Just In
Don't Miss
- Movies
Bigg Boss 6 Telugu: హౌస్ లోకి రాబోయే ఫైనల్ లిస్ట్.. బజ్ లో నాన్ స్టాప్ యాంకర్!
- News
సోనియాగాంధీని కలిసిన తర్వాత ''టీక్ హై.. .ముజే కహనా హోగా.. అంటారు??
- Finance
Damani Vs Ambani: పోరులోకి దమానీ, అంబానీ.. ఆ రంగంపై పట్టుకోసం ప్రయత్నాలు..
- Technology
8 యూట్యూబ్ ఛానెల్లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం!! కారణం ఏమిటో...
- Travel
పచ్చని కునూర్లో.. పసందైన ప్రయాణం చేద్దామా?!
- Automobiles
చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్లో విడుదలకు సిద్ధమైనట్లేనా?
- Sports
IND vs ZIM: రాహుల్ త్రిపాఠిది టూరిస్ట్ వీసానా?.. రుతురాజ్ లేడు మ్యాచ్ చూడమ్! ఫ్యాన్స్ ఫైర్!
నాగులచవితి రోజున పాములపుట్టలో పాలు ఎందుకు పోస్తారు...
మన తెలుగు పురాణాలలో నాగుల చవితి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కార్తీక మాసంలో దీపావళి పండుగ ముగిసిన నాలుగు రోజుల తర్వాత శుద్ధ చతుర్దశి రోజున నాగులచవితి పండుగ వస్తుంది. ఈ సమయంలో మన దేశంలోని చాలా దేవాలయాల్లో నాగేంద్రులకు భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.
ఈ నాగులచవితి రోజున చాలా మంది మహిళలు 'నాగుపాము'ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. అలాగే చాలా మంది పాములపుట్టలో పాలు పోసేందుకు వెళ్లటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇలా పుట్టలో పాలు ఎందుకు పోస్తారు.. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం...
కార్తీక
మాసం
2020
:
ఈ
మాసంలో
పవిత్రమైన
పర్వదినాలేవో
చూడండి...

యోగాశాస్త్రం ప్రకారం..
మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను ‘వెనుబాము' అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధారచక్రంలో ‘పాము' ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది.

కోరికలు తీరుతాయని..
ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘సత్యగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకే నాగులచవితి రోజున ప్రత్యక్షంగా సర్పాలు నివసించే పుట్టలో పాలు పోస్తే కోరిన కోరికలు తీరుతాయని చాలా మంది నమ్ముతారు.

చవితిరోజున..
నాగులచవితి రోజున పాములను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వసిస్తారు.

దోషాలు తొలగుతాయని..
కుజదోషానికి, కాలసర్పదోషానికి అధిపతి సుబ్రహ్మణ్యస్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజలు చేసి, పాలు నైవేద్యంగా ఇస్తే వైవాహిక దాంపత్య సమస్యలు, గర్భదోషాలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం.

తెలుగురాష్ట్రాల్లో..
ఈ నాగుల చవితి పండుగను మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోమాదిరిగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో నాగులచవితి పండుగను తెల్లవారుజాము నుండే జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు కార్తీక శుద్ధ చతుర్దినాడు ఈ పండుగను జరుపుకుంటే, మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు ఈ పండుగను జరుపుకుంటారు.

భూసారాన్ని కాపాడే ప్రాణులు..
ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కూడా కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి ‘నీటిని' ప్రసాదించే దేవతలుగా భావిస్తారు. అంతేకాదు ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ, పరోక్షంగా అన్నదాతలకు నష్టం కలగకుండా చేస్తాయట! ఇలా మనకు ఇవి ఎంతగానో సహాయపడుతుంటాయి.

ఇళ్లల్లో కూడా..
మీరు నివసించే ప్రాంతంలో పాముల పుట్ట లేకపోతే, మీ ఇంట్లోనే బియ్యంపిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోస్తకంగా సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా సిరి సంపదలు పెరిగి, ఆరోగ్యవంతులుగా ఉంటారని పండితులు చెబుతున్నారు.