Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆ ఊరి మహిళలు బట్టలేసుకోరు..నగ్నంగా గ్రామ దేవతకి పూజలు..ఎందుకో తెలుసా
భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. ఊరికో ఆచారం,సాంప్రదాయం ఉంటాయి మనదేశంలో. ప్రాంతాలు, స్థానికతను బట్టి కొన్ని ఏరియాల్లో ఉండే ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు చాలా ప్రత్యేకంగా ఉండటమే కాకుండా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి. కొన్ని ప్రదేశాల్లో ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాలు, పురాతన కాలంనాటి సంప్రదాయాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి.
అలా కంటిన్యూ అవుతూ మనకు ఆశ్చర్యాన్ని కలిగించే ఆచారం ఒకటి ఏంటంటే మనదేశంలోని ఓ గ్రామంలో ఏడాదిలో 5 రోజులు మహిళలు బట్టలు లేకుండా ఉంటారు. అయితే ఏ రాష్ట్రంలో ఈ ఆచారం ఉంది? ఎందుకు వాళ్లు ఇలా చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చూడండి.

భర్తతో కూడా దూరం
మనదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, మంచు పర్వతాలు, పచ్చని పొలాలు, అడ్వెంచర్లు, అందమైన టూరిస్ట్ ప్లేస్ లతో ఉండే హిమాచల్ ప్రదేశ్ ని జీవితంలో ఒక్కసారి అయినా సందర్శించాలని చాలామంది కోరుకుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ భూమ్మీద ఉన్న అత్యంత అందమైన ప్రదేశాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలోని మణికర్ణ వ్యాలీలో పిని అనే ఓ గ్రామం ఉంది. పిని గ్రామంలోని మహిళలు ఏడాదిలో 5 రోజులు బట్టలు వేసుకోరు. తమతో పాటు, గ్రామాన్ని కూడా క్షేమంగా చూడాలని స్థానిక దేవతను కోరుతూ మహిళలు తమ ఒంటిపై దుస్తులు తీసి గ్రామ దేవతను పూజిస్తారట. ఇలా చేస్తే తమను తాము శుద్ధి చేసుకున్నట్టు వారు భావిస్తారట. ఈ సంప్రదాయం శ్రావణ మాసంలో నిర్వహించబడుతుంది. ఈ 5 రోజులు ఇంటికి తాళం కూడా వేయరు. అంతేకాకుండా భార్యభర్తలిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు గానీ ఒకరికొకరు మాట్లాడుకోరు,ఇద్దరూ ఎవరికి వారే తెలియనట్టుగా ఉంటారు. వందల ఏళ్లుగా ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
దీని వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది
పిని గ్రామంలోకి పూర్వం ఓ రాక్షసుడు వచ్చి అందంగా రెడీ అయ్యే స్త్రీలను తీసుకెళ్లి తన కోరికలు తీర్చాలని చిత్రహింసలు పెట్టేవాడు. చివరికి లాహు ఘోండ్ దేవత రాక్షసుడిని చంపి స్త్రీలను రక్షించింది. అప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని అక్కడి గ్రామ ప్రజలు చెబుతుంటారు.



Click it and Unblock the Notifications