For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yogini Ekadashi 2021: యోగిని ఏకాదశి రోజున ఉపవాసముంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...!

|

హిందూ మతం ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం వచ్చే ఏకాదశులన్నీ శ్రీ విష్ణమూర్తికకి అంకితం చేయబడ్డాయి. అయితే జ్యేష్ట మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున మాత్రం యోగిని ఏకాదశిగా పిలుస్తారు.

ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేస్తే.. ఆ వ్రత కథ గురించి తెలుసుకుంటే.. ఎంతో పుణ్యం లభిస్తుందట. ఈ సందర్భంగా యోగిని ఏకాదశి 2021లో ఏ రోజున వచ్చింది.. శుభ ముహుర్తాలు.. ఏ సమయంలో పూజ చేయాలి.. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆషాఢ మాసంలో శుభకార్యాలను ఎందుకు ఆపేస్తారో తెలుసా...

2021లో యోగిని ఏకాదశి పవిత్ర సమయం..

2021లో యోగిని ఏకాదశి పవిత్ర సమయం..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. 2021 సంవత్సరంలో జులై మాసంలోని మొదటి వారంలో అంటే 5వ తేదీన సోమవారం రోజున ఈ ఏకాదశి ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి 10:30 గంటల వరకు పవిత్ర సమయంగా పరిగణించబడుతుంది. ఈరోజన చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు.

యోగిని ఏకాదశి ప్రార్థనా సమయం..

యోగిని ఏకాదశి ప్రార్థనా సమయం..

2021లో జులై 5వ తేదీన యోగిని ఏకాదశి సందర్భంగా మీరు ఆ భగవంతుడిని ఉదయం 5:29 నుండి ఉదయం 8:16 గంటల మధ్యన ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

పూజా విధానం..

పూజా విధానం..

యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఉతికిన బట్టలను మాత్రమే వేసుకోవాలి. గంగాజలంతో మీ పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ యోగిని ఏకాదశి పూజను ప్రారంభించాలి. విష్ణు విగ్రహం లేదా చిత్ర పటం ఎదుట పసుపు రంగులో ఉండే పూలు, ఐదు రకాల పండ్లను మరియు తులసి ఆకులను ఉంచాలి. అనంతరం విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఇదే రోజున సాయంత్రం సమయంలో కూడా శ్రీమహా విష్ణువును పూజించాలి.

Ashada Masam 2021:ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా...

యోగిని ఏకాదశి ప్రాముఖ్యత..

యోగిని ఏకాదశి ప్రాముఖ్యత..

యోగిని ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈరోజున ఉపవాసం ఉంటే ఒక వ్యక్తి కుష్టు వ్యాధి నుండి విముక్తి పొందుతారని చాలా మంది నమ్మకం. అదే విధంగా ఎవరైనా తెలియకుండా చేసిన పొరపాట్ల నుండి కూడా పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ఈరోజున ఉపవాసం పూర్తి విశ్వాసంతో చేసే వారు 88 వేల మంది బ్రాహ్మాణులకు ఆహారం ఇవ్వడంతో సమానమని పండితులు చెబుతున్నారు.

వ్రత కథ..

వ్రత కథ..

పురాణా ప్రకారం, యోగిని ఏకాదశి వ్రత కథను శ్రీక్రిష్ణుడు చెప్పాడు. ఓ రాజ్యంలో కుబేరుడు అనే రాజు ఉండేవాడు. తను శివునికి వీరాభిమాని. ఆయన ప్రతిరోజూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసి శివుడిని స్మరించుకునేవాడు. పూలను సమర్పించేవాడు. తన కోసం తోటమాలి ప్రతిరోజూ వనం నుండి తప్పనిసరిగా పువ్వులు తెచ్చేవాడు. అతనికి అందమైన భార్య ఉంది. తనతో కలిసి అక్కడే నివాసం ఉండేవాడు.

పూలు తేవడం మరిచాడు..

పూలు తేవడం మరిచాడు..

ఒకరోజు తోటమాలి ఉదయాన్నే నిద్ర లేచి పువ్వులు తీసుకోవడానికి వెళ్లాడు. అయితే రాజు ఆలయానికి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, తన ఇంటి నుండి ఆలయానికి వెళ్లే మార్గంలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని భావించాడు. ఈ ఆలోచనతో ఇంటికి తిరిగి వెళ్లాడు. తన భార్యను చూస్తే.. ఆరోజు మరింత అందంగా కనిపించింది. దీంతో తనలో సంతోషం పెరిగింది. ఆమె ధ్యాసలో పడి పూజకు ఇవ్వాల్సిన పూలను మరచిపోయాడు.

ఆలస్యమవ్వడంతో..

ఆలస్యమవ్వడంతో..

ఎంతసేపైనా ఆ తోటమాలి పూలు తీసుకురాకపోవడంతో ఆ రాజు తనను వెతకమని భటులను ఆదేశించాడు. అయితే ఇంటి దగ్గరే తన భాగస్వామితో కామకేళి చేస్తున్నాడని, అందుకే పూలు తీసుకురాలేదని రాజుకు చెప్పారు. తన కోరికల వ్యామోహంలో పడి శివుడికి పూలు తీసుకురావడం మరిచిపోయినందుకు, తను వ్యాధుల బారిన పడతాడని ప్రకటించారు. అప్పటి నుండి ఆ తోటమాలికి ఎంతో బాధపడ్డాడు. తన సమస్యకు పరిష్కారం కోసం చాలా ప్రయత్నించాడు.

తోటమాలికి సలహా..

తోటమాలికి సలహా..

అలా ఓ రోజు శివుడికి పరమ విధేయుడు, గొప్ప భక్తుడైన మార్కండేయ ఆ తోటమాలికి మహా మ్రుత్యుంజయ మంత్రం గురించి తెలియజేస్తాడు. అలాగే జ్యేష్ఠ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసాలను పాటించాలని తోటమాలికి సలహా ఇస్తాడు. దీంతో తన పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. అప్పుడు ఆ తోటమాలి ఆ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటాడు. ఆ తర్వాత తను అనారోగ్యం నుండి కోలుకుంటాడు.

English summary

Yogini Ekadashi 2021: Date, Puja Vidhi, Vrta Katha, Significance and all you need to know in Telugu

Know about the 2021 Yogini Ekadashi date, time, shubh muhurat, importance and puja vidhi in Telugu.
Story first published: Monday, June 28, 2021, 16:31 [IST]
Desktop Bottom Promotion