Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీరు ఏ నక్షత్రంలో పుట్టారో తెలుసుకుని ఆ చెట్టుకు పూజ చేస్తే అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి
గ్రహ-నక్షత్రాలు అనుకూలంగా లేకపోతే మనిషి జీవితం కష్టాలతో గడుస్తుంది. ఇలా ప్రతికూలమైన నక్షత్రాలను శాంతింప చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రత్నధారణ, పూజ, హవనం, యజ్ఞం వంటివి. నక్షత్రశాంతి.
హిందూ జ్యోతిషం ప్రకారం జన్మ నక్షత్రం ప్రభావం జీవితంపై ఉంటుంది. నక్షత్ర మండలం నేరుగా చంద్రుడితో సంబంధమై ఉంటుంది. కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్లి తన బిడ్డలవలె పెంచాడు.

నక్షత్రముల పేర్లు
ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడని అని పురాణ కథ.

నక్షత్రాలు అనుకూలంగా లేకపోతే
అయితే గ్రహ-నక్షత్రాలు అనుకూలంగా లేకపోతే మనిషి జీవితం కష్టాలతో గడుస్తుంది. ఇలా ప్రతికూలమైన నక్షత్రాలను శాంతింప చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రత్నధారణ, పూజ, హవనం, యజ్ఞం వంటివి. నక్షత్రశాంతికి మరొక ప్రత్యామ్నాయం ఉంది. వివిధ చెట్లను పూజించటంవల్ల నక్షత్ర-గ్రహశాంతి జరిగి వ్యక్తి జీవితంలోని సమస్యలు ఒకటొకటిగా తొలగిపోతాయి. మీరు నక్షత్రంలో పుట్టారో తెలుసుకుని ఆ చెట్టుకు పూజ చేస్తే అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి

భరణి నక్షత్రం- ఉసిరిక చెట్టు
అశ్విని నక్షత్ర వృక్షం కుచల. ఈ నక్షత్రంలో జన్మించినవారు కుచల చెట్టును నిత్యం పూజించాలి. చెట్టువేరుకు నీరుపోసి, అక్షతలు చల్లి, ప్రదక్షిణ చేయాలి. భరణి నక్షత్ర జాతకులు ఉసిరిక చెట్టుని నిత్యం జలంతో తడిపి ప్రదక్షిణ చేయాలి. పొరపాటున కూడా ఈ చెట్టు దగ్గర మూత్రవిసర్జన వంటివి చేయకూడదు. కృత్తిక నక్షత్ర జాతకులు మేడివృక్షాన్ని నిత్యం నీళ్ళు, అక్షతలతో ప్రదక్షిణ చేయాలి.

మృగశిర నక్షత్ర జాతకులు
రోహిణి నక్షత్రంలో జన్మించినవారు నేరేడు చెట్టు మొదట్లో చెక్కర, బియ్యం లేదా గోధుమపిండి వేసి ఒక గ్లాసు నీరుపోసి ప్రదక్షిణ చేయాలి. మృగశిర నక్షత్ర జాతకులు బుధవారంరోజు జలంతో రేగుచెట్టుని పూజించటం వల్ల సుఖ సమృద్ధి లభిస్తుంది. ఆర్ద్ర నక్షత్రంలో జన్మించినవారు కృష్ణకమలాన్ని పూజించటం లేదా దీంతో దేవతారాధన చేయటం వల్ల సుఖం కలుగుతుంది.

మర్రిచెట్టు
పునర్వసు నక్షత్ర జాతకులు తుమ్మచెట్టును ఆరాధించాలి. చెట్టు మొదట్లో నీరుపోసి పూజ చేయాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించినవారు రావిచెట్టుకు నీరుపోసి నిత్యం ప్రదక్షిణం చేయటం శుభకరం.ఆశ్లేష నక్షత్ర జాతకులు చంపా వృక్షానికి ప్రతిరోజూ నీరుపోసి పూజించాలి. మఖ నక్షత్రంలో జన్మించినవారుమర్రిచెట్టును పూజించినట్లయితే విశేష ఫలప్రదం లభిస్తుంది.. మర్రిచెట్టు సహజంగానే పూజనీయ వృక్షం. అందరూ పూజిస్తారు.

హస్త నక్షత్రం - మల్లెచెట్టు
పూర్వఫల్గుణి నక్షత్రంలో జన్మించినవారు అశోకవృక్షం ఆకులు ఇంటి ద్వారానికి కట్టుకోవటం, వృక్షాన్ని పూజించటం వల్ల సుఖం లభిస్తుంది. హస్త నక్షత్ర జాతకులు ఇంట్లో మల్లెచెట్టు నాటి పూజించటం మంచిది. దీనివల్ల వ్యాపారవృద్ధి చెందుతుంది.

వేప చెట్టు
జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినవారు వేపచెట్టుని రోజూ నీటితో మొదలు తడిపి సేవించాలి. ఆదివారం నువ్వులు, చెక్కెర మొదట్లో వేయాలి. పూర్వాషాడ, శ్రావణ ఈ రెండు నక్షత్రాల జాతకులు జిల్లేడుచెట్టును సేవించాలి. బుధవారం చేసే పూజ అధిక ఫలప్రదం. ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించినవారు కదంబ వృక్షానికి ప్రతిరోజూ నీళ్ళు పోయాలి.

కొబ్బరి చెట్టు
ధనిష్ఠ నక్షత్రంలో జన్మించినవారు కొబ్బరిచెట్టును పూజించటం శుభం. కానీ, ఇది అన్నిచోట్లా లభించదు. కాబట్టి వీలులేనివారు పూజాగృహంలో కొబ్బరికాయను ఉంచుకుని పూజించాలి. శతభిష నక్షత్రంలో జన్మించినవారు మామిడిచెట్టును పూజించటం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది.

కదంబ
పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినవారు కదంబ వృక్షాన్ని అక్షతలతో పూజించాలి.ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినవారు గోరింటచెట్టుని అక్షతలతో పూజించాలి. రేవతి నక్షత్రంలో జన్మించినవారు రేగుచెట్టుకి నీరుపోసి పూజించాలి. ఇలా ఆయా నక్ష్రత్రాల వారు ఇక్కడి సూచించిన ప్రకారం ఆయా చెట్లకు, మొక్కలకు పూజలు చేస్తే కచ్చితంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య ప్రముఖులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications