For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ రోజు ఏ దేవున్ని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుందో తెలుసా

వారంలో ఏడు రోజుల్లో ఒక్కొక్క దేవున్ని ఆరాధించడం వల్ల వారి ఆశీస్సులు పొందవచ్చు. ఆదివారం రోజు ఆదిత్యుడిని పూజిస్తే మంచి పుణ్యఫలం వస్తుంది. ఈ పూజ చేయడం వల్ల మీరు కంటికి సంబంధించిన రోగాలు, కుష్ఠు రోగం.

|

Which Day Is For Which God? || 7 God For 7 Days || Boldsky Telugu

ఒక్కో దేవుడికి ఒక్కో రోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజు ఆ దేవుళ్లను పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాలంటే ఐదు రకాల పూజా విధాలున్నాయి. మంత్రాలతో ప్రసన్నం చేసుకోవొచ్చు, హోమం ద్వారా చేసుకోవొచ్చు, తపస్సు చేసి చేసుకోవొచ్చు, దానాలు చేయడం ద్వారా చేసుకోవొచ్చు, అలాగే పూజల ద్వారా దేవుళ్లను ప్రసన్నం చేసుకోవొచ్చు.

ఆదివారం ఆదిత్యుడు

ఆదివారం ఆదిత్యుడు

వారంలో ఏడు రోజుల్లో ఒక్కొక్క దేవున్ని ఆరాధించడం వల్ల వారి ఆశీస్సులు పొందవచ్చు. ఆదివారం రోజు ఆదిత్యుడిని పూజిస్తే మంచి పుణ్యఫలం వస్తుంది. ఈ పూజ చేయడం వల్ల మీరు కంటికి సంబంధించిన రోగాలు, కుష్ఠు రోగంతో పాటు చాలా రోగాలను నయం చేసుకోవొచ్చు. అలాగే ఆ రోజు ఇతర దేవతల్ని కూడా పూజించాలి. వేద పండితుల ఆశీస్సులు తీసుకోవాలి. ముఖ్యంగా రోగాల నివారణకు ఇలాంటి పూజలు చేయాలి.

సోమవారం లక్ష్మిదేవి

సోమవారం లక్ష్మిదేవి

ఇక సోమవారం రోజు లక్ష్మీ దేవిని పూజిస్తే చాలా మంచిది. సంపద పెరగాలంటే ఈ విధంగా చేయాలి. అలాగే వేదపండితుల ఆశీస్సులు తీసుకోవాలి. వీలైతే వేద పండితులకు భోజనం పెడితే ఇంకా మంచిది.

మంగళవారం కాళీమాత

మంగళవారం కాళీమాత

మంగళవారం కాళీకామాదేవతను పూజించడం మంచిది. అన్ని రకాల ఇబ్బందులు తొలిగిపోయి సంతోషంగా ఉండగలుగుతారు.

ఆ రోజు కందిపప్పు, మినుముపప్పు, పెసరలతో తయారు చేసిన పదార్థాలను అమ్మవారికి నివేదిస్తే మంచి జరుగుతుంది.

బుధవారం విష్ణుమూర్తి

బుధవారం విష్ణుమూర్తి

ఇక బుధవారం విష్ణు మూర్తిని పూజించాలి. విష్ణువుకు పెరుగు అన్నం బాగా ఇష్టం. అందుకే ఆ రోజు ఆయనకు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా ప్రతి బుధవారం పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ కుటుంబమంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

గురువారం ఇష్టదైవం

గురువారం ఇష్టదైవం

గురువారం రోజు మీ ఇష్టదైవాన్ని పూజించుకోవడం మంచిది. మీకు ఎవరైతే ఇష్టదైవం ఉంటారో వారికి నెయ్యి, పాల పదార్థాలతో తయారు చేసిన ఆహారపదార్థాలను నివేదిస్తే మంచిది. దీని వల్ల మీరు సుఖశాంతులతో వర్ధిల్లుతారు.

శుక్రవారం ఇష్టదైవం

శుక్రవారం ఇష్టదైవం

శుక్రవారం రోజు కూడా మీరు మీ ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది. వేదపండితులకు భోజనం, మహిళలకు వస్త్రాలను దానం చేయడం వంటివి చేస్తే చాలా మంచిది.

శనివారం

శనివారం

శనివారం రోజు చేసే పూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ఆ రోజు రుద్రాది దేవతలను పూజిస్తే మంచిది. అకాల

మృత్యువు నుంచి బయటపడేందుకు శనివారం చేసే పూజ చాలా ఉపయోగకరం. శనివారం నువ్వులతో హోమం చేస్తే చాలా మంచిది.

ఇలా ఏడు రోజులు ఏ దేవుడికి పూజ చేసినా కూడా మిగితా దేవతలు కూడా ఎంతో సంతోషిస్తారు. వారి కరుణ మీపై ఉంటుంది. అలాగే శివుడు కూడా ఇలాంటి వారిని చల్లగా చూస్తాడు.

English summary

Worship Hindu Gods day wise rituals for Everyday of the week

Worship Hindu Gods day wise rituals for Everyday of the week
Story first published:Tuesday, August 28, 2018, 10:50 [IST]
Desktop Bottom Promotion