Tap to Read ➤

ఉగాది వేళ ఇలా ఆరాధిస్తే శుభ ఫలితాలొస్తాయట...!

ఉగాది పండుగ సందర్భంగా మనం ఏ దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలొస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
కోయిల కుహుకుహూలు.. సరికొత్తగా చేసే పనులు.. ప్రతి ఇంటా అందమైన సొగసులు.. ప్రతి గుమ్మంలోనూ మామిడి తోరణాలతో అలంకరణలు.. ఇలా యుగయుగాల ఉగాది.. తరతరాల వారధిగా నిలుస్తోంది.
ఈరోజునే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తమ రాశి చక్రాల జాతకలు, గ్రహాల స్థితిని అంచనా వేస్తారు. తమ జాతకంలో ఏవైనా దోషాలుంటే వాటి శాంతి కోసం కొన్ని పరిహారాలు పాటించడం, నివారణలు పాటించడం వంటివి చేస్తారు.
ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఉగాది పచ్చడిని కచ్చితంగా రుచి చూస్తారు. పచ్చడిలో షడ్రుచులు ఎంతో రుచికరంగా ఉంటాయి.
హిందూ పురాణాల ప్రకారం, ఛైత్ర మాసంలో శక్ల పక్షం పాడ్యమి రోజున ఈ అనంతమైన లోకాన్ని బ్రహ్మ దేవుడు సృష్టించాడని.. ఆ రోజు నుండే ఈ లోకం ప్రారంభమయ్యిందని పండితులు చెబుతారు.
ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును విధిగా ఆరాధించాలని పండితులు చెబుతారు. అలాగే ఉగాది పండుగ రోజున మీ ఇష్టదేవతలకు ఉదయాన్నే ఏడు నుండి 10 గంటల మధ్యలోపు ఎప్పుడైనా పూజలు చేయొచ్చని పండితులు చెబుతున్నారు.
ఉగాది పండుగ రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకుని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి.
అందమైన పువ్వులతో అలంకరించి, చక్కనైన ముగ్గులు వేయాలి. ఆ తర్వాత ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. సాయంకాలం వేళలో కచ్చితంగా ఏదైనా ఆలయానికి వెళ్లి పంచాంగ శ్రవణం తప్పకుండా వినాలని పురాణాలు చెబుతున్నాయి.
ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటు ఛైత్ర నవమి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ తొమ్మిది రోజుల పాటు అనేక దేవాలయాల్లో వేడుకలను నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొనే దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల, మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయని పండితులు అంటున్నారు.
ఉగాది పండుగ రోజున మీరు పూజించే దేవుళ్లకు సమర్పించే నైవేద్యంలో పానకం, వడపప్పు, తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.