For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆషాఢంలో వివాహాలు ఎందుకు చేసుకోకూడదు? ఆషాఢంలో భార్యాభర్తలు ఎందుకు వేర్వేరుగా ఉండాలి?

ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్దపెద్ద శుభకార్యాలకు ఇది మంచిది కాబట్టి ఆలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి.

|

ఆషాఢం అంటే అందరూ అశుభం అని అనుకుంటారు. ఆషాఢం శుభకార్యాలకు అనువైనదికాదని, శూన్య మాసం అని అంటారు. కానీ వివాహం అయిన కొత్త పెళ్లి కూతురుని పుట్టింటికి తీసుకొచ్చేది ఇదే మాసమే. తొలి ఏకాదశి వచ్చేది ఇదే ఆషాడంలోనే. జగన్నాథ రథ యాత్ర జరిగిదే ఆషాఢంలోనే. గురుపౌర్ణమి ఆషాఢంలోనే వస్తుంంది. మరి ఎందుకు దీన్ని శూన్యమాసం అంటారు.

పెళ్లిని మూడు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ

పెళ్లిని మూడు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ

పెళ్లిని ఎన్ని నెలలు వాయిదా వేస్తారు కానీ ఆషాఢంలో మాత్రంవ వివా: చెయ్య‌రు. అలాగే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన కోడలు, అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకమూ ఉంది. దీనికి కొన్ని కారణాలున్నాయి.

అత్తగారింట్లో ఉండకూడదు

అత్తగారింట్లో ఉండకూడదు

ఆషాఢమాసం వస్తే కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే పుట్టింటికి పంపుతారు. కొత్తగా వివాహమైన భార్యాభర్తలు ఆషాఢంలో విడివిడిగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. ఆషాఢంలో భార్యాభర్తల కలిస్తే గర్భం వస్తుంది. ఆ సమ‌యంలో గర్భం వస్తే వేసవిలో కాన్పు ఉంటుంది.

వేసవిలో బిడ్డకు జన్మనివ్వడంతో

వేసవిలో బిడ్డకు జన్మనివ్వడంతో

అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడంతో ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆషాఢంలో భార్యను దూరంగా పెడతారు. అందుకే ఒక సంప్రదాయం పేరు చెప్పి భార్యాభర్తలను వేరుగా ఉంచుతారు. ఆషాఢంలో భార్యాభర్తలిద్దరూ పూజలతో గడపమంటారు.

గోరింట ఆకు

గోరింట ఆకు

ఇక ఆషాఢంలో గుర్తుకు వచ్చేది గోరింట ఆకు. ఆషాఢంలో గోరింటాకు కొత్తా చిగురిస్తుంది. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువు. దాన్ని చేతులక పెట్టుకుంటే కొత్త ఉత్తేజం వస్తుంది. ఇది మూఢ నమ్మకం కాదు. ఇవన్నీ మంచి చేసేవే.

కొన్ని కారణాలున్నాయి

కొన్ని కారణాలున్నాయి

ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్దపెద్ద శుభకార్యాలకు ఇది మంచిది కాబట్టి ఆలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి.

పండితులంతా పూజల్లో ఉంటారు. దీంతో వాళ్లు పెళ్లి తంతు చేయడానికి టైమ్ ఉండదు కదా. దీంతో ఆషాఢంలో పెళ్లిళ్లు చేయరు.

ఆషాఢంలో దేవుళ్లు నిద్రలోకి వెళ్తారట

ఆషాఢంలో దేవుళ్లు నిద్రలోకి వెళ్తారట

అలాగే ఆషాఢంలో దేవుళ్లు నిద్రలోకి వెళ్తారట. దీంతో వివాహం చేసుకుంటే వారి ఆశీస్సులు అందవట. దక్షిణ భారతంలో ఆషాఢంలో ఏ పంట చేతికిరాదు. మ్యారేజ్ చేయడానికి పైసలుండవు. దీని వల్ల కూడా ఆషాడంలో వివాహాలు జరగవు. ఆషాడంలో గాలి వానలు ఎక్కువ. దీంతో వివాహాలకు ఆటంకాలు వస్తాయి. అందుకే ఆషాఢంలో వివాహాలు నిర్వహించరు.

ఎక్కువగా నీటితో తడపాల్సిన అవసరం లేదు

ఎక్కువగా నీటితో తడపాల్సిన అవసరం లేదు

ఆషాఢం ఇళ్లు కట్టుకోవడానికి అనువైనది. ఎందుకంటే ఇళ్ల నిర్మాణం అప్పుడు దాన్ని ఎక్కువగా నీటితో తడపాల్సిన అవసరం లేదు. ఆషాఢంలో నదీస్నానాలు మంచివి. పితృతర్పణాలు మంచివి. ఇంట్లో పెద్దలంతా తీర్థయాత్రలకు వెళ్తే పెళ్లి వేడుక ఎలా మరి.

అనారోగ్యం దెబ్బతింటుంది

అనారోగ్యం దెబ్బతింటుంది

ఆరోగ్యంపరంగా ఆషాఢం అనుకూలం కాదు. జలుబు, జ్వరంలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో భార్యాభర్తలకు శోభనం అయితే ఆ ప్రభావం పిండంపై పడుతుంది. అనారోగ్యం దెబ్బతింటుంది.

ఆషాఢంలో అందుకే పెళ్లిళ్లు వద్దంటారు. మాఘమాసం, చైత్రమాసంలో అందుకే పెళ్లిళ్లు చేసుకోమంటారు. మాఘమాసంలో అయితే ఆదాయం బాగుంటుంది. వాతావరణం బాగుంటుంది. చైత్ర మాసంలో అయితే ఎండలు బాగుంటాయి. బంధువులందరూ వస్తారు.

English summary

why wife and husband are separated in ashada masam

why wife and husband are separated in ashada masam
Story first published:Friday, July 13, 2018, 12:07 [IST]
Desktop Bottom Promotion