For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీకృష్ణుడు కుట్రపన్ని బార్బరిక్ ను చంపేశాడు, లేకుంటే కురుక్షేత్రమే లేదు, పాండవులందరినీ చంపేసేవాడు

కురుక్షేత్ర యుద్ధంను క్షణాలలో ముగించే అధ్బుత శక్తులు ఒక్కరికి ఉన్నాయి అతనే భీముడి మనవడు.. ఘటోత్కచుడు కొడుకు బార్బరిక్ (బార్బరిక, బార్బరిక్). కురుక్షేత్ర యుద్ధం, శ్రీకృష్ణుడు, బార్బిరిక్, బార్బిరికుడు

|

మహాభారతం గురించి తెలియని వాళ్ళు ఉంటారా?బహుశా పూర్తిగా తెలియక పోవొచ్చు కాని శ్రీ కృష్ణ పరమాత్ముని లీలల,పాండవుల,కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం ఇలా ఎంతో కొంత తెలిసి ఉంటుంది.మహా భారతం గురించి అందులో వ్యక్తుల గురించి మన పెద్దలు ఎప్పుడు చెబుతూనే ఉంటారు. అప్పట్లో 18 రోజుల పాటు ఏకధాటిగా సాగిన కురుక్షేత్ర యుద్ధంలో అప్పట్లో రాజ్యంలోని 80 శాతం పురుషుల జనాభా మరణించారు.ఇప్పటికి ఈ యుద్దాన్ని అతి పెద్ద యుద్ధంగా భావిస్తారు.ఈ యుద్ధం లో పాండవులు గెలిచారు,కౌరవులు ఓడారు.

క్షణాల్లో ముగించే అద్బుత శక్తులు

క్షణాల్లో ముగించే అద్బుత శక్తులు

అస్సలు కురుక్షేత్ర యుద్ధంను క్షణాలలో ముగించే అధ్బుత శక్తులు ఒక్కరికి ఉన్నాయి అతనే భీముడి మనవడు.. ఘటోత్కచుడు కొడుకు బార్బరిక్ (బార్బరిక, బార్బరిక్). కాని కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వక ముందే శ్రీ కృష్ణుడు బార్బరిక్ ని చంపేశాడు. అస్సలు బార్బరిక్ ఉన్న అద్భుత శక్తులు ఏంటి కురుక్షేత్ర యుద్ధం లో బార్బరిక్ ఎందుకు పాల్గొనలేదు?శ్రీ కృష్ణుడు బార్బరిక్ ను ఎందుకు చంపాడు?

యోధుడు

యోధుడు

పాండవుల కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయమది. ఘటోత్కచుని కుమారుడు తాను కూడా యుద్ధం లో పాల్గొనాలనే ఉద్దేశంతో బయలుదేరాడు. అతని తల్లి మౌరి ఓడిపోయేవారికి అండగా పోరాడి వాళ్లకు గెలుపు అందించాల్సిందిగా అతని చేత ఒట్టు వేయించుకుంటుంది. బార్బరిక్ చిన్న నాటి నుంచి యోధుడిగా పేరు పొందాడు.

మూడు బాణాలు

మూడు బాణాలు

అతని విద్యలకు మెచ్చిన పరమ శివుడు అతనికి అత్యంత శక్తివంతమైన మూడు బాణాలను అనుగ్రహించాడు. బార్బరిక్ యుద్దానికి బయలుదేరిన విషయం శ్రీ కృష్ణునికి తెలియడంతో అతన్ని పరీక్షించాలి అనుకున్నాడు. ముసలి బ్రాహ్మణ వేషం ధరించి మార్గం మధ్యలో బార్బరిక్ ను కలిశాడు శ్రీ కృష్ణుడు.

యుద్దానికి వెళ్ళే మొహమా

యుద్దానికి వెళ్ళే మొహమా

యుద్దానికి వెళ్ళే మొహమా ఇది మూడు బాణాలను పట్టుకొని శత్రువులను మట్టికరిపించే వీరుడు బయలుదేరావా అంటూ బార్బరిక్ ను శ్రీ కృష్ణుడు వెటకారం చేశాడు. శత్రు సైన్యాన్ని అంత మట్టికరిపించడానికి నా ఒక్క బాణం చాలు అని బార్బరిక్ అన్నాడు.

మిగతా వారందరినీ నాశనం చేస్తుంది

మిగతా వారందరినీ నాశనం చేస్తుంది

మొదటి బాణం ప్రయోగిస్తే అది తాను నాశనం చేయాలనుకున్న వారిని గుర్తు పట్టి వస్తుందని, రెండో దానిని వేస్తే అది తాను కాపాడాలనుకున్న వాటిని గుర్తుపట్టి వస్తుందని, మూడో బాణం వేస్తే అది తాను కాపాడాలనుకున్న వారిని విడిచిపెట్టి మిగతా వారందరినీ నాశనం చేస్తుందని చెబుతాడు బార్బరిక్.

శ్రీ కృష్ణుడు ఎగతాళి చేయడం ఆపలేదు

శ్రీ కృష్ణుడు ఎగతాళి చేయడం ఆపలేదు

బార్బిరిక్ ఇంతగా చెప్పినప్పటికీ శ్రీ కృష్ణుడు ఎగతాళి చేయడం ఆపలేదు. పక్కనే ఉన్న రావి చెట్టుపై ప్రయోగించి చూపించమన్నాడు. బార్బరికుడు ఆ పరమ శివున్ని తలచుకొని బాణం ప్రయోగించడానికి కళ్లు మూసుకోగా శ్రీ కృష్ణుడు ఠక్కున ఒక రాగి ఆకు తీసుకోని అతని అరికాలు కింద పెట్టుకున్నాడు.

కౌరవుల తరుపున కనుక యుద్ధం చేస్తే

కౌరవుల తరుపున కనుక యుద్ధం చేస్తే

బార్బరికుడు (బార్బరిక్) వేసిన బాణం రావి చెట్టు మీద అన్ని ఆకులు గుర్తించి చివరగా కృష్ణుని అరికాలు దగ్గరికి వచ్చి ఆగింది. దీంతో శ్రీ కృష్ణునికి అర్ధం అయ్యింది.. బార్బరికుడు కౌరవుల తరుపున కనుక యుద్ధం చేస్తే ఆ బాణాలు పాండవులని వదలవని అనుకున్నాడు. నువ్వు పాండవుల వైపు యుద్ధం చేయాలని శ్రీ కృష్ణుడు బార్బిరిక్ ను అడుగుతాడు. కాని తాను తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నేను ఓడిపోయే వాళ్ళ వైపే యుద్ధం చేస్తానని చెబుతాడు బార్బరిక్.

బార్బరిక్ ని చంపాలి

బార్బరిక్ ని చంపాలి

చివరగా ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణుడు ఎలాగైనాబార్బరిక్ ని చంపాలి అని మళ్లీ ఒక వృద్దుని వేషంలో వచ్చి ఒక వరం అడుగుతాడు. దానికి బార్బరికుడు ఏమి కావాలో అది ఇస్తాను అని మాట ఇస్తాడు దానికి ఆ వృద్దుడు నీ తల కావాలని అడుగుతాడు. ముసలి వ్యక్తి ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదనుకుంటాడు బార్బరిక్. ఇచ్చిన మాట ప్రకారం తన తల ఇస్తానని కాని ఇచ్చేముందు నీ అస్సలు రూపం చూపించమని అడుగుతాడు.అందుకు వెంటనే ఆ ముసలి వ్యక్తి శ్రీ కృష్ణునిగా మారిపోతాడు.

బార్బరిక్ ఒక వరం కోరుతాడు

బార్బరిక్ ఒక వరం కోరుతాడు

అయితే తలను నరికి ఇచ్చే ముందు శ్రీ కృష్ణున్ని కూడా బార్బరిక్ ఒక వరం కోరుతాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగినంత సేపు తాను ఆ యుద్దాన్ని వీక్షించాలని కోరుతాడు. అందుకు అంగీకరించిన శ్రీ కృష్ణుడు బార్బరిక్ తలను ఎత్తైన పర్వతం మీద పెడతాడు. యుద్ధం ముగిసిన తర్వాత బార్బరిక్ తలను రూపవది నదిలో వదిలేస్తాడు శ్రీ కృష్ణుడు.

లోకకళ్యాణార్థమే

లోకకళ్యాణార్థమే

అలా వదిలేసిన తల కలియుగం లో రాజస్థాన్ లోని కార్టో గ్రామంలో లభించింది. దీంతో అప్పటి రాజు బార్బరికునికి గుడి కట్టించాడు. శ్రీ కృష్ణుడు కుట్రపన్ని బార్బరిక్ ను చంపేశాడు అని కొందరు అంటారు. అయితే బార్బరిక్ బతికి ఉంటే కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగేదో అని కొందరు అంటుంటారు. శ్రీ కృష్ణ పరమాత్ముడు లోకకళ్యాణార్థమే అలా చేశాడని అందరికీ తెలిసిందే.

English summary

why krishna took life of barbarika before mahabharata

why krishna took life of barbarika before mahabharata
Desktop Bottom Promotion