Just In
- 30 min ago
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- 46 min ago
40 ప్లస్‌లో కూడా ఆ విషయంలో హ్యాపిగా ఉండాలంటే ఈ చిట్కాలను అనుసరించండి..
- 3 hrs ago
సెక్సియెస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో యంగ్ రెబల్ హీరో ప్ర‘భాస్‘ స్థానం ‘పది‘లం..
- 4 hrs ago
కడుపు ఎడమ వైపు నొప్పికి గల కారణాలు ఏమిటి?ఈ నొప్పి ప్రమాదకరమా?
Don't Miss
- News
పెళ్లిలో టిక్‌టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్‌లో కాల్పులు
- Sports
క్రీడా అకాడమీని ఏర్పాటు చేసిన జ్వాల గుత్తా!!
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Movies
బాలీవుడ్‌లోకి విజయ్.. లాంచ్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్.. కరణ్‌తో చర్చలు సఫలం
- Finance
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, కారణమిదే
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
కార్తీక మాసంలో శివుడిని ఎందుకు పూజిస్తారో తెలుసా..
మన దేశంలో హిందువులకు ప్రతి నెలలో ఏదో పండుగ వస్తూనే ఉంటుంది. కానీ కార్తీక మాసంలో వచ్చేది మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ మాసంలో అన్ని రోజులూ పర్వదినాలే. హిందువులు అందరూ అత్యంత పవిత్రంగా భావించే ఈనెలలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతుంది.
కార్తీక మాసంలో శివుడి ఆరాధన చాలా ముఖ్యమైనది. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఏదైనా ఉందంటే అది కార్తీక మాసమే అని పురాణాల్లో పేర్కొనబడింది. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ మరుసటి రోజు నుంచి ఈ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో భక్తులంతా భోళాశంకరుడిని స్మరిస్తూ ఉంటారు. దీంతో కార్మిక మాసం అంతా ఆధ్యాత్మికత కనిపిస్తుంది.

కార్తీకానికి సమానంగా ఏ మాసం లేదు..!
పురాణాలను ఒకసారి పరిశీలిస్తే అత్రి మహర్షి ఆగస్త్యుడికి కార్తీక మాసానికి మించిన మాసం మరొకటి లేదని చెప్పాడట. నెలరోజుల పాటు కార్తీక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. పురాణాలలో తొలిసారిగా వశిష్ట మహర్షి జనక మహారాజులకు కార్తీక మాస వైభవాన్ని వివరించిన తీరు కనిపిస్తుంది. జన్మ జన్మల పాపాలను హరించి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన కార్తీక మాసంలో నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన దీప దానం, సాలగ్రామ పూజ, ఈశ్వరుని పూ, వన భోజన కార్యక్రమాలను ఎక్కువగా జరుపుతారు.

కోరికలు నెరవేరుస్తాడు..
కార్తీక మాసంలో భక్తులు అందరూ మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారుజామునే తలస్నానం చేసి శివుని ఆలయానికి వెళ్లి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించాలి. అప్పుడే ఆ భోళాశంకరుడిని కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా శివాలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు. మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో శివారాధన చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తాడు.

కార్తీక దీపానికి చాలా విశిష్టత..
ఈ కార్తీక మాసంలో దీపం చాలా ప్రత్యేకమైనది. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ నెలలోని అన్ని రోజులలో మన ఇంటి ముంగిట సాయంకాలం సమయం దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శివాలయం ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలలో పేర్కొనబడింది.

ఉసిరికాయ వత్తులతో..
కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. సోమవారం, కార్తీకమాసం రెండూ శివునికి ప్రీతికరమైనవే. కాబట్టి కార్తీక సోమవారాలలో సాయంకాలం సమయంలో శివాలయంలో ఉసిరికాయపై వత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నెయ్యి, అవిశనూనె, ఆముదం వంటి వాటితో దీపాలను వెలిగించాలి.

పౌర్ణమి రోజున దీప దానం..
కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఎందుకంటే కార్తీక మాసంలోని 30 రోజులలో దీపం పెట్టలేని వారు కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా దీపం పెట్టాలి. అలా ఆ రోజు దీపం పెడితే చాలా మంచిది. అంతేకాదు ఈ కార్తీక మాసంలో దీపం దానం చేయడం వల్ల మరింత మంచి జరుగుతుంది.

ఉసిరి చెట్టు కింద వన భోజనం..
కార్తీక మాసంలో వన భోజనాన్ని కార్తీక సోమవారం లేదా కార్తీక మాసంలోని ఏదో ఒక రోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షింతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పూజారులను సత్కరించి అందరూ కలిసిమెలసి భోజనం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల కూడా శివానుగ్రహం కలిగి సర్వపాపాలు నశిస్తాయని నమ్మకం. వన భోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుండి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

తులసి పూజ..
కార్తీక పౌర్ణమి రోజున తులసి పూజ కూడా చేయాలి. ఆవు నెయ్యితో తడిపిన దారపు వత్తులతో దీపాలు వెలిగించాలి. తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత 365 వత్తులతో కూడిన హారతి ఇవ్వాలి. నక్షత్రాలు మాయం కాకముందే ఈ పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుందని పురాణాలలో పేర్కొనబడింది

విష్ణు ఆలయంలోనూ దీపారాధన..
కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లాలి. శివుని దర్శనం చేసుకోవాలి. అలాగే విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఈ మాసమంతా కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం.