For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోలీ 2020 : శివుడు కాముడిని ఎందుకు కాల్చివేశాడో తెలుసా...

|

మన దేశంలో ఎన్ని పండుగలున్నా హోలీ పండుగకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఎందుకంటే ఈ పండుగ రోజున చిన్నపిల్లాడి నుండి పండు ముసలి వరకు ఆనందంగా వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటారు. దీని వల్ల ప్రజల మధ్య సఖ్యత, సమైక్యత పెంపొందుతుందని మన పూర్వీకులు భావించావేరు.

Why lord shiva burnt kamadeva into ashes

సాధారణంగా దసరా, ఉగాది, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల విషయానికొస్తే అందరూ ఎవరి కుటుంబాల పరిధిలో వారు మాత్రమే జరుపుకుంటూ ఉంటారు. అయితే రంగు రంగుల పండుగ అయిన హోలీని మాత్రం వీటన్నింటికీ పూర్తి భిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగను ఎవ్వరూ కూడా ఇళ్లలో జరుపుకోరు.

Why lord shiva burnt kamadeva into ashes

ఈ రంగుల హోలీని వీధుల్లో జరుపుకోవడం.. ఆటపాటలతో సందడి చేస్తూ ఉండటాన్ని మనం చూస్తే ఉంటాం. వసంత పంచమి నుండి పౌర్ణమి వరకు ఈ వసంతోత్సవాలు జరుగుతాయి. ఈ హోలీ వేడుకల్లో మహిళలు చప్పట్లతోనూ.. పురుషులు కోలాటాలతోను.. సందడి చేస్తారు. చతుర్దశి రోజు రాత్రి ఓ కూడలిలో 'కామదహనం' చేస్తారు. ఇక ఆ మరుసటి రోజున ఉదయం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలను జరుపుకుంటారు. అయితే కాముడి దహనం ఎందుకు చేస్తారు. దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పడు తెలుసుకుందాం...

పురాణాల్లోని ఓ కథ..

పురాణాల్లోని ఓ కథ..

కాముని పున్నమి పండుగ వెనుక ఒక పురాణ సంబంధమైన కథ ప్రాచుర్యాన్ని సంతరించుకుందట. దక్ష యజ్ఞ వాటిక సమీపంలో సతీ దేవి తన దేహాన్ని ఆహుతి చేసుకోవడంతో, ఆ బాధను దిగమింగుకోవడం కోసం శివుడు నిరంతరం తపోదీక్షలో నిమగ్నమై పోతాడు. సతీదేవిగా తనువు చాలించిన అమ్మవారు, హిమవంతుని కూతురు పార్వతీ దేవిగా జన్మిస్తుంది. గత జన్మ సంబంధాల వల్ల ఆమె నిత్యం పరమేశ్వరుడిని పూజిస్తుంటుంది.

లోక కళ్యాణార్థం..

లోక కళ్యాణార్థం..

లోక కళ్యాణం కోసం పార్వతీ, పరమేశ్వరులకు కళ్యాణం జరిపించడం అవసరమని దేవతలు భావిస్తారు. ఆ బాధ్యతను మన్మధుడికి అప్పగిస్తారు. పార్వతీ పట్ల శివుడికి ఆసక్తి కలగడం కోసం ముక్కంటి పైనే పూల బాణాన్ని సంధిస్తాడు మన్మధుడు. అంతే ఓ క్షణం కామ వికారానికి లోనైన శంకరుడు, అందుకు కారకుడైన మన్మధుడిపై మూడో కన్ను తెరవడంతో అతను భస్మమైపోతాడు.

కన్నీళ్లతో భోళాశంకరుడిని..

కన్నీళ్లతో భోళాశంకరుడిని..

ఈ విషయం తెలుసుకున్న మన్మథుడి భార్య రతీదేవి తన భర్తను మళ్లీ బతికించాలని కోరుతుంది. శివుడి కరుణ కోసం కన్నీళ్లతో తన బాధను వెళ్లగక్కుతుంది.

పార్వతీదేవి కూడా..

పార్వతీదేవి కూడా..

అప్పుడు పార్వతీ దేవి కూడా పరమేశ్వరుడికి నచ్చజెప్పడంతో మన్మథుడు అశరీరుడై సజీవంగా ఉంటునట్లు ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సంఘటన ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున జరుగుతుంది. ఈ సందర్భంగా ‘కాముని పున్నమి‘ని జరుపుకోవడం అనాయితీగా వస్తోంది. ఇక అదే రోజున ‘హోలిక‘ అనే రాక్షసి అంతమైన కారణంగా, ‘హోలీ‘ అనే పేరుతో ఈ పండుగ ప్రసిద్ధి చెందింది.

మరో కథలో...

మరో కథలో...

అప్పట్లో హిరణ్యకశిపుడు అనే ఒక నిరంకుశరాజు భూమిని పరిపాలించాడట. తన పరిపాలనలో ఏ వ్యక్తి అయినా దేవుడిని ఆరాధించకూడదని, తననే పూజించాలని ప్రజలను ఆదేశించాడట.

తండ్రి ఆదేశాలకు భిన్నంగా..

తండ్రి ఆదేశాలకు భిన్నంగా..

కానీ అతని కుమారుడు మాత్రం ప్రహ్లాద భగవంతుని యొక్క గొప్ప భక్తుడు. తండ్రి ఆదేశాలకు భిన్నంగా దేవుడిపై భక్తి చూపించేవాడు. అందువల్ల హిరణ్యకశిపుడు తన కుమారుడిని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రహ్లాద్ ను తన సోదరి హోలిక ఒడిలో ఉంచి, వారిద్దరినీ అగ్నికి అప్పగించాడు. హోలిక అప్పటికే దేవుడి నుండి ఓ వరం ఉంటుంది. ఆమె ఎప్పటికీ మండించబడదు. అయితే హోలిక దుర్వినియోగానికి పాల్పడితే అది పని చేయదు. ఆ హోలిక ఒకసారి చెడుకు మద్దతు ఇవ్వడం ద్వారా హోలిక దహనం జరుగుతుంది. అప్పుడు సద్గుణమైన ప్రహ్లాదుడు తప్పించుకున్నాడు.

చెడుపై మంచి విజయానికి..

చెడుపై మంచి విజయానికి..

హోలీ పండుగ వేడుకలను జరుపుకునే ముందు ఒకరోజు అగ్నిని కాల్చి పూజలు చేస్తారు. ఈ అగ్ని చెడుపై మంచి విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

మరో ప్రాముఖ్యత..

మరో ప్రాముఖ్యత..

హోలీ పండుగలో మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ సమయంలో కాల్చిన తృణధాన్యాలు లేదా ధాన్యాన్ని సంస్కృతంలో హోల్కా అని అంటారు. హోలీ లేదా హోలిక అనే పదం హోలకా నుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ ధాన్యాలతో హవన్ జరుగుతుంది, అప్పుడు ప్రజలు ఈ అగ్ని యొక్క బూడిదను వారి నుదిటిపై పూస్తారు. తద్వారా చెడు నీడ వారికి రాదు. ఈ బూడిదను భూమి హరి అని కూడా అంటారు.

English summary

Why lord shiva burnt kamadeva into ashes

Here we talking about why lord shiva burnt kamadeva into ashes. Read on
Story first published: Tuesday, March 10, 2020, 15:27 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more