Tap to Read ➤

ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారంటే?

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏటా ఛైత్ర మాసంలో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు.
Venkatesh S
ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2022 ఏడాదిలో ఏప్రిల్ 2వ తేదీన శనివారం రోజున ఈ పండుగ వచ్చింది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తమ రాశి చక్రాల జాతకలు, గ్రహాల స్థితిని అంచనా వేస్తారు. తమ జాతకంలో ఏవైనా దోషాలుంటే వాటి శాంతి కోసం కొన్ని పరిహారాలు పాటించడం, నివారణలు పాటించడం వంటివి చేస్తారు.
పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుడు ఈ అనంతమైన లోకాన్ని ఉగాది రోజున అంటే ఛైత్రమాసంలోని శుక్ల పక్షంలో పాడ్యమి రోజున సృష్టించాడని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.
ఛైత్ర మాసంలో శుక్ల పక్షం రోజున పాడ్యమి రోజున వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. అందుకే ఈరోజున కొత్త జీవితానికి నాందిగా భావిస్తూ వేడుకలు జరుపుకుంటారు.
‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. జన్మ ఆయుష్షు అనే అర్థాలొస్తాయి. అలాగే యుగం అంటే ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయణ ద్వయ సంయుతాన్ని యుగం అంటారు.
ఈ యుగానికి ఆది యుగాదిగా మారిందని.. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగానే ఈ ఉగాది వచ్చిందని పెద్దలు చెబుతంటారు.ఉగాది పండుగ రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది.
ఉగాది పండుగ రోజున గుమ్మానికి కట్టే తోరణాల వల్ల క్రిములు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయట. ఇవి శ్రీరామ నవమి వరకు పరిశుభ్రంగా ఉండటం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు.
ఉగాది రోజున పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చస్తారు. ఈ షడ్రుచులు మన జీవితంలోని అనేక విషయాలను సూచిస్తుంది.
మన లైఫ్ లో జరిగే అన్ని రకాల ఫీలింగ్స్ ఈ పచ్చడిలో ఉంటాయని చాలా మంది నమ్ముతారు. పచ్చడి తయారీలో వాడే ఒక్క పదార్థానికి ఒక్కో అర్థం ఉంటుంది.