Tap to Read ➤

శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడో తెలుసా...

2022 సంవత్సరంలో శ్రీరామ నవమి తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత మరియు విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Venkatesh S
‘రామ’ అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ ఘనంగా జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం, శ్రీరాముడు త్రేతా యుగంలో వసంత కాలంలో ఛైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు.
పద్నాలుగేళ్లు అడవిలో వనవాసం చేసి, లంకలో రావణాసరుడిని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత శ్రీరామ నవమిని జరుపుకుంటారు.
ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కళ్యాణం జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కళ్యాణాన్ని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కళ్యాణం జరుపుకుంటారు.
చరిత్రను పరిశీలిస్తే.. ఛైత్ర మాసంలో తొమ్మిదో రోజైన నవమి రోజున మధ్యాహ్నం సమయంలో కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రఘ్నలు జన్మించారు.
ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమే రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం 51114 నుండి జనవరి 10వ తేదీన జన్మించి ఉంటారని భావిస్తున్నారు.