Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ఈ రోజుల్లో గోళ్లు, వెంట్రుకలు కత్తిరించుకుంటే ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తుంది..!
గోళ్లు కత్తిరించుకోవడానికి, వెంట్రుకలు కట్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక సమయం వుంటుంది. ఎప్పుడంటే అప్పుడు కత్తిరించవద్దు. వీటికి సంబంధించిన నియమాలు జ్యోతిష్యశాస్త్రంలో పురాణాల్లో చెప్పబడి వున్నారు. తమలపాకు చెట్టును ఇంటి ముందట పుంచుకుంటే అరిష్టమా, శుభమా లాంటి ప్రశ్నలు కొందరికి వున్నాయ్. వాటి గురించి పూర్తిగా ఇక్కడ మీకు అందిస్తున్నాం.
గోళ్లను ఎప్పుడు కత్తిరించుకోవాలో జ్యోతిష్య శాస్త్రంలో పక్కాగా చెపివున్నారు. ఆదివారం గోళ్లు కత్తిరించుకోవద్దు. ఒక వేల కత్తిరిస్తే ధననష్టం, ఆయుష్షు కూడా తగ్గుతుందని అంటున్నారు. ఆదివారం సూర్యదేవుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆరోజు మంసం తినవద్దు, నెత్తికి నూనె కూడా రాసుకోవద్దు.

సోమవారం గోళ్లు కత్తిరిస్తే శుభవార్తను వింటారు. వారు ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. మంగళవారం గోళ్లు కత్తిరిస్తే నష్టాలు, చిక్కులు ఎక్కువగా వస్తుంటాయ్. ఏ పనిప్రారంభించినా ఆ పని పూర్తికాకపోవడం, నష్టం జరుగుతుంది. బుధవారం గోళ్లు కత్తిరిస్తే ఆరోగ్య లాభం, మనశ్శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలు వుంటే కూడా తగ్గుముఖం పడతాయ్. గురువారం గోళ్లు కత్తిరిస్తే ధనలాభం, వంశాభివృద్ధి జరుగుతుంది. ఆకస్మికంగా ఏదో ఒక రూపంలో ధనం మన దగ్గరికి వస్తుంది.
శుక్రవారం రోజు గోళ్లు కత్తిరిస్తే అరిష్టం కలుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు సంక్రిమస్తాయ్, లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పివున్నారు. ఆ రోజు కత్తిరిస్తే ఇంట్లో వున్నవారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు గోళ్లు కత్తిరించవద్దు.
శనివారం రోజు గోళ్లు కత్తిరిస్తే శనీదోషం తొలగిపోతుంది. ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ఈ మూడు రోజులూ ఎట్టి పరిస్థితిలో గోళ్లు కత్తిరించుకోవద్దు. ఈ విషయాన్ని పద్మ పురాణంలో కూడా చెప్పివున్నారు. పొద్దున 12 గంటల లోపు మాత్రమే గోళ్లను కత్తిరించాలి. గోళ్లను నోట్లో పెట్టి కొరకవద్దు, అలా కొరకడం దరిద్రమని పండితులు చెబుతున్నారు.

గోళ్లను కత్తిరించిన తరువాత వాటిని తొక్కవద్దు. అలా తొక్కితే శరీరంలో వున్న తేజస్సు శక్తి క్షీణించిపోతుందని శాస్త్రం చెబుతోంది. గోళ్లను కట్ చేసిన తరువాత ఇంటి ఆవరణలో వాటిని వేయవద్దు. ఒక పేపర్‌లో వాటిని పొట్లం కొట్టి దూరం ఎవ్వరూ చూడని ప్రదేశంలో వాటిని పారేయాలి. అది శత్రువుల చేతికి గనుక చిక్కితే చేతబడి లాంటివి చేసే అవకాశం వుంది.
అమావాస్య, పూర్ణిమ, ఏకాదశి రోజు లాంటి పండగరోజుల్లో రాత్రి వేలల్లో గోళ్లు పొరపాటున కూడా కత్తిరించకూడదని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పివున్నారు.
వెంట్రుకలు కూడా కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే కట్ చేయించుకోవాలి. ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజు కటింగ్, షేవింగ్ చేయించుకోకూడదని పెద్దలు చెప్పారు. పండగల రోజుల్లో షేవింగ్, కటింగ్ ఎట్టిపరిస్థితుల్లో చేయించుకోవద్దు. ఒకవేళ చేయించుకుంటే ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. బుధవారం, గురువారం, శనివారం రోజుల్లో మాత్రమే కటింగ్, షేవింగ్ చేయించుకోవాలి.
ఇంటి వద్ద తులసి మొక్కను పెంచుకోవచ్చా..?
పురాణాల్లో తులసి మొక్కలను ఎంత ప్రాధాన్యతను ఇచ్చారో, తమలపాకుకు కూడా అంతే ప్రాధాన్యతను ఇచ్చారు. విష్ణుమూర్తి పూజలో తులసిని తప్పకుండా వాడతాము. అందరి దేవతలకు పూజ చేసేటప్పుడు తమలపాకులు తప్పనిసరిగా వుండాలి. నైవేద్యం పెట్టిన తరువాత దేవతలకు తాంబూలం సమర్పిస్తాం. తాంబూలంలో తమలపాకు కచ్ఛితంగా వుండి తీరాలి. అమ్మవారికి తాంబూలము చాలా ప్రీతిపాత్రమైనది. పెళ్లికి ముందు తాంబూలాలు మార్చుకుంటారు. తాంబూళాలు మార్చుకుంటే సగం పెళ్లి అయిపోయినట్టే. తాంబూలాలకు విశేషమైన శక్తి వుంది. మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకు దండను సమర్పిస్తే గ్రహదోశాలు, శత్రువు, నరదృష్టి, నరపీడ, నరఘోష నశించిపోతుంది.
స్త్రీలు నెలసరి సమయాల్లో తమలపాకుకు నీళ్లుపోయకూడదు, తమలపాకు చెట్టును తాకకూడదు. ఎందకంటే తమలపాకు చెట్టులో గౌరీదేవీ కొలువై వుంటుంది.
గమనిక : పైన ఇవ్వబడిని సమాచారమంతా ప్రముఖ్య జ్యోతిష్యుల నుంచి పండితుల నుంచి సేకరించింది. వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.



Click it and Unblock the Notifications