For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయకుడికి ఉండ్రాళ్ళంటే ఎందుకు ఇష్టం

వినాయకుడికి ఉండ్రాళ్ళంటే ఎందుకు ఇష్టం

|

భగవంతుడైన గణపతికి ఉండ్రాళ్లంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన ప్రతిరూపంలోనూ ఒక పాత్రలో ఉండ్రాళ్లతో కన్పిస్తారు. అవంటే అంత ఇష్టం కాబట్టి ఆయనకి జరిగే ఏ పూజలోనూ ఉండ్రాళ్ళు నైవేద్యం లేకుండా ఆ పూజ పూర్తవ్వదు. లడ్డూలు కూడా పెట్టినా ఉండ్రాళ్ళంటేనే గణపతికి ఎక్కువ ఇష్టం. అవంటే గణేషుడికి ఎందుకంత ఇష్టమో ఒక ఉండ్రాళ్ల కథ కూడా ఉన్నది. కింద చదవండి.

అత్రి మహాముని పరమశివుడిని,కుటుంబాన్ని ఆహ్వానించారు

ఒకప్పుడు అత్రి మహాముని,ఆయన భార్య అనసూయ పరమశివుడిని,ఆయన కుటుంబాన్ని భోజనానికి పిలిచారు. పరమశివుడు పార్వతి అమ్మవారు,చిన్నారి గణేషుడితో వారి ఇంటికి వెళ్ళారు. అందరికీ తెలిసినట్టు గణపతి ఆకలికి ఎక్కువసేపు ఆగలేడు. తన తల్లితో ఆకలేస్తోందని చాలా చెప్పాడు. అందుకని భోజనం తయారవ్వగానే అనసూయ మొదట చిన్నారి గణేషుడికి వడ్డిస్తానని చెప్పారు. గణపతికి ఎంత ఆకలి వేసిందంటే అనసూయ పెడుతూనే పోయారు,గణపతి తింటూనే పోయాడు. అయినా ఆకలి మాత్రం తీరలేదు.

Why Lord Ganesha Likes Modaka

హిందూ కథలు

ఆఖరిగా మాత అనసూయ తను తయారుచేసిన తీపి వంటకాన్ని గుర్తుచేసుకున్నారు. దానికి చాలా లాభాలున్నాయి. వెంటనే అది తెచ్చి గణేషుడికి వడ్డించారు. ఇక, గణపతికి తీపి వంటకాలంటే ఎలాగో ప్రీతి కాబట్టి వెంటనే రెండు చేతులతో ఒకేసారి తీసేసుకుని మింగేసారు. అందరినీ ఆశ్చర్యపర్చేవిధంగా, అతని కడుపు నిండిపోయి తర్వాత ఇంకేమీ అడగలేదు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే గణేషుడే కాదు పరమశివుడు కూడా ఏం తినకపోయినా ఆకలి వేయట్లేదని చెప్పారు.

ఈ కొత్తరకం వంటకం అద్భుతాలనే చేసింది. ఈ వంటకం ఏమిటా అని ఆశ్చర్యపోతూ పార్వతీదేవి అనసూయను ఎలా తయారుచేస్తారని అడిగారు. అప్పుడే అందరికీ తెలిసింది అవి ఉండ్రాళ్ళని, ఇవి గణపతికి చాలా ఇష్టమైన తీపి వంటకమని. అందుకనే వినాయకుడి ప్రతిపూజలో ఉండ్రాళ్ళు సమర్పిస్తారు.

Why Lord Ganesha Likes Modaka

పార్వతీదేవి ప్రత్యేక ఉండ్రాళ్ళను తయారుచేసారు.

ఒకసారి పార్వతీదేవి కూడా ప్రత్యేక ఉండ్రాళ్ళను ఇద్దరు సోదరులు అయిన గణేషుడు,కార్తికేయుడికి తయారుచేసారు. ఆమె వారిద్దరికీ అది దైవసంభూతమైన ఉండ్రాయి అని,అందులో అమృతం ఉందని చెప్పారు. అది ఎవరైనా తింటే అన్ని కళలూ,సాహిత్యంలో నైపుణ్యం సాధిస్తారు. ఈ ఉండ్రాయి తినటం వలన ఆరోగ్యలాభాలు,మంచి రుచి కూడా దక్కుతుంది. ఇద్దరు సోదరులకి అది తినాలనిపించింది.

కానీ పార్వతీదేవి అంత సులభంగా వారికి ఉండ్రాయిని ఇవ్వలేదు. ఎలా అయినా అది దైవ సంభూతమైన ఉండ్రాయి కదా మరి. ఆమె వారిద్దరికీ ఒక పోటీ పెడతానని చెప్పారు. అందులో వారిద్దరూ ప్రపంచం మొత్తం తిరిగిరావాలి. ఎవరైతే ముందుగా తిరిగివస్తారో వారికి ఉండ్రాయిలో పెద్ద భాగం దక్కుతుంది. ఇద్దరు అబ్బాయిలు పోటీకి తయారయ్యారు. ఆట మొదలవ్వగానే, కార్తికేయుడు తన వాహనం నెమలిపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి వెళ్ళిపోయాడు. కానీ గణేషుడికి అలాంటి వాహనం ఏమీ లేదు.

Why Lord Ganesha Likes Modaka

అతను వెంటనే, తండ్రి దగ్గరకి వెళ్ళి తనకో వాహనం కావాలని కోరాడు. అప్పుడే పోటీ సమానంగా ఉంటుంది. పరమశివుడు అతని కోరిక మన్నించి వాహనంగా ఎలుకను ఇచ్చాడు. కానీ ఎలుకపై కూర్చుని ప్రపంచం మొత్తం గణపతి ఎలా తిరగగలడు? అప్పుడే అతనికి అర్థమైంది,పిల్లల ప్రపంచం వారి తల్లిదండ్రులలో మాత్రమే ఉంటుంది. అందుకని వారిద్దరికీ వారే తన ప్రపంచం కావటం వలన వారికే ప్రదక్షిణం చేస్తానని చెప్పాడు.

English summary

Why Lord Ganesha Likes Modaka

When Rishi Attri and his wife Anusuya invited Lord Shiva and his family for dinner, they offered a sweet dish that was so filling and delicious that even one piece satisfied the hunger of Lord Ganesha. Though Ganesha had eaten it, the effect was that Lord Shiva's hunger too was satisfied. This magical sweet dish was named Modaka.
Story first published: Friday, May 11, 2018, 12:09 [IST]
Desktop Bottom Promotion