా ప్రతి విషయములోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి అనేది కాదనలేని సత్యం. తద్వారా అనేకమందికి ఉగాది ప్రాముఖ్యత, ఉగాదిరోజున చేయవలసిన విధి విధానాలు అనునవి తెలియడంలేదు.

ఈ ప్రక్రియలో, ఈ హిందూ సమాజం లోని సభ్యులుగా ఉన్నందుకు మన పండుగలను కాపాడుకుని, భావి తరాలకి వాటి విశిష్టతలను తెలియజేసే భాద్యత మనపై ఉంది. ఎన్నో పండుగలు ఒక కారణంగా ప్రారంభమైనా, వాటి వాటి కారణాల కారణంగా నెమ్మదిగా కనుమరుగవుతూ వాటి ప్రాసిస్థ్యాన్ని కోల్పోతున్నాయి. కానీ ఉగాది మాత్రం నేటికీ హిందువుల మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.

Why is Ugadi celebrated


అసలు ఉగాది పండుగని ఎందుకు చేసుకుంటారు:

హిందువుల కాలెండర్ ప్రకారం చైత్ర మాసాన్ని మొదటి నెలగా భావిస్తారు, ఈ మొదటి నెల ప్రారంభమయిన చైత్ర శుద్ద పాడ్యమి రోజున ఊగాదిగా పండుగ చేసుకుంటారు. ఈ ఊగాదినే మహారాష్ట్రలో “గుడి పాడ్వా“ గా చేసుకుంటారు. ఈ రెండు పండుగల అంతరార్ధం ఒకటే కావున ఈ రెండు పండుగలూ ఒకటే. పేర్లు మాత్రమే వేరు.

ఈ నాలుగు రాష్ట్రాలలో పండుగ చేసుకునే విధానాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఇది ఉదయాన్నే ప్రారంభమై రాత్రి వరకూ ఉండి వెళ్లిపోతుంది కానీ , పండుగ చేసుకునే విధానంలో మాత్రం రాష్ట్రాలకు, సమాజాలకూ వ్యత్యాసాలు ఉంటాయి.

పండుగను తాజాగా ప్రారంభించండి:

ఉగాది అంటేనే నూతన సంవత్సరాది కావున, పండుగను కూడా అంతే నూతనంగా ఆహ్వానించాలి. కావున అనేకమంది ఇళ్ళల్లో వారం రోజుల నుండే సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇంటిని , కార్యాలయాలను శుభ్రపరచుకోవడం. మురికి బట్టలు లేకుండా చేయడం, అవసరంలేని వస్తువులని తొలగించడం వంటి పనులతో వారం నుండే సన్నాహాలు ప్రారంభమవుతాయి. తద్వారా అన్నిరకాల ప్రతికూలతలను తరిమివేసి, పండుగని నూతనంగా ఆహ్వానిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ శుభ్రపరచువిధానంలో కుటుంబసభ్యులు అందరూ పాలుపంచుకోవడం వలన వారి మద్య సన్నిహిత సంబంధాలు మెరుగవుతాయి.

Why is Ugadi celebrated

చర్మ రక్షణ :

వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. ఉగాది పండుగ ముఖ్యంగా వేసవికి ముందు నెలలు అయిన మార్చి, ఏప్రిల్ నెలలలో వస్తుంది. తద్వారా చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పకనే సూచిస్తుంది.

ఈ పండుగలు ఉదయమే స్నానం చెయ్యాలని నిర్దేశిస్తాయి. కొన్ని సంప్రదాయాలప్రకారం ఈ స్నానం గోరువెచ్చని నీళ్ళతోనే చేయాలి. సంప్రదాయ స్నానం తర్వాత కొత్తబట్టలు లేదా ఉతికిన సంప్రదాయకరమైన బట్టలు ధరించడం ఆనవాయితీ.

ఈ విధంగా ఎంపికచేయబడిన నూనెలతో తలంటుకుని స్నానం చేయడం మూలంగా చర్మానికి, జుట్టుకు ఆరోగ్యాన్ని చేకూర్చవచ్చునని దీని వెనుకనున్న గూడార్ధం. ఆచారాల వెనుక శాస్త్రీయతర్కాన్ని కూడా జోడించేవారు కదా మన పెద్దలు.

సాంప్రదాయక ఆహారం:

మనదేశంలోని ఏ పండుగ అయినా ఆయాకాలాలను అనుసరించి తయారుచేసే సాంప్రదాయక ఆహారాన్ని తీసుకోకుండా సరైన ముగింపుని ఇవ్వలేవు. ఆహారానికి అంత విలువిస్తారు. అదే విధంగా ఈ వేసవికాలo అడుగుపెట్టబోతుందనడానికి సూచనగా ఉదయాన్నే మామిడి, చింతపండు, బెల్లం, వేప పువ్వు, నిమ్మరసం, ఉప్పు, మిరియాలు, చింతపండు,కొబ్బరి కోరు ,అరటిపండు లను కలిపి చేసిన షడ్రుచుల సంగమం అయిన ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా ప్రారంభిస్తారు. ఈ షడ్రుచులను కోపం, హాస్యం, ఆశ్చర్యం, భయం, ధైర్యం, సున్నితం వంటి భావార్ధాలు సూచకంగా చెప్తుంటారు.

ఈరోజు మామిడి పండు లేకుండా రోజుని ముగించడం పండుగ పూర్తైనట్లు కాదు అని అనేకమంది అభిప్రాయం. ఏకాలంలో దొరికే వాటిని ఆ కాలంలోనే ఆస్వాదించేలా చేయడానికి ఈ పండుగల రూపంలో మనకు తెలియజేశారు మన పూర్వీకులు.

Why is Ugadi celebrated

శ్రావణానందకరమైన పంచాంగ శ్రవణం:

పంచాంగ శ్రవణం వినని ఉగాది పూర్తైనట్లు కాదు అని ప్రజల నమ్మకం. రాబోవు కాలాలలో తమ భవితవ్యాలు ఎలా ఉండబోతున్నాయో పంచాంగ శ్రవణ కర్తలు గుళ్లలో లేదా ఇళ్లకు వచ్చి చెప్పడం ఆనవాయితీగా వస్తున్నది. వీరిచ్చే సూచనల ఆధారoగా సంవత్సరంలో కీలకమార్పులకు ఆలోచనలు చెయ్యగలరని పెద్దల విశ్వాసం.

పంచాంగ శ్రావణానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రజలు సమూహంగా కూడి పంచాంగ కర్తల , పంచాంగ శ్రవణం చేయు సందర్భంగా వారి మద్య సన్నిహిత సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాలలో పంచాంగ శ్రవణం అనేది ఉగాది సాయంత్రం వేళల్లో చేస్తుంటారు.

ఈవిధంగా ఉగాది పండుగ ప్రజల మద్య సన్నిహిత సంబంధాలను మెరుగుపరచడానికి వేదికగా నిలుస్తుంది. మీరు కూడా ఉగాది పండగను ఇలాగే జరుపుకోండి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. ఈ నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబసభ్యులకు మంచి చేకూర్చాలని కోరుకుంటూ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు.

English summary

Why is Ugadi 2023 celebrated?

Why is Ugadi celebrated,We celebrate Ugadi but least do we know the reason behind why it is celebrated and also the importance of celebrating the festival, well, here is why Ugadi is celebrated. Read here to know more.
Desktop Bottom Promotion