For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆడవారు ఎడమ చేతి వేలికే ఉంగరాన్ని ఎందుకు ధరిస్తారో తెలుసా...

ఎడమ చేతిలోని ఉంగరపు వేలికి రింగ్ ధరించడం వెనుక పురాణాల నాటి నుండి అనేక సంప్రదాయాలు కొనసాగుతున్నాయట. ముఖ్యంగా ఎడమ చేతి ఉంగరపు వేలికి గుండె సిరకు సంబంధం ఉండేది.

|

మీరు సినిమాల్లో చూసినా.. సీరియల్స్ లో చూసినా.. అంతేందుకు మీరు ఎక్కడికైనా వెళ్లే ఎంగేజ్ మెంట్ లేదా మ్యారెజ్ వంటి చోట్ల చూసినా కూడా పెళ్లి కుమారుడు..

Wear Wedding Ring

పెళ్లి కూతురు ఉంగరాలను మార్చుకోవడాన్ని మీరు చూసే ఉంటారు. అయితే ఎంగేజ్ మెంట్ రింగ్ ను మాత్రం చాలా మంది ఎడమ చేతి ఉంగరపు వేలికే ధరిస్తుంటారు. దీని వెనుక గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

గుండెకు లింక్..

గుండెకు లింక్..

ఎడమ చేతిలోని ఉంగరపు వేలికి రింగ్ ధరించడం వెనుక పురాణాల నాటి నుండి అనేక సంప్రదాయాలు కొనసాగుతున్నాయట. ముఖ్యంగా ఎడమ చేతి ఉంగరపు వేలికి గుండె సిరకు సంబంధం ఉండేది ఆ ఒక్క వేలు అంట. ఈ విషయాన్ని చాలా మంది హిందువులు నమ్ముతారు.

శాశ్వతమైన ప్రేమ..

శాశ్వతమైన ప్రేమ..

ఈ ఉంగరపు వేలికి రింగ్ ను తమ భాగస్వామికి బహుమతిగా ఇచ్చినా లేదా వారికి తొడిగినా వారి జీవిత భాగస్వామితో ప్రేమ మరియు అనుబంధాన్ని ఈ ఉంగరపు వేలు సూచిస్తుందట. లాటిన్ నగరంలో ఎడమ ఉంగరపు వేలు యొక్క సిరను ‘వెనా అమోరిస్‘ అని పిలుస్తారు. దీని అర్థం ‘ప్రేమ సిర‘ అంట.

భావోద్వేగ సంబంధం..

భావోద్వేగ సంబంధం..

ఈ ఎడమ చేతిలోని ఉంగరపు వేలికి ఈ ఎంగేజ్ మంట్ రింగ్ ను తొడిగితే.. మహిళలు తన జీవిత భాగస్వామితో భావోద్వేగ బంధాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడుతుందని కూడా చాలా మంది నమ్ముతారు. ఇది జీవిత భాగస్వామి మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి అని చూపించేందుకు మరో మార్గంగా కూడా ఉపయోగపడుతుందట.

వెస్ట్రన్ కల్చర్..

వెస్ట్రన్ కల్చర్..

ఈ ఉంగరపు వేలు కల్చర్ మన దేశంలో పుట్టింది కాదు. ఇది విదేశాల నుండి వచ్చింది. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 4,800 సంవత్సరాల క్రితం ఈజిప్టులో వివాహ ఉంగరాలను మార్పిడి వ్యవస్థ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు..

ఈ ఎంగేజ్ మెంట్ రింగును వధువులు పెళ్లికి ముందు తీసేసి వాటిని తిరిగి వరుడికి ఇచ్చేస్తారట. తద్వారా పెళ్లి కుమారుడు ఆ ఉంగరాన్ని మళ్లీ ఎడమ ఉంగరపు వేలికి ధరిస్తాడట. ఇలా ఉంగరాన్ని ధరించడం వల్ల ఎంతో సుఖంగా అనిపిస్తుందట.

తొలి రోజుల్లో..

తొలి రోజుల్లో..

అయితే ఉంగరాన్ని తొలిరోజుల్లో మధ్య వేలుకు తొడిగే వారట. ఇది ఒక సంప్రదాయంగా ఉండేది. దీని వల్ల బొటన వేలు మరియు మొదటి వేళ్లను టచ్ చేసి, అప్పుడు మధ్య వేలుకు రింగ్ కు పెట్టాలని చెప్పేవారట. అలా చేస్తే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం పూర్తయినట్లు భావించేవారట.

కాలంతో పాటు మార్పు..

కాలంతో పాటు మార్పు..

అయితే కాలంలో వస్తున్న మార్పుల కారణంగా.. ఈ సంప్రదాయంలో కూడా మార్పులు వచ్చాయి. దీనిని మధ్య వేలు నుండి ఎడమ చేతికి ఉంగరపు వేలికి మార్చారని తెలుస్తోంది. దీనినే అందరూ ఫాలో అవుతున్నారు.

English summary

Why Women Wear Wedding Ring On The Left Hand

Have you seen those movies scenes where the hero puts engagement or wedding ring in his lady loves left ring finger? Well, then we are here with some of the reasons behind the same. Read this article to know more
Desktop Bottom Promotion