Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
మారీచుడు బంగారు లేడీలా ఎందుకు మారుతాడు, సీతను రావణుడు ఎత్తుకెళ్లేందుకు ఎందుకు సాయం చేశాడు
అయితే ఆ సమయంలో రావణుడితో మారీచుడి చాలా మంచి మాటలు చెబుతాడు. అయినా రావణుడు వినడు. తాను చెప్పినట్లే చేయమని ఆదేశిస్తాడు. ఒకవేళ రావణుడు చెప్పినట్లు వినకపోతే అతని చేతిలో చనిపోవాల్సి వస్తుంది.
మారీచుడు అనే పాత్రకు పురాణాల్లో చాలా ప్రాముఖ్యం ఉంది. మారీచుడుకి రామ బాణం తగలగానే అల్లాడిపోతాడు. మొట్టమొదటి సారి బాధను అనుభవిస్తాడు.
ఇక ర అనే శబ్దం వింటే గజగజవణికిపోయే పరిస్థితికి వస్తాడు. అయితే రావణుడు నమ్మిన మనిషిగా ఉంటాడు కాబట్టి ఆయన మాట విని లోక కల్యాణం మళ్లీ కొన్ని తప్పులు చేస్తాడు మారీచుడు.

క్రూరమైన రాక్షసుడు
మారీచుడు కర్కశుడు తాటక సునంతుల కుమారుడు. అతి క్రూరమైన రాక్షసుడు. యగాలు జరగకుండా మునులను ముప్పు తిప్పలు పెట్టేవాడు. అంత క్రూరంగా ప్రవర్తించే మారీచుడిలోనూ రామబాణం వల్ల చాలా మార్పు వస్తుంది.

ఎదురించే వాడు ఎవరూలేరని
మారీచుడు తనని ఎదురించే వాడు ఎవరూలేరని విర్రవీగుతూ ఉంటాడు. అయితే రాముడు విశ్వామిత్రుడి యాగానికి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూస్తూ ఉంటాడు. కానీ మారీచుడు మాత్రం యాగానికి ఆటంకాలు కలిగేలా చేస్తుంటాడు.

మారీచుడిపైకి సంధిస్తాడు
మారీచుని ఆగడాలు ఎక్కువయ్యేసరికి రాముడు తన బాణాన్ని మారీచుడిపైకి సంధిస్తాడు. దీంతో మారీచుడు పడిపోతాడు. అప్పుడు మారీచుడు అనుకుంటాడు. తనని ఎదురించే వాడు ఎవడూ లేడనుకుని ఇన్నాళ్లు విర్రవీగాను.

మంచివాడిగా మారుతాడు
కానీ నాకంటే గొప్పవాళ్లు చాలా మందే ఉన్నారని తెలుసుకుంటాడు. రామ బాణానికి గాయపడ్డ మారీచుడు తర్వాత చాలా మంచివాడిగా మారుతాడు. కొన్నాళ్లు తపస్సులో కూర్చొంటాడు. అయితే అదే సమయంలో రావణుడు మారీచుడి దగ్గరకు వచ్చి ఒక పని చెయ్యమని ఆదేశిస్తాడు.

బంగారు లేడిలాగా
చెప్పండి ప్రభూ.. మీరు ఏది చెప్పినా నేను చేస్తాను. నేను నీ బానిసను అంటాడు. ఏం లేదు నువ్వు బంగారు లేడిలాగా మారి సీతను మాయ చేయాలని ఆదేశిస్తాడు. ఆ పని చేయడం మారీచుడికి ఇష్టం లేకున్నా లోకకల్యాణం కోసం ఒప్పుకుంటాడు.

చాలా మంచి మాటలు చెబుతాడు
అయితే ఆ సమయంలో రావణుడితో మారీచుడి చాలా మంచి మాటలు చెబుతాడు. అయినా రావణుడు వినడు. తాను చెప్పినట్లే చేయమని ఆదేశిస్తాడు. ఒకవేళ రావణుడు చెప్పినట్లు వినకపోతే అతని చేతిలో చనిపోవాల్సి వస్తుంది.

చెడ్డవాడి చేతిలో చనిపోయే బదులు
అలాంటి చెడ్డవాడి చేతిలో చనిపోయే బదులు రాముడిలాంటి మంచివాడిలో గాయపడడమే మేలు అనుకుంటాడు మారీచుడు అందుకే బంగారు లేడీలా మారుతాడు.

ఆశ్రమం నుంచి బయటకి వచ్చేలా
అలా మారి సీతమ్మను మాయ చేస్తాడు. తర్వాత రామలక్ష్మణులిద్దరూ ఆశ్రమం నుంచి బయటకి వచ్చేలా చేస్తాడు. తర్వాత రావణాసురుడు భిక్షగాడి రూపంలో వచ్చి సీతమ్మను ఎత్తుకెళ్తాడు.

రాముడి చేతిలో చనిపోయేందుకు
అయితే తాను చనిపోతానని తెలిసి కూడా మారీచుడు బంగారు జింకగా మారడానికి కారణం లోకకల్యాణం కోసమే. సీతను రావణుడు ఎత్తుకెళ్లేందుకు అలా సాయం చేసి తర్వాత రావణుడు రాముడి చేతిలో చనిపోయేందుకు కారణం అయ్యాడు మారీచుడు.

మారీచుడు అంతకు ముందు జన్మలో
మారీచుడు అంతకు ముందు జన్మలో జితుడిగా పుట్టి ఉంటాడు. కుంభకర్ణుడి మాదిరిగానే ఇతనికి కూడా ఆకలి చాలా ఎక్కువ. అయితే ఒకసారి ఆకలితో జితుడు అగస్త్యుడిని తినాలనుకుంటాడు. దీంతో ఆ మహర్షి జితుడిని శపిస్తాడు.

ప్రత్యేక స్థానం
అలా జితుడు మారీచుడు అనే రాక్షసుడిగా జన్మించి చివరకు లక్ష్మణుడి చేతిలో మరణించి మళ్లీ శాపవిమోచన పొందుతాడు. ఇలా పురణాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పచుకున్నాడు మారీచుడు.



Click it and Unblock the Notifications