Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఇల్లు బంగారం కావాలంటే ఇంటి ఇల్లాలి ఈ పనులు ఈ పనులు తప్పకుండా చేయాలి..!
ఇల్లు ఐశ్వర్యంగా లక్ష్మీదేవి నివాసంగా మారాలంటే ఇదంతా ఆ ఇంటి ఇల్లాలి చేతిలో వుంటుంది. ఇంట్లో ఇల్లాలు కొన్ని నియమాలను, పద్ధతులను పాటించడం వల్ల ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి వచ్చి సిరిసంపదలను పాటిస్తుంది. ఆ నియమాలను హిందూ శాస్త్రంలో పండితులు ఎప్పుడో చెప్పివున్నారు. ఇలాంటి నియమాలను పాటించి ఎందరో స్త్రీమూర్తులు తమ ఇంటిని ఐశ్వర్యంగా సంతోషకరంగా మార్చుకున్నారు. మరి ఆ నియమాలను మీ కోసం అందిస్తున్నాం. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అన్ని పెద్దలు అన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు కుటుంబం పైన ప్రభావం చూపుతుంది. ఒక ఇల్లు బాగుపడాలంటే ఆ ఇంటి ఇల్లాలు మూలకారణం.

ఉదయం నిద్రలేచిన వెంటనే స్త్రీలు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. పొద్దెకిన తరువాత శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రదేవ తాండవం చేస్తుంది. నిద్రలేచిన వెంటనే నుదుట బొట్టు వుండే విధంగా చూసుకోవాలి. మొఖం కడుక్కోకుండా ఇంట్లో వంటగదిలోకి, పూజ గదిలోకి ప్రవేశించకూడదు. రాత్రి సమయంలో స్త్రీలు గాజలు, కమ్మలు తీయరాదు.
స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ధరించవద్దు. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, మంచి పనులు చేయాలంటే శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుంచి పౌర్ణమికి మధ్యలోనే చేయాలి. బహుళపక్షంలో చేయవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ జుట్టు విరబూసుకొని వుండవద్దు. జ్యేష్టాదేవి జుట్టు విరబోసుకొని వుంటుంది, కాబట్టి ఇలా వుండకూడదు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వకూడదు, ఎడమ చేతితో మాత్రమే ఇవ్వాలి.

ఇంటి ఇల్లాలు రాత్రి అలిగి ఆహారం తినకుండా నిద్రపోకూడదు. జీతం వచ్చిన వెంటనే ముందుగా ఉప్పు కొనాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇంటి ఇల్లాలు నోటినుంచి ఎప్పుడూ పీడా, దరిద్రం, శని, పీనుగు , కష్టము లాంటి పదాలు వినిపించకూడదు. స్త్రీలు ఎప్పుడూ కోపంగా, చిరాకుగా వుంటే ఇంట్లో అసలు సంతోషం వుండదు. అందుకే చీటికీ మాటికీ చిరాకు పడకుండా సున్నితంగా మెలగాలి.
ఇంట్లో మగవాళ్లు మంగళవారం, హెయిర్ కటింగ్ చేసుకోకుండా చూసుకునే బాధ్యత ఇంటి ఇల్లాలుకు వుంటుంది. స్త్రీలు నలుపు రంగు వస్తువులను, నలుపు రంగా బట్టలను ఎప్పుడూ ధరించవద్దు. ఇంట్లో భోజనం చేసే ముందు ఒక ముద్ద కాకికి పెట్టాలి, కాకికి పెట్టే ముందు భోజనాన్ని కుక్కకు పెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఉప్పు, చింతపండు, మిరపకాయలు ఎవ్వరి చేతికి కూడా ఇవ్వకూడదు. కిందపెట్టి వారినే తీసుకోమని చెప్పాలి.
సూర్యాస్తమయం తరువాత ఇంటి ఇల్లాలు తల దువ్వడం చేయరాదు. ఇలా చేస్తే గనుక లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. కాలిపై కాలు వేసుకొని, కాళ్లు ఊపుతూ, ఒంటి కాలిపై నిలబడ్డం లాంటివి చేయవద్దు. ఇలాంటి చర్యలు దరిద్రాన్ని కలిగిస్తాయ్. రుతుదోషం వున్నప్పుడు స్త్రీలు తమతల్లో పువ్వులు ధరించవద్దు. ఎవరైనా మీకు పువ్వులు ఇచ్చినా వాటిని వద్దని చెప్పాలి. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగిన సమయంలో ఇంట్లోకి బంధువులు వస్తే వారికి ఎదురువెళ్లి వారిని ఆహ్వానించవద్దు. అలా చేయడం వల్ల కష్టాలను, బాధలను ఆహ్వానించినట్టవుతుంది.
ఇంటి ఇల్లాలు ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేసుకోవాలి. మధ్యాహ్నం తరువాత స్నానం చేస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు కష్టాలపాలవుతుంది. ఇంట్లో రోజుకు ఒక్కసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో దీపం వెలిగించిన తరువాత పాలు, నెయ్యి, పసుపు బయట ఎవ్వరికీ ఇవ్వవద్దు. ఇంటి బయట సాయంత్రంలోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు పెట్టకూడదు.
ఇంటి ఇల్లాలు పైన చెప్పిన విషయాలను పాటిస్తే ఇళ్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. ఇంట్లో దరిద్రం దరిచేరకుండా కష్టాలన్నీ తీరిపోతాయ్. కాబట్టి శాస్త్రం, పండితులు చెప్పిన విధంగా ఇంటి ఇల్లాలు పై పనులను కచ్ఛితంగా చేసి తీరాలి.



Click it and Unblock the Notifications











