Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీరు ధనవంతులు అయ్యే ముందు మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనపడుతాయి
మీరు డబ్బు ఎలా సంపాదిస్తారు? అనేది ముఖ్యం. ధనవంతులు కావాలనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ధనవంతులు కావడం అంత సులభం కాదు. మీకు ఒక్క విషయం తెలుసా, మీకు డబ్బు వచ్చినా, లేదా సంపద మీకు వచ్చినా మీ ఇంట్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.
వాస్తు చిట్కాల ప్రకారం మీరు త్వరలో ధనవంతులు అవుతున్నారు అని అర్థం. అంటే ముందుగానే మీ ఇంట్లో మీకు కొన్ని సూచనలు వస్తాయని అర్థం చేసుకోండి. అలాంటి సూచనలను ఇంట్లో చూడటం శ్రేయస్కరం. ఇది లక్ష్మీదేవి రాకను కూడా సూచిస్తుంది.

వాస్తు ప్రకారం మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమల గుంపు కనిపిస్తే, వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే అది మంచి సంకేతం. ముఖ్యంగా ఈ నల్ల చీమలు ఏదైనా చిరుతిండిలో కనిపిస్తే అది ఇంకా మీకు శుభసూచికమే.
వాస్తులో చెప్పినట్లుగా మీ ఇంట్లో నల్ల చీమల గుంపు హఠాత్తుగా కనిపిస్తే లక్ష్మీ దేవి మీ ఇంటికి వస్తున్నట్లు ముందుగానే మీకు సూచిస్తుంది. అంటే మీరు త్వరలో ధనవంతులు అవుతారు అని అర్థం. కాబట్టి మీ ఇంట్లోని నల్ల చీమలను తరిమికొట్టే ప్రయత్నం చేయకండి.
అంతే కాకుండా ఇంటి దగ్గర ఎక్కడైనా పక్షి గూడు నిర్మిస్తే అది వాస్తు ప్రకారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఏదైనా చిన్న పక్షి, పిచ్చుక, పావురం గూడు కట్టుకుంటే డబ్బు త్వరలో వస్తుందని సూచిస్తుంది. ఇంటి ముందు పిచుకలు గూడుకడితే ఇంటికళ పోతుందని చాలా మంది పోరపాటు పడుతుంటారు. కానీ అలాంటి సంకేతాలు కనపడితే త్వరలో మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుందని దాని అర్థం అని తెలుసుకోండి.
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే చెవుల్లో శంఖం ఊదుతున్న శబ్ధం వినబడటం కూడా మంచి శుభసూచకమే. అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తోందని దాని అర్థం. మీరు త్వరలో ధనవంతులు అవుతారని గుర్తుంచుకోండి. ఇలాంటి సంకేతాలు వచ్చిన తరువాత మీరు ఇంట్లో పూజలు చేస్తే మీకు ఇంకా మేలు జరుగుతుంది. అయితే ఇలాంటి సంకేతాలు వచ్చిన తరువాత మీరు ఇంటిలోని నల్ల చీమలను బయటకు విసిరేయడం, ఇంటి ముందు పక్షుల గూడులు తొలగించడం లాంటి పనులు పొరపాటున కూడా చెయ్యకండి ఎందుకంటే మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవిని మీరైమీరే బయటకు పంపించినట్లు అవుతుంది.



Click it and Unblock the Notifications