By : Boldsky Video Team
Published : September 24, 2019, 03:00
Duration : 01:37
01:37
వామ్మో.. ఒక ఆపిల్లో 100 మిలియన్ల బ్యాక్టీరియా !
రోజుకో ఆపిల్ తింటే అనారోగ్యం దరి చేరదనే సంగతి తెలిసిందే. ఆపిల్ పండ్లలో బోలెడు పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలని భావించే వారికి ఆపిల్ తినాలని సూచిస్తారు. కానీ 240 గ్రాముల బరువున్న ఆపిల్లో 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని తెలుసా? ఈ బ్యాక్టీరియా కారణంగా ఒక్కోసారి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆపిల్ పండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆపిల్ పండ్లను ఆర్గానిక్, సంప్రదాయ పద్ధతుల్లో పండిస్తారు. ఈ రెండింటిలోనూ బ్యాక్టీరియా ఉంటుంది.