For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్ష్మణుడి భార్య ఊర్మిళ 14 సంవత్సరాలు భర్తతో ముద్దూ ముచ్చట లేకుండా ఎందుకు నిద్రపోయింది?

వన వాసం అయిపోయాక లక్ష్మణుడు నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు లేచింది ఊర్మిళ. తర్వాత తన భర్తను కూడా కొద్దిసేపు కనుక్కోలేకపోయింది. లక్ష్మణుడి భార్య ఊర్మిళ 14 సంవత్సరాలు ఎందుకు నిద్రపోయింది.

|

రాముడి భార్య సీతమ్మ గురించి అందరికీ తెలుసు. ఆమె పడ్డ కష్టాలు ఆమె జీవితం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రాముడు తమ్ముడు లక్ష్మణుడు భార్య అయిన ఊర్మిళ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఊర్మిళ స్వయానా సీతమ్మ తల్లి చిన్నాన కుమార్తె.

లక్ష్మణుడి కోసం అలాగే త్యాగాలు చేసింది

లక్ష్మణుడి కోసం అలాగే త్యాగాలు చేసింది

సీతమ్మ రాముడి కోసం ఎలా త్యాగాలు చేసిందో ఊర్మిళ కూడా లక్ష్మణుడి కోసం అలాగే త్యాగాలు చేసింది. సీతమ్మవారు రాముడి వెంట వనవాసం వెళ్లారు. వారి వెంట లక్ష్మణుడు కూడా వెళ్లాడు. తాను కూడా వస్తానని

భర్తను అడిగింది ఊర్మిళ. నువ్వేమీ మాతో పాటు రావొద్దు అక్కడి కష్టాలు నువ్వు తట్టుకోలేవు అంటాడు ఊర్మిళతో లక్ష్మణుడు.

నా నిద్ర మొత్తం నువ్వు తీసుకో

నా నిద్ర మొత్తం నువ్వు తీసుకో

అయితే లక్ష్మణుడు ఊర్మిళా.. నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలని కోరుతాడు. చెప్పండి.. మీరు ఏమి అడిగితే అది చెయ్యడానికి నేను సిద్ధం అని చెబుతుంది ఊర్మిళ. ఏమీ లేదు నా నిద్ర మొత్తం నువ్వు తీసుకో... నీ మెలకువను నాకు ఇవ్వు అంటాడు. సరే అండి.. అలాగే అంటూ లక్ష్మణుడి నిద్ర మొత్తం ఆమెనే తీసుకుంది.

14 సంవత్సరాలు నిద్రలోనే

14 సంవత్సరాలు నిద్రలోనే

అలా ఆమె 14 సంవత్సరాలు నిద్రలోనే ఉండిపోయింది. లక్ష్మణుడు 14 సంవత్సారాల పాటు వనవాసంలో ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. అన్నావదినలను కంటికిరెప్పలా చూసుకుంటూ ఉండిపోయాడు. ఊర్మిళ జీవితం ఏ ముద్దూ ముచ్చటా లేకుండా అలా నిద్రలోనే గడిచిపోయింది. అన్నేళ్లు కనీసం ఆహారం కూడా తీసుకోలేదు.

ఇంద్ర జిత్తుడిని చంపాలంటే

ఇంద్ర జిత్తుడిని చంపాలంటే

వన వాసం అయిపోయాక లక్ష్మణుడు నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు లేచింది ఊర్మిళ. తర్వాత తన భర్తను కూడా కొద్దిసేపు కనుక్కోలేకపోయింది. అంత గాఢనిద్రలో ఆమె ఉంది. అయితే 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు నిద్రపోకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఇంద్ర జిత్తుడిని చంపాలంటే 14 సంవత్సరాల పాటు నిద్ర ఉండకూడదు. ఆహారం ముట్టకూడదు. ఈ విషయం ముందే తెలుసుకున్న లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఏమీ తినకుండా ఉన్నాడు. అందువల్లే యుద్ధంలో ఇంద్రజిత్తుడిని చంపగలిగాడు.

నీలాంటి తమ్ముడు ఒక్కడుంటే

నీలాంటి తమ్ముడు ఒక్కడుంటే

ఈ విషయం తన అన్న శ్రీరాముడికి కూడా తెలియకుండా గడిపాడు లక్ష్మణుడు. తనకిచ్చే అన్నాన్ని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడు లక్ష్మణుడు. చివరకు ఈ విషయం తెలిసిన రాముడు తనపై తమ్ముడు చూపిన ప్రేమకు ఆనందపడ్డాడు. నీలాంటి తమ్ముడు ఒక్కడుంటే చాలు ఈ విశ్వాన్నే జయించొచ్చు అనుకున్నాడు.

English summary

Why Urmila Slept Continuously For 14 Years

Why Urmila Slept Continuously For 14 Years
Story first published:Friday, August 17, 2018, 11:04 [IST]
Desktop Bottom Promotion