For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ లో గణేషఉత్సవం ఘనంగా జరుపుకొనే ప్రదేశాలు

|

భారతదేశంలో వినాయక చవితి అనేది చాలా ఉత్సాహముతోను మరియు వైభవముగా జరుపుకొనే ఒక పండుగ అని చెప్పవచ్చు. గణపతి పూజను ప్రధానంగా మహారాష్ట్ర,కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో చాలా బారీగా జరుపుతారు. ఈ మూడు రాష్ట్రాల్లో వినాయక చవితిని కేవలం ఒక రోజు సంబరంగా కాకుండా సుదీర్ఘంగా జరుపుతారు. ప్రత్యేకించి ముంబైలో గణపతి పూజను 10 రోజుల పాటు జరుపుతారు. పెద్ద వినాయకుడి విగ్రహాలను మొదటి రోజు స్థాపన చేసి 10 వ రోజున నిమజ్జనం చేస్తారు.

వాస్తవానికి చాలా పండుగలలో వినాయక చవితి పండుగ డబ్బుతో ముడిపడి ఉంటుంది. ధనిక వినాయక ఉత్సవాలలో విగ్రహాలు,పందిరి,అలంకరణ మరియు నిమజ్జనం కోసం ధారాళంగా డబ్బులు ఖర్చు పెడతారు. ధనిక గణేశ ఉత్సవాలలో కూడా ప్రముఖులకు మరియు పెద్ద బ్రాండ్లకు విశేష ఆదరణ ఉంది. వారు తగినంత నిధులతో వినాయక చవితిని గ్రాండ్ గా చేయటం చూసి ఆశ్చర్యపోనవసరం లేదు.

ఒక గణపతి పూజ కమిటీ ఖచ్చితమైన బడ్జెట్ ను ఎప్పుడూ బహిరంగంగా వెల్లడి చేయదు. అయితే గొప్పతనాన్ని చూసి సులభంగా భారతదేశంలో ధనిక వినాయక చవితి పండుగలో చేసే ఖర్చును అంచనా చేయవచ్చు. ఎటువంటి సందేహం లేకుండా మొదటిది ముంబై లోని ప్రసిద్ధ లల్బుఘ్చ రాజా అని చెప్పవచ్చు. ఈ వినాయక ఉత్సవంలో అతి ఎత్తైన మరియు ధనిక వినాయకుడు విగ్రహం ఉంటుంది. కానీ ఇతర సన్నిహిత పోటీదారులుగా చాలా విగ్రహలు ఉంటాయి.

భారతదేశంలో ధనిక వినాయక ఉత్సవాలు కొన్ని చూద్దాము.

లల్బుగ్చ రాజా

లల్బుగ్చ రాజా

లల్బుగ్చ రాజా గణేష్ ఉత్సవం సల్మాన్ ఖాన్,అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద బాలీవుడ్ ప్రముఖుల ప్రాపకం పొందుతుంది. ఇది భారతదేశంలో ఎత్తైన వినాయక విగ్రహాలలో ఒకటి అని చెప్పవచ్చు.

ముంబైచ రాజా

ముంబైచ రాజా

ముంబై అతి పురాతనమైన గణేష్ ఉత్సవంలో గణేష్ గాలీ జరుగుతుంది. ఈ వినాయకుని పండుగ 85 సంవత్సరాల నుండి జరుగుతుంది. అంతేకాక ప్రతి సంవత్సరం విగ్రహం 20 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది.

అవెన్యూ రోడ్, గణేష్ ఉత్సవం బెంగుళూర్

అవెన్యూ రోడ్, గణేష్ ఉత్సవం బెంగుళూర్

ఎటువంటి సంశయానికి ఆస్కారం లేకుండా బెంగుళూర్ అతిపెద్ద వినాయక పండగలలో ఒకటిగా ఉంది. బెంగుళూర్లో అవెన్యూ రోడ్ ప్రధాన ప్రదేశంలో అనేక మంది భక్తుల నుండి ఈ భారీ వినాయకుడు ఉత్సవం కోసం విరాళాలు సేకరిస్తారు.

గిర్గోంచ రాజా, గిర్గావ్ ముంబై

గిర్గోంచ రాజా, గిర్గావ్ ముంబై

ముంబై గిర్గావ్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఎత్తైన వినాయకుడు విగ్రహాలు తయారు చేసే బృందం ఉంటుంది. కానీ వినాయకుడు పండుగ హైలైట్ విగ్రహం మట్టి మరియు పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా తయారు చేస్తారు.

దగ్డుషేత్, పూనే

దగ్డుషేత్, పూనే

దగ్డుషేత్ హల్వాయీ గణపతి భారతదేశంలో చాలా భయపెట్టే వినాయకుడు పూజలలో ఒకటిగా ఉంది. పూనే లో ఉన్న ఈ చిన్న వినాయకుడు ఆలయంలో జరిగే 9 రోజుల పండుగ సమయంలో భారతదేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు.

భందర్కర్చ్ రాజా,మతుంగా ముంబై

భందర్కర్చ్ రాజా,మతుంగా ముంబై

మతుంగా కమ్యూనిటీ పూజ. ఇది ముంబైలో చాలా ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. వారు సేకరించిన అపరిమితమైన విరాళాల నుండి ప్రతి సంవత్సరం 20000 కంటే ఎక్కువ మందికి ఉచితంగా అన్నదానం చేస్తారు.

ఖేత్వదిచ గనరాజ్

ఖేత్వదిచ గనరాజ్

ఇది ముంబైలో అతిపెద్ద మరియు ధనిక వినాయకుడు పండగలలో ఒకటిగా ఉంది. 2000 సంవత్సరంలో 35 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ముంబైలో తయారు చేసిన అతి పెద్ద విగ్రహంగా చెప్పవచ్చు.

APS కాలేజ్ గ్రౌండ్, బస్వంగుడి

APS కాలేజ్ గ్రౌండ్, బస్వంగుడి

బస్వంగుడి APS కాలేజ్ కాలేజ్ మైదానంలో గణేష్ ఉత్సవంను పెద్ద స్థాయిలో ఏర్పాటు చేస్తారు. బెంగుళూర్ లో పురాతన మరియు అత్యంత తత్వ గణేష్ ఉత్సవాలలో ఒకటిగా ఉంది.

GBS సమాజ్ గణేష్ ఉత్సవం

GBS సమాజ్ గణేష్ ఉత్సవం

గణపతి బప్పా సింహాసనాన్ని 24 క్యారెట్ల దృఢమైన బంగారంతో తయారు చేయుట వలన ఖచ్చితంగా ముంబైలో ఒక ధనిక వినాయక ఉత్సవంగా చెప్పవచ్చు.

English summary

Richest Ganesha Festivals Of India

Ganesh Chaturthi is a festival that celebrated with much pomp and splendour in India. The main states were Ganapati puja is really big are Maharashtra, Karnataka and Andhra Pradesh.
Desktop Bottom Promotion