For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖం, ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తొలగించే ఫేస్ మాస్క్

ముఖం, ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తొలగించే ఫేస్ మాస్క్

|

సాధారణంగా స్త్రీ పురుషుల బ్యూటీ విషయంలో ముఖం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మని చూడగానే ముఖం చూసి గుర్తు పడుతుంటారు. అలాంటే ముఖంలో చిన్న మచ్చఏర్పడ్డా ఇట్టే పసిగట్టేస్తుంటారు ఎదుటివారు. ఎంత అందంగా ఉన్నా సరే, ఒక్కొక్కోసారి ముఖంలో బ్లాక్ హెడ్స్ తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ముఖ్యంగా జిడ్డు చర్మ తత్వం కలవారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలేకపోయినా, ఇవి చికాకును పెడుతుంటాయి. ఎంత అందమైన ముఖం ఉన్నా వీటి వల్ల కొంత ఇబ్బందిగానే ఉంటుంది.

ఇంతకీ బ్లాక్ట్ హెడ్స్ అంటే ఏమిటి? బ్లాక్ హెడ్స్ అంటే ఏమిటి?బ్లాక్ హెడ్స్ అతి చిన్నవిగా కనిపిస్తూ ముఖం మీద ఇబ్బంది కలిగించే సెబమ్ నుండి విడుదలయ్యేటటువంటి అతి చిన్న బ్లాక్డ్ ఫోలిసెల్స్. చర్మమీద ఏర్పడే సెబమ్ కాలుష్యం మరియు గాలిలోని ఆక్సిడేషన్ వల్ల అవి నల్లగా మారుతాయి. అవే బ్లాక్ హెడ్స్ గా రూపాంతరం చెందుతాయి. ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు మీద, ముక్కుకు ఇరువైపులా అతి సూక్మంగా మొటిమల రూపంలో ఏర్పడి నల్లగా మారుతాయి.

ఈ బ్లాక్ హెడ్స్ ను వల్ల మానసికంగా కొంచెం దిగులు చెందినా..పదేపదే అద్దంలో చూసుకుంటూ టెన్షన్ పడేకంటే, వాటిని తొలగించుకొనే మార్గం చూసుకోవడం ఉత్తమం. వీటి నివారణోపాయం ఏమిటంటే బ్యూటీషియన్ దగ్గరకు వెళ్ళి వాటిని తగిన విధంగా తీసి వేయించుకుంటూ ఉండటం. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ తీసివేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. బ్యూటీ పార్లర్ కు వెళ్ళే విషయంలో కొంత పరిశీలన అవసరం. అనుభవం ఉన్న బ్యూటీషియన్ దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి కొంచెం నైపుణ్యం అవసరం . పరిశుభ్రతను పాటించే బ్యూటీ పార్లర్ లను ఎంచుకోవాలి. అంతే కాదు కెమికల్ ఉత్పత్తులు ఎక్కువ రోజులు ప్రయోజనాలను ఇవ్వవు. కాబట్టి నేచురల్ పద్దతులను ఉపయోగించి బ్లాక్ హెడ్స్ తొలగించి ఎటువంటి మచ్చలు లేని క్లియర్ స్కిన్ పొందవచ్చు . అందుకు, మన వంటగదిలోనినేచురల్ వస్తువలు ఓట్స్, నిమ్మ, పెరుగు, తేనె, సీసాల్ట్, పంచదార, మరియు బేకింగ్ సోడా మరికొన్ని ఉపయోగపడుతాయి. మరి వీటిని ఉపయోగించే విధానం..తొలగించుకొనే మార్గం చూద్దాం..

ఓట్స్:

ఓట్స్:

ఓట్ మీల్ చర్మాన్ని శుభ్రపరుచుటల ఓట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఓట్స్ ను మిక్సీలో వేసి మిక్స్ చేసి ఆ పొడితో ముక్కు మీద రుద్దడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

పెరుగు:

పెరుగు:

ఈ డైరీ ప్రొడక్ట్ మరొక వంటగది వస్తువు. ఇది ప్రభావంతంగా పనిచేసి, మొటిమలను మాత్రమే కాదు, బ్లాక్ హెడ్స్ ను కూడా నివారిస్తుంది. కాబట్టి మీరు రెగ్యులర్ గా వేసుకొనే ఏదైనా ఫేస్ ప్యాక్ లోనైనా సరి పెరుగును మిక్స్ చేసి ముఖానికి పట్టించి ముఖానికి పట్టించాలి. అలాగే కొద్దిగా తేనె, పెరుగు, నిమ్మరసం, సాండిల్ వుడ్ పౌర్ అన్నింటిని మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకొంటే మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ నయం అవుతాయి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మకాయ నేచురల్ బ్లీచ్. ఇది క్లీనింగ్ వస్తువులా పనిచేస్తుంది. కాబట్టి మీరు నేచురల్ బ్లీచ్ కోసం నిమ్మకాయను ఉపయోగించవచ్చు . లేదా నిమ్మ తొక్కతో బ్లాక్ హెడ్స్ ఉన్న చోటో స్ర్కబ్ చేయడం వల్ల కూడా తొలగించుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ ఉన్నచోట నిమ్మరసంతో పాటు తేనె, పంచదార లేదా గుడ్డు వంటివి కూడా మిక్స్ చేసి స్ర్కబ్ చేయవచ్చు.

ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ పీల్:

తాజా ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి, పొడి చేసి, అందులో కొద్దిగా పాలు, తేనె మిక్స్ చేసి ముఖం, మెడ మీద స్ర్కబ్ చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది మరియు చర్మాన్ని నేచురల్ గా శుభ్రం చేస్తుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

ఈ వంటగది వస్తువును చర్మ మరియు కేశ సంరక్షణలో సాధారణంగా ఉపయోగిస్తుంటారు. బేకింగ్ సోడాను చేత్తో తీసుకొని ముక్క మీద అలా మసాజ్ చేయడం వల్ల కూడా బ్లాక్ మెడ్స్ తొలగిపోతాయి.

గుడ్డు:

గుడ్డు:

బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో గుడ్డు కూడా ఒక మంచి వస్తువు. గుడ్డులోని తెల్ల సొనకు తేనె లేదా నిమ్మరసం కలిపి ఈ ప్యాక్ ను బ్లాక్ హెడ్స్ ఉన్న చోటో అప్లై చేసి ఇరవైనిముషాల తర్వాత స్ర్కబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి:

బొప్పాయి:

ఇది బ్లాక్ హెడ్స్ తొలగించడంలో మరో ఎఫెక్టివ్ హోం రెమడీ. బాగా పండిన బొప్పాయిని చిదిమి,దానికి తేనె మరియు పాలు చేర్చాలి. ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేయాలి.

శెనగపిండి:

శెనగపిండి:

శెనగిపిండికి పాలు మరియు నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి . ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ బ్లాక్ హెడ్స్ ను నేచురల్ గా తొలగిస్తుంది.

జాజికాయ:

జాజికాయ:

సహజ పద్దతిలో బ్లాక్ హెడ్స్ తొలగించడానికి పాలలో జాజికాయ పొడిని మిక్స్ చేసి, బ్లాక్ హెడ్స్ ఉన్న చోట స్ర్కబ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత రెండు మూడు నిముషాలు సర్కులర్ గా రుద్దాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

తేనె:

తేనె:

బ్లాక్ హెడ్స్ మొదలుకుని ఇతర చర్మ సమస్యలకు నివారించడానికి చిక్కటి తేనెను ఉపయోగిస్తాం . తేనె యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నది. ఇది చర్మం రంద్రాలను శుభ్రం చేయడానికి బాగా సహాయపడుతుంది.

పసుపు:

పసుపు:

ఒక చెంచా ధనియాలు, కొద్దిగా పసుపు తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ కు కొన్ని పాలు లేదా తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముక్కుమీద అప్లై చేసి బాగా రుద్దాలి. దాంతో బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

అరటి:

అరటి:

బాగా పండిన అరటి పండు గుజ్జుతో మీ ముఖానికి మసాజ్ చేయడం కానీ లేదా అరటి పండు తొక్కతో బ్లాక్ హెడ్స్ ఉన్న చోటు స్ర్కబ్ చేయడం వల్ల కానీ బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

పంచదార:

పంచదార:

పంచదార గుళికలతో ముఖం మీద, బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రుద్దడం వల్ల చర్మ శుభ్రపడటంతో పాటు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

ఉప్పు:

ఉప్పు:

ఉప్పును నిమ్మరసంలో మిక్స్ చేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి పది నిముషాల తర్వాత సున్నితంగా రుద్ది, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టమోటో:

టమోటో:

టమోటోలో విటమిన్ ఎ మిరయు సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల సెరమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సీరం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల కూడా మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి, ఈ వంటింటి వస్తువు టమోటోతో ముఖాన్ని మసాజ్ చేయండి.

కలబంద:

కలబంద:

అలోవెరా ఇది వంటింటి వస్తువు కాదు. అయినప్పటికీ దీన్ని సాధారణంగా మన ఇల్లలో పెంచుకుంటుంటాం. కాబట్టి దీన్ని ఉపయోగించి మొటిమలను నయం చేసుకోవచ్చు. అలోవెరా జెల్ ల్లో యాంటీఇన్ల్ఫమేటర్ గుణాలు మెండుగా ఉండటం వల్ల మొటిమల నివారణకు బాగా సహాయపడుతుంది.

English summary

Face Masks To Remove Blackheads

Blackheads are most commonly seen on the nose, cheeks, forehead and chin simply because these areas have more oil producing glands. That is why, exfoliating the face is very important. Even cleaning is one of the skin care routine that should be followed regularly. Cleansing the face and exfoliating it will prevent the dirt and dead skin cells from clogging the pores.
Desktop Bottom Promotion