For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రావణ శుక్రవారాల్లో ఈ విధంగా పూజలు చేస్తే లక్ష్మి దేవి వచ్చి మీ తలుపు తడుతుంది

శ్రావణ శుక్రవారాలు మొత్తం అమ్మవారికి పూజలు చేయాలి. అలాగే శ్రావణంలో వచ్చే వర లక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక శ్రావణంలోని రెండో శుక్రవారం చాలా పవిత్రమైనది.

|

శ్రావణమాసం అంటే అందరికీ ఎంతో ఇష్టం. శుభాలకు కేరాఫ్ అడ్రస్ శ్రావణం. సో.. మొత్తానికి ఇప్పుడు మనం శ్రావణంలోకి వచ్చేశాం. ఏ ఆలయంలో చూసిన పూజలే. ఏ ఇంట్లో చూసినా శుభకార్యాలే. శ్రావణంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యం ఉందో శుక్రవారాలకు కూడా అంతే ఇంపార్టెంట్స్ ఉంది.

ఆడవారికి ఇష్టమైన హిందూ మాసాల్లో శ్రావణం ఒకటి. ఇక శ్రావణ శుక్రవారం వస్తే ఆ రోజు ఇంటిని మంగళకరంగా మార్చేస్తారు ఆడవారు. ఉదయానే లేచి తలంటు స్నానం చేసి శుచిగా ఉంటూ పూజలు ప్రారంభిస్తారు. వాస్తవానికి హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం అంటే ఎంతో పవిత్రమైనది.

లక్ష్మి దేవికి శుక్రవారం అంటే బాగా ఇష్టం

లక్ష్మి దేవికి శుక్రవారం అంటే బాగా ఇష్టం

శుక్రవారం శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక మహా లక్ష్మి దేవికి శుక్రవారం అంటే బాగా ఇష్టం. అంతేకాదు ఆ రోజు అమ్మవారిని నిష్టతో పూజిస్తే అంతా మంచే జరుగుతుందని మన ఆడవారి నమ్మకం. ఇక శ్రావణంలో లక్ష్మి దేవిని పూజిస్తే సిరి సంపదలు బాగా చేకూరుతాయని భక్తుల నమ్మకం.

అమ్మవారికి పూజలు చేయాలి

అమ్మవారికి పూజలు చేయాలి

అందుకే శ్రావణ శుక్రవారాలు మొత్తం అమ్మవారికి పూజలు చేయాలి. అలాగే శ్రావణంలో వచ్చే వర లక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచి జరుగుతుంది. శ్రావణ శుక్రవారాల్లో ఆడవారు ఉదయం, సాయంత్రం దీపా రాధన చేస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటారు. అలాగే ఐశ్వర్యాలు పెంపొందుతాయి.

తులసి పూజలు చేస్తే మంచిది

తులసి పూజలు చేస్తే మంచిది

ఇక శ్రావణంలోని రెండో శుక్రవారం చాలా పవిత్రమైనది. ఆ రోజు లక్ష్మి దేవిని నిష్టగా పూజిస్తే చాలా మంచిది. కచ్చితంగా ఆ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. శ్రావణ శుక్రవారాల్లో తులసి పూజలు చేస్తే మంచిది. అలాగే దేవాలయాల్లో పాలలో తేనె కలిపి అభిషేకం చేస్తే వారు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక ఈ మాసంలో శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే లేవాలి. తర్వాత తలంటు స్నానం చేయాలి. ఇళ్లు, పూజ చేసే గదులను శుభ్రం చేసుకోవాలి.

లక్ష్మి దేవి ఎక్కువగా కొలువై ఉంటుంది

లక్ష్మి దేవి ఎక్కువగా కొలువై ఉంటుంది

శ్రావణంలో కొన్ని ప్రాంతాల్లో లక్ష్మి దేవి ఎక్కువగా ఉంటుంది. గోవులు ఉండే ప్రాంతం, తామర పుష్పాల్లో, పాడి పంటలు ఉండే ప్రాంతం, తులసి మొక్కలుండే ప్రదేశాల్లో, మంగళకరమైన వస్తువులుండే ప్రాంతంలో, మంగళ వాయిద్యాలు మోగే ప్రాంతంలో, దీప కాంతులు విరజిల్లే ప్రాంతంలో, ఏనుగులు ఉండే ప్రాంతంలో, శంఖనాదాలు జరిగే ప్రాంతంలో, దేవతార్చనలు జరిగే ప్రాంతాల్లో, చెట్లు ఎక్కువగా ప్రాంతంలో, శుచి శుభ్రత పాటిస్తూ సౌమ్యంగా ఉండే ఆడవారు ఉండే ఇళ్లలో, వేదాలను ఉచ్చరించే ప్రాంతంలో లక్ష్మి దేవి ఎక్కువగా కొలువై ఉంటుంది.

అన్నీ శుభాలే కలుగుతాయి

అన్నీ శుభాలే కలుగుతాయి

అలాగే శ్రావణం మాసంలోని అన్ని శుక్ర వారాల్లో ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిదట. అలా అమ్మవారిని పూజించే ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయట. అలాగే అన్ని శుక్రవారాల్లో దేవాలయాల్లో అమ్మవారిని

దర్శించుకుని పూజలు చేస్తే ఇంకా మంచిదట. లక్ష్మి దేవికి మల్లె పూలతో పాటు జాజిపూలను, కస్తూరి పూలను సమర్పిస్తే మంచిది. ఇలా శ్రావణ శుక్రవారాలు మొత్తం నిష్టగా లక్ష్మి దేవిని పూజిస్తే మీకు అన్నీ శుభాలే కలుగుతాయి.

English summary

worshipping lakshmidevi in sravana masam can also remove problems from your life

worshipping lakshmidevi in sravana masam can also remove problems from your life
Desktop Bottom Promotion