For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రావణ మాసంలో హనుమంతుని పూజిస్తే మీ ఇక్కట్లు పటాపంచలు అవుతాయి.

శ్రావణ మాసంలో హనుమంతుని పూజిస్తే మీ ఇక్కట్లు పటాపంచలు అవుతాయి.

|

హనుమంతుని శివుడి యొక్క అవతారంగా చెబుతారు. విష్ణు భగవానుడు మరియు శివునికి మధ్య చాలా బలమైన బంధం ఉందని అంటారు. విష్ణుమూర్తి రామావతారాన్ని దాల్చినప్పుడు, శివుడు కూడా హనుమంతునిగా అవతారించాడు. ఇరువురు కలసి భూమిపై రాజ్యమేలుతున్న అధర్మాన్ని మరియు అన్యాయాన్ని నాశనం చేసి, భూమిని రక్షించారు. ఇటువంటి శ్రద్ధాంజలి హనుమంతుడు, రాముని యొక్క ఆదేశాలను మనసా వాచా కర్మణా పాటించాడు. కనుకనే, అతను అమరత్వామనే వరం పొందాడు. హనుమంతుడు తన ఆశీర్వాదంతో భక్తులను కాపాడతాడు.

మనమంతా శ్రావణ మాసంలో శివుడికి ప్రార్థనలు చేస్తున్నప్పుడు, హనుమంతుడు కూడా తన భక్తుల మొరలను శ్రావణ మంగళవార పూజల్లో వింటాడు. అతని ఆరాధనతో నొప్పి, బాధ, చెడు దృష్టి ప్రభావాలు మరియు భూత పిశాచ భయం వంటి ప్రతికూల శక్తులు అన్ని తొలగిపోతాయి. ఆయన మనకు, జీవితాన్ని ధైర్యంగా మరియు నిర్భయంగా జీవించమని బోధించాడు.

Worshipping Hanuman In Shravana Can Also Remove Problems From Your Life

ఈ రోజు, మనం శ్రావణ మంగళవారం నాడు ఆచరించదగిన పరిహారాలేమిటో తెలుసుకుందాం. ఇవి హనుమంతుడినే కాక శివుడిని కూడా ప్రసన్నం చేస్తాయి.

పంచోపచార పూజ:

పంచోపచార పూజ:

మంగళవారం నాడు శివాలయాన్ని సందర్శించి, హనుమంతునికి పంచోపచార పూజను చేయండి. పంచోపచార పూజ అనేది ఐదు విధాలుగా లేదా ఐదు దశలలో జరుగుతుంది. ఈ పూజలో, దేవత విగ్రహానికి ముందుగా స్నానం చేయిస్తారు. హనుమంతుడు బ్రహ్మచారి అని, స్త్రీలు సాధారణంగా తన విగ్రహాన్ని తాకకూడదని అంటారు కనుక ఈ పనిని పూజారి మాత్రమే చేయాలి.

స్నానం తరువాత, విగ్రహం యొక్క అలంకరణ చేయాలి. తరువాత పువ్వులను సమర్పించాలి. దీని తరువాత, పరిసరాలలోని ప్రతికూల శక్తులను పారద్రోలిటానికి ధూపం వెలిగిస్తారు. అప్పుడు, దీపం వెలిగించి తర్వాత, హారతి పాట పాడాలి. చివరిగా భోగంగా పిలువబడే ప్రసాదాన్ని సమర్పించాలి

మర్రి ఆకును ఉపయోగించి చేసే పరిహారం:

మర్రి ఆకును ఉపయోగించి చేసే పరిహారం:

ఈ మాసంలో ఏ మంగళవారంనాడు, ఒక మర్రి ఆకును తీసుకోండి. దానిని చక్కగా నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు దీనిని హనుమంతుని విగ్రహం ముందు కొంత సమయం పాటు ఉంచండి. తరువాత, తిలకంగా ఉపయోగించే కుంకుమను ఉపయోగించి 'శ్రీరామ్' అని దాని మీద రాయాలి. ఈ ఆకుని మీ వాలెట్లో ఉంచుకోండి. మీరు ఇలా చేస్తే కనీసం మరుసటి రోజు వరకైనా, మీ వాలెట్ ఖాళీగా ఉండదు. మరుసటి సంవత్సరం, కొత్త ఆకుని ఉపయోగించి ఇదే పద్ధతిని పాటించండి. పాత ఆకును పారే నీటిలో కలపండి.

ఆలయంలో రామరక్షాస్తోత్రం పఠించండి:

ఆలయంలో రామరక్షాస్తోత్రం పఠించండి:

ఒక మంగళవారం నాడు హనుమంతుని దేవాలయానికి వెళ్లి, అక్కడ రామరక్షాస్తోత్రాన్ని పఠించండి. తరువాత, హనుమంతుడికి బెల్లం మరియు వేయించిన శనగలు సమర్పించండి. మీరు జీవితంలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటునట్లైతే, ప్రార్థన ద్వారా ఆయనకు తెలియజేయండి.

శివహనుమంతుల ఆశీర్వాదం పొందడం ఎలా?

శివహనుమంతుల ఆశీర్వాదం పొందడం ఎలా?

శివ చాలిసా మరియు హనుమాన్ చాలిసాలను జపించండి. శ్రావణంలో ఒక మంగళవారం, శివుడు మరియు హనుమంతుని విగ్రహాలు కలిగి ఉన్న దేవాలయాన్ని సందర్శించండి. దేవుని ముందు నెయ్యిదీపం వెలిగించండి. మీతో తీసుకువచ్చిన పూజాసామాగ్రిని భగవంతునికి సమర్పించండి. తరువాత కూర్చుని, ఆపై శివ చాలిసా మరియు హనుమాన్ చాలిసాలను జపించండి. ఇలా చేయడం వలన, శివుడు మరియు హనుమంతుడి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి.

English summary

Worshipping Hanuman In Shravana Can Also Remove Problems From Your Life

Lord Hanuman was the incarnation of Lord Shiva. This is the reason why he is also worshipped during Shravana. While Lord Shiva blesses with a happy life and a good life partner, his Hanuman form is worshipped to remove all kinds of negative energies such as evil eye and fear of ghosts. Easy remedies are there for this which can be adopted on a Tuesday.
Desktop Bottom Promotion