Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
శివ పురాణం: శివుడు పులిచర్మంను ఎందుకు ధరించాడు? ఇంట్రెస్టింగ్ స్టోరీ..
పరమశివుడు పులి చర్మాన్ని ధరించి, పులి చర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యాన మగ్ధుడై కూర్చుని ఉంటాడు. ఆయన పులిచర్మాన్నే ఎందుకు ధరించడాడు? పులి చర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహం కలగక మానదు.
శివ అనగా శివుడు సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. శివుడు అనార్య దేవుడు. కానీ తరువాత వైదిక మతంలో లయకారునిగా స్థానం పొందాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొనబడినాడు.

పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉన్నది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.
పరమ శివుడు పులిచర్మాన్ని ఎందుకు ధరించాడు ?
పరమశివుడు పులి చర్మాన్ని ధరించి, పులి చర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యాన మగ్ధుడై కూర్చుని ఉంటాడు. ఆయన పులిచర్మాన్నే ఎందుకు ధరించాడు? పులి చర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహం కలగక మానదు. అందుకు శివపురాణంలో ఒక కథ చెప్పబడింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పరమ శివుడు సర్వసంగ పరిత్యాగి.
పరమ శివుడు సర్వసంగ పరిత్యాగి. స్వామి దిగంబరుడై అరణ్యాలలో శ్మశానాలలో తిరుగాడుతూ ఉండే వాడు.

ఒక రోజు ఆయన సంచరిస్తూ ఉండగా
ఒక రోజు ఆయన సంచరిస్తూ ఉండగా మునికాంతలు, (మునులు, మహర్షుల భార్యలు)పరమేశ్వరుని సౌందర్యానికీ, ఆయన తేజస్సుకీ కళ్ళు తిప్పుకోలేకపోయారు.

వారిలో ఆయనను చూడాలన్న కాంక్ష పెరగసాగింది
వారిలో ఆయనను చూడాలన్న కాంక్ష పెరగసాగింది. ఆయననే తలుచుకుంటూ గృహకృత్యాలను కూడా సరిగా చేసేవారు కారు.

తమ భార్యలలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేమిటని
తమ భార్యలలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేమిటని వెతికిన మునులకు పరమేశ్వరుని చూడగానే సమాధానం దొరికింది.

సంహరించడానికి పథకం వేసారు.
వారు ఆ దిగంబరుడు సదాశివుడని మరచి ఆయనను సంహరించడానికి పథకం వేసారు.

ప్రతి రోజూ స్వామి నడిచే దారిలో
ప్రతి రోజూ స్వామి నడిచే దారిలో ఒక గుంతను తవ్వారు. స్వామి ఆ గుంత సమీపానికి రాగనే అందులో నుంచి వారి తపశ్శక్తితో ఒక పులిని సృష్టించి శివుని మీదికి ఉసిగొల్పారు.

పులిని సంహరించడాడు
రుద్రుని ఎదుట నిలవగలిగిన పరాక్రమం ఈ ప్రపంచంలో ఉంటుందా? మహాదేవుడు సునాయాసంగా ఆ పులిని సంహరించడాడు. మనుల చర్య వెనుక వారి ఉద్దేశ్యం అర్థం చేసుకుని ఆ పులితోలుని కప్పుకున్నాడు.

పవర్ ఫుల్ దేవుడని తేరుకుని,
అది చూసిన మునులు, రోజూ వారి ఆశ్రమానికి వస్తున్నది సాధారణ వ్యక్తి కాదని, పవర్ ఫుల్ దేవుడని తేరుకుని, శివుడి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటారు. అప్పటి నుండి శివుడు ఆ పులిచర్మంను ధరించడం జరిగిందని శివపురాణంలోని కథ.

, పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక,
అంతే కాదు, పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక, సంహారకారి, భయానకమైనది. అటువంటి పులి కూడా లయకారుడైన పరమేశుని ఎదుట నిలవలేదని , కాల స్వరూపుని ఎదుట నిలబడ గలది ఏదీ లేదని చెప్పడమే ఇందులోని ఉద్దేశ్యం.

సర్వోత్కష్టమైన కాల స్వరూపుడని చెప్పడమే..
స్వామి పులిచర్మంపై కూర్చున్నా, పులి చర్మాన్ని ధరించినా అందుకు కారణం ఆయన సర్వోత్కష్టమైన కాల స్వరూపుడని చెప్పడమే..



Click it and Unblock the Notifications











