Latest Updates
-
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే!
శని ఆలయాల్లో కాళీ దేవి విగ్రహం ఎందుకు ఉంటది? దీని వెనుక రహస్యం ఇదే
హిందూమతంలో శని దేవుడికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఎవరైనా జాతకంలో శని దోషాలు వంటివి ఉంటే శనీశ్వరాలయాలకు వెళ్లి పూజలు జరిపిస్తుంటారు. అయితే మనం ఎప్పుడైనా శనిదేవుని ఆలయాలకు వెళ్లినప్పుడు శని విగ్రహం పక్కనే కాళికాదేవి విగ్రహం కూడా ఉండటం మనం తరచుగా చూస్తుంటాం. అయితే శనిదేవుడి పూజా నియమాలను కాళీమాతతో కలిపి ఆచరించడం వెనుక బలమైన, ఆసక్తికరమైన కారణాలే ఉన్నాయి. అసలు దీనివెనుక ఉన్న ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
శని, కాళీ మధ్య తేడా
పురాణాల ప్రకారం శనీశ్వరుడు అత్యంత శక్తిమంతుడు, కర్మఫలదాత, న్యాయనిర్ణేత. ఆయన సూర్యపుత్రుడు, యమధర్మరాజు సోదరుడు. మనుషులు చేసే మంచి చెడు కర్మలను బట్టి వారికి శుభాశుభ ఫలాలను శనీశ్వరుడు అందిస్తాడు. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ శుభాలే, కానీ ఆయన వక్రదృష్టి పడితే కష్టాలు, నష్టాలు, అవమానాలు తప్పవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే శని ఆరాధనలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా అది తీవ్ర ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని, జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవలసి వస్తుందని నమ్ముతారు. ఈ ప్రతికూల ప్రభావాలను నివారించి, భక్తులను కాపాడటానికే శనిదేవునితో పాటు దక్షిణ కాళికాదేవిని ఆరాధిస్తారు.

కాళికాదేవి ఆదిపరాశక్తి ఉగ్రరూపమైనా, తన భక్తుల పాలిట కరుణామయి. ఆమె శక్తి స్వరూపిణి, దుష్టశిక్షకి, శిష్టరక్షకి. కాలానికి అధిదేవత అయిన కాళి అన్ని రకాల ప్రతికూల శక్తులను నాశనం చేసి, భక్తులను అన్ని ఆపదల నుండి, భయాల నుండి కాపాడుతుంది. ముఖ్యంగా,దక్షిణ కాళి రూపం అత్యంత సౌమ్యమైనది, భక్తుల కోరికలను తీర్చే తల్లిగా, ఆపదలలో ఆదుకునే ఆపద్బాంధవిగా ఆమెను కొలుస్తారు.
ఆధ్యాత్మిక సంబంధం
శనిదేవుడికి, కాళికాదేవికి మధ్య లోతైన ఆధ్యాత్మిక సంబంధం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. శని.. కర్మ, న్యాయానికి ప్రతీక అయితే.. కాళికాదేవి కాలానికి, చెడును నాశనం చేయడానికి, పునర్జన్మకు అధిదేవత. ఈ ఇద్దరు శక్తివంతమైన దేవుళ్ల కలయిక జీవితంలోని దుష్ట శక్తులను, ప్రతికూల ప్రభావాలను సమర్థవంతంగా తొలగించి శుభ ఫలితాలను, విజయాన్ని ప్రసాదిస్తుందని ప్రగాఢ నమ్మకం. శని దేవుని అశుభ ప్రభావాలైన ఏలినాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శని, శని మహాదశ వంటి కష్టకాలాలలో దక్షిణ కాళీ పూజ అత్యంత ఫలవంతమైనదని ఆ కష్టాల నుండి, బాధల నుండి గట్టెక్కిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
శనిదేవుడిని "క్రూర గ్రహం" లేదా "పాప గ్రహం" అని కూడా అంటారు. ఆయన దృష్టి పడితే జీవితం అల్లకల్లోలమవుతుందని అంతులేని కష్టాలు తప్పవని ప్రజలు భయపడతారు. అయితే కాళికాదేవి సర్వ భయాలను, బాధలను తొలగించే తల్లి కాబట్టి, శనిదేవుని దుష్ప్రభావాలను, ఆయన కోపాన్ని నివారించడానికి కాళీమాతను ఆరాధిస్తారు. అంతేకాకుండా శని ప్రభావంతో ముడిపడి ఉన్న అంధకారం, కష్టాలు, నిరాశ, ప్రతికూల సమయాల నుండి దక్షిణ కాళికాదేవి తన భక్తులకు ఉపశమనాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. శాస్త్రాల ప్రకారం కర్మ విమోచనకు శని,కాళీ ఇద్దరూ ముఖ్యమైన దేవతలే. మానవుడు తన పూర్వజన్మ, ఈ జన్మ కర్మల నుండి విముక్తి పొందడానికి వీరిద్దరి అనుగ్రహం అవసరం. శని ప్రభావంతో బాధపడేవారు కాళికాదేవిని ఆరాధించడం ద్వారా శనిదేవుని ఆగ్రహాన్ని శాంతింపజేయవచ్చని, తద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతారు.
ఆ రోజున పూజ చేస్తే తిరుగుండదు
శని ఆలయంలో దక్షిణ కాళికాదేవిని పూజించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు, భయాలు, అరిష్టాలను, దరిద్రాలను తొలగించి, విజయాన్ని, శాంతిని, సౌభాగ్యాన్ని, ఆయురారోగ్యాలను పొందడమే. ముఖ్యంగా శనివారాల్లో శని ఆలయంలో కాళికాదేవిని దర్శించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుందని, కోరిన కోరికలు నెరవేరతాయని, శని దోషాల నుండి విముక్తి లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. కాబట్టి, శని ఆలయాలలో కాళికాదేవి ఆరాధన అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య కారణాలున్నాయి.



Click it and Unblock the Notifications











