Just In
- 1 hr ago
Today Rasi Phalalu: మిథున రాశి వ్యాపారస్తులు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి..లేదంటే మోసపోతారు..
- 12 hrs ago
ధూమపానం మీ ఊపిరితిత్తులకే కాదు మీ శరీరంలో ఇతర అవయవాలకు కూడా ప్రమాదకరమని మీకు తెలుసా?
- 13 hrs ago
ఈ వ్యాయామాలతో ఆడవాళ్లను పిచ్చెక్కించే శక్తి మీ సొంతమవుతుంది
- 14 hrs ago
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
Don't Miss
- News
మూడోసారి.. స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్.. స్టేబుల్గానే
- Sports
జింబాబ్వేతో వన్డే సిరీస్.. ప్రపంచ క్రికెట్కు మంచిదన్న శిఖర్ ధావన్..! కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై స్పందిస్తూ..
- Movies
Karthika Deepam కార్తీక్ కోసం మార్చురీకి వెళ్లిన దీపం.. అసలేం జరిగిందంటే?
- Finance
DigiYatra: సులభతరంగా విమాన ప్రయాణం.. అందుబాటులోకి నయా టెక్నాలజీ.. హైదరాబాద్..
- Technology
Sony నుంచి సరికొత్త ఫీచర్లతో Mini LED TV విడుదల! ధర ఎంతంటే!
- Automobiles
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ M.A.D.E ప్రారంభం!
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజున బంగారమే కొనాలా? ఇతర వస్తువులను కొనొచ్చా?
మనలో ప్రతి ఒక్కరికీ అక్షయ తృతీయ అంటే టక్కున గుర్తొచ్చేది బంగారం, వెండి వంటి వాటితో పాటు విలువైన వస్తువులను కొనడం, వారి వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎంతో కొంత బంగారం కొనాలని ఆరాటపడుతుంటారు.
హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడే అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో మే 03వ తేదీ అంటే మంగళవారం నాడు ఈ పండుగ వచ్చింది.
అయితే అక్షయ తృతీయ రోజునే కచ్చితంగా బంగారం ఎందుకు కొనాలి.. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి.. అక్షయ తృతీయను ఎందుకని పవిత్రమైన రోజుగా భావిస్తారు..
ఈరోజున బంగారం కొనడంతో పాటు మరికొన్ని పనులు చేయాలట.. అందుకు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
Akshaya
Trititya
2022:
అక్షయ
తృతీయ
రోజున
ఈ
మంత్రాలు
పఠిస్తే..
లక్ష్మీదేవి
కటాక్షం
గ్యారంటీ...!

అక్షయ అంటే..
అక్షయ అంటే క్షయం కానిది(తరగనిది). అంటే ఈ పవిత్రమైన రోజున మనం ఏదైనా పని చేస్తే, ఆ పని కచ్చితంగా అక్షయమవుతుందని చాలా మంది నమ్మకం. ఈరోజు ఏ పూజ చేసినా.. ఏ దానమైనా.. ఏ పుణ్య కార్యం చేసినా దాని ఫలితం అక్షయం అవుతుందని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం..
పురాణాల ప్రకారం, తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయకు చాలా విశేషముంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేపట్టి.. ఏ పుణ్య కార్యం చేసినా దాని ఫలితం అక్షయంగానే ఉంటుందని పండితులు చెబుతారు. ఈ తిథి రోజున అక్షయుడైన విష్ణుమూర్తిని పూజిస్తారు. అందుకే ఈరోజును అక్షయ తృతీయ అని పిలుస్తారు.
Akshaya
Tritiya
2022:అక్షయ
తృతీయ
రోజు
పొరపాటున
కూడా
ఆ
పనులు
చేయకండి...!

ఏ శుభకార్యమైనా..
అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యం చేపట్టినా వారం, వర్జ్యం, రాహుకాలం వంటి వాటితో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చు. ఈరోజు గోమాతను పూజించడం కూడా చాలా విశేషం. పురాణాల ప్రకారం, సకల దేవతలందరూ గోమాతలో ఉంటారు. అలాగే అక్షయ తృతీయ రోజున గోమాతకు అరటిపండు ఇవ్వడం మంచిది. ఈరోజు బంగారం కొనడమే కాదు. అన్నదానం చేయడం వల్ల దేవతలకు భోజనం పెట్టిన ఫలితం దక్కుతుందని నమ్మకం.

లక్ష్మీదేవి ఉండిపోతుందని..
ఇక అసలు విషయానికొస్తే.. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి మనతోనే ఉండిపోతుంది అని చాలా మంది నమ్ముతారు. అయితే వాస్తవం ఏంటంటే.. ఈరోజున పేదలకు ఏదైనా దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈరోజున బంగారం కొనాలని శాస్త్రాల్లో ఎక్కడా లేదు.

ఏమి దానం చేయాలంటే..
‘వాస్తవానికి అక్షయ తృతీయ వేసవి కాలంలో వస్తుంది కాబట్టి.. ఈ పవిత్రమైన రోజున ఏదైనా మామిడి పండు, ఒక విసనకర్ర వంటివి దానం చేస్తే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో ఉన్నట్టు పండితులు చెబుతున్నారు.
హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడే అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో మే 03వ తేదీ అంటే మంగళవారం నాడు ఈ పండుగ వచ్చింది.